Marriage Video Viral: ఒక్క మర్డర్.. హనీమూన్‌కి అర్థాన్నే మార్చేసింది. ఆ ఒక్క మర్డర్.. మేఘాలయా టూరిజం అంటేనే వణుకు పుట్టేలా మార్చింది. కట్టుకున్న భర్తను కాటికి పంపేందుకు ఆ భార్య వేసిన స్కెచ్.. ఇండియా మొత్తం అవాక్కయ్యేలా చేసింది. హనీమూన్ పేరుతో.. భర్తను హనీ ట్రాప్ చేసిన ఆ నవ వధువే.. సీక్రెట్ కిల్లర్ అని తేలాక.. ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ క్రమంలో సోనమ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పెళ్లి వీడియో వైరల్
సోషల్ మీడియాలో ఓ వ్యక్తి వారిద్దరి పెళ్లి వీడియోను షేర్ చేశాడు. ‘సోనమ్, రాజా రఘువంశీల వివాహ వీడియోను ఓ సారి చూడండి. సోనమ్‌కు ఈ మ్యారేజ్ ఇష్టం లేదన్న సంగతిని మీరు కూడా అంగీకరిస్తారు. ఆ వివాహానికి సోనమ్ నో చెప్పకుండా ఉండి ఉంటే.. రాజా బతికి ఉండేవాడు. కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించే ధైర్యం ఉంది కానీ, ప్రియుడితో లేచిపోయే ధైర్యం లేదా.. సైకోలా ఉంది. ఇందులో సోనమ్ తల్లిదండ్రుల తప్పుకూడా ఉంది.
రాజా రఘువంశీ.. సోనమ్ నుదిటిలో సిందూరం పెడుతూ
సోనమ్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. వారికి ముందే తెలిసి ఉండాలి. రాజాకు ఈ విషయం దాచిపెట్టి వివాహం చేశారని రాసుకొచ్చాడు. ఇక అతడు షేర్ చేసిన వీడియోలో రాజా రఘువంశీ.. సోనమ్ నుదిటిలో సిందూరం పెడుతూ ఉన్నాడు. ఆ టైమ్‌లో సోనమ్ ముఖంలో ఎలాంటి సంతోషం లేదు. బాధ మాత్రమే ఉంది. నేల వైపు చూస్తూ ఉంది. 15 సెకన్ల వీడియోలో రాజా ఎంతో ఆనందంగా ఉన్నాడు. సోనమ్ మాత్రం దిగాలుగా కూర్చుంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. సోనమ్ తీరును తప్పుబడుతున్నారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని.. భర్తను చంపటం ఏంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
భర్త రాజా రఘువంశీని చంపించిన భార్య సోనమ్
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌కు.. మే 11న వివాహం జరిగింది. వాళ్లిద్దరూ మే 20న హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్ వెళ్లారు. ఈ కొత్త జంట మే 22న ఓ బైక్‌ని అద్దెకు తీసుకొని.. మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆరోజు రాత్రి ఓ హోమ్ స్టేలో గడిపారు. మే 23న హోమ్ స్టే నుంచి చెక్ అవుట్ చేసిన తర్వాత ఉదయం బయటకు వెళ్లేటప్పుడు కనిపించారు. అప్పటిదాకా కుటుంబసభ్యులతో టచ్‌లో ఉన్నారు. అక్కడి నుంచి గైడ్ లేకుండానే.. రాజా, సోనమ్ మావ్లాఖైట్ గ్రామానికి వెళ్లారు. అక్కడే వారి ఆచూకీ గల్లంతైంది. దాంతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. నవదంపతులిద్దరూ అదృశ్యమైన 11 రోజుల తర్వాత.. జూన్ 2న భర్త రాజా రఘువంశీ శవమై కనిపించాడు. సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో.. లోతైన లోయలో రాజా మృతదేహం కనిపించింది. అతన్ని.. కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి చంపించిన సోనమ్
కాగా.. నవ దంపతులు రాజా రఘువంశీ, సోనమ్ మిస్సింగ్ కేసు.. మేఘాలయ పోలీసులకు సవాల్‌గా మారింది. హనీమూన్ కోసం వచ్చిన జంట.. ఉన్నట్టుండి కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. ఈ కేసు.. ఆ రాష్ట్ర పర్యాటకరంగంపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. టూరిస్టులకు ఆ స్టేట్ సేఫ్ కాదనే ప్రచారం జరిగింది. మేఘాలయకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు కూడా ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడెక్కడో వెతికారు. ఎన్నో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. వారి సెల్ ఫోన్ టవర్ల లొకేషన్లు గుర్తించేందుకు ఎన్నో తిప్పలు పడ్డారు. 11 రోజుల పాటు అక్కడి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. నవ వధువు సోనమ్‌ని ఎవరేం చేశారో.. ఎక్కడికి తీసుకెళ్లారో.. ఆమెని ఏం చేశారో అనే భయం అందరిలోనూ తలెత్తింది.
పోలీసుల దర్యాప్తులో భయంకరమైన విషయాలు
సోనమ్ కుటుంబసభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ.. ఆ కొత్త పెళ్లికూతురుకు ఏమైందోనని ఆందోళనకు గురయ్యారు. కానీ.. అనూహ్యంగా ఆమె భర్త రాజా మృతదేహం దొరకడంతో.. ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ హనీమూన్ మర్డర్ కేసులో మరో భయంకరమైన ట్విస్ట్ బయటకొచ్చింది. రాజా రఘువంశీ భార్య సోనమే.. తన భర్తను చంపించిందని పోలీసులు తేల్చారు. సోనమ్ తన భర్తను చంపేందుకు.. సుపారీ ఇచ్చి.. కిరాయి హంతకులను నియమించిందని దర్యాప్తులో తేలింది.
సోనమ్‌కు రాజ్‌కుశ్వాహాతో సంబంధం ఉందనే ప్రచారం
సంచలనం సృష్టించిన ఈ మర్డర్ కేసులో.. నిందితురాలు సోనమ్ ఉత్తర్‌ప్రదేశ్ ఘాజీపూర్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. మిగతా ముగ్గురు నిందితులను వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. సోనమ్‌తో పాటు విక్కీ ఠాకూర్, ఆకాశ్, ఆనంద్‌ని.. హత్యకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. రఘువంశీని చంపేందుకు అతని భార్య సోనమ్.. తమకు సుపారీ ఇచ్చినట్లు నిందితులు విచారణలో తెలిపారు. ఇన్వెస్టిగేషన్‌లో రాజ్‌కుశ్వాహా పేరు బయటకొచ్చింది. సోనమ్‌కు.. రాజ్‌కుశ్వాహాతో సంబంధం ఉందని.. అతనే రఘువంశీ హత్యకు కుట్ర పన్నాడనే ప్రచారం జరుగుతోంది. ప్రాథమిక దర్యాప్తులో సోనమ్‌కు వివాహేతర సంబంధం ఉందని.. అందుకోసమే ఆమె ప్లాన్ చేసి తన భర్తను చంపించిందని.. పోలీసులు చెబుతున్నారు. ఈ హనీమూన్ ట్రిప్ మొత్తం.. రాజా రఘువంశీని చంపేందుకే ప్లాన్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరుగుతోంది.
రాజాని చంపేందుకే హనీమూన్ ట్రిప్ ప్లాన్!
ఈ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్‌తో ఇండియా మొత్తం అవాక్కైంది. సోనమ్ చేసిన పనితో.. ఓ రాష్ట్ర టూరిజం ఇమేజ్‌పైనే ప్రశ్నలు తలెత్తాయి. చాలా మందికి ఈ కేసులో ప్రధాన సూత్రధారి సోనమేనని.. ఆవిడే తన భర్తను చంపిందని తెలియకపోవచ్చు. అలాంటి వాళ్లంతా.. మేఘాలయ సేఫ్ కాదనే అనుకుంటారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయ్. అయినా.. రాజా రఘువంశీతో సోనమ్‌కి పెళ్లి ఇష్టం లేకపోతే.. ముందే చెప్పాలి గానీ.. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని.. హనీమూన్ పేరు చెప్పి.. భర్తను చంపించడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ముందే చెప్పి ఉంటే.. రాజా రఘువంశీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు కదా? అంటున్నారు. అనవసరంగా రాజాని ఎందుకు బలి చేశారనే వాదనలు వినిపిస్తున్నాయ్. సోనమ్ లాంటి వాళ్లకు.. అసలు బతికే అర్హతే లేదని.. ఆమెను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
Just take a look at this wedding video of Sonam and Raja Raghuvanshi and you will agree that Sonam was clearly not happy with this marriage.
Raja Raghuvanshi would have been alive if Sonam had said No to the marriage. She had the courage to hire contract killers but didn't had… pic.twitter.com/NbHlQQWzXK
— Incognito (@Incognito_qfs) June 9, 2025