BigTV English

Wheat Flour Biscuits: గోధుమ పిండితో టేస్టీ బిస్కెట్లు.. పిల్లలకు బెస్ట్ స్నాక్..

Wheat Flour Biscuits: గోధుమ పిండితో టేస్టీ బిస్కెట్లు.. పిల్లలకు బెస్ట్ స్నాక్..

How to Make Tasty and Healthy Wheat Flour Biscuits: ఇంట్లో తయారు చేసే బిస్కెట్లు అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది మైదాపిండితో తయారు చేసిన బిస్కెట్లు.. కానీ గోధుమ పిండితో కూడా బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు.. చాలా హెల్దీ కూడా.. సాధారణంగా పిల్లలు బిస్కెట్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలా ఇంట్లోనే హెల్దీగా తయారు చేసిన బిస్కెట్లు.. పిల్లలకు చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇంకా పిల్లలకు ఆరోగ్యం కూాడా.  పిల్లలకు స్కూల్స్ స్నాక్ లాగా పెట్టొచ్చు . పైగా చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఇతి తక్కువ సమయంలోనే వీటిని తయారు చేసుకోవచ్చు. మరీ టేస్టీ అండ్ హెల్దీ గోధుమ పిండి బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలి? వాటికి కావాల్సిన పదార్ధాలేంటో తెలుసుకుందాం..


గోధుమ పిండి బిస్కెట్ల తయారీకి కావాలిసిన పదార్ధాలు

ఒక కప్పు గోధుమ పిండి


పావు టీ స్పూన్ యాలుకలు పొడి

చిటికెడు జాజికాయ పొడి

రుచికి సరిపడినంత సాల్ట్

నెయ్యి నాలుగు స్పూన్ లు

పంచదార పావుకప్పు

పాలు పావు కప్పు

ఆయిల్

చిటికెడు సోడా ఉప్పు

గోధుమ పిండి బిస్కెట్లనుతయారు చేసుకునే విధానం..

ముందుగా బిస్కెట్ల కోసం ఒక పెద్ద గిన్నెలో గోధుమపిండిని జల్లించి వేసుకోవాలి. ఇలా చేయండం వల్ల పిండిలో ఉండలు ఉండవు. ఒక బౌల్ తీసుకుని అందులో పాలు, పంచదార, యాలుకలు పొడి, నెయ్యి, జాజికాయ పొడి, వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, చిటెకెడు వంట సోడా, గోధుమ పిండి వేసి బాగా కలిపి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత కలిపిన పిండిని 10 నిమిషాలు అలానే ఉంచి మూత పెట్టి కాపేపు పక్కన పెట్టుకోవాలి.

Also Read: ఈ సమస్యలు ఉన్నవారు యాపిల్ పండు అస్సలు తినకూడదు.. ఎందుకంటే ?

ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకొని.. సగభాగం చపాతీలాగా మందంగా చేసుకోవాలి. వాటిని మీకు కావాల్సిన షేప్‌లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని కడాయిలో నూనె వేడయ్యాక అందులో వేసి బాగా ఎర్రగా అయ్యేంత వరకు డీ ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. అంతే మీకు ఎంతో రుచికరంగా టేస్టీ గోధుమ పిండి బిస్కెట్లు రెడీ అయినట్లే. ఈ బిస్కెట్లను గాలి తగలకుండా నిల్వ చేస్తే కనీసం 10-15 రోజులైన నిల్వ ఉంటాయి. ఇంకెందుకు లేట్ మీరు ఓ సారి ట్రై చేయండి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×