E-Paper
Advertisement

Viral Video: ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చి ఇదేం పాడు పని.. స్విగ్గీ బాయ్ ఏం చేశాడో చూడండి

Viral Video: ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చి ఇదేం పాడు పని.. స్విగ్గీ బాయ్ ఏం చేశాడో చూడండి
Advertisement

Viral Video: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా ఇంట్లో వంట చేసుకోవడానికి ఏ ఒక్కరికి కూడా టైం ఉండట్లేదు. ఉరుకులు పరుగులు తీసే లైఫ్‌లో వండుకోడానికి టైం లేక బయటి నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినే రోజులు వచ్చాయి. దీంతో ప్రముఖ పుడ్ డెలివరీ ప్లాట్ ఫాంలకు గిరాకీ పెరిగిపోతుంది. జొమాటో, స్విగ్గీ వంటి వాటిల్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని వంట చేసే పనుల నుంచి కాస్త తీరిక పొందుతున్నారు. ఈ తరుణంలోనే తాజాగా ఓ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాం అయిన స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసింది. ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన స్విగ్గీ బాయ్ చేసిన పనికి షాక్ అయింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫుడ్ డెలివరీ బాయ్స్ నమ్మకంగా ఫుడ్ డెలివరీ చేస్తారని అనుకుంటాం. కానీ కొన్ని సార్లు వారు చేసే పనికి షాక్ అవ్వాల్సి వస్తుంది. తాజాగా అలాంటిదే ఓ ఘటన జరిగింది. ఓ ఇంట్లో ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన స్విగ్గీ బాయ్ దొంగతనానికి పాల్పడ్డాడు. మహిళ ఫుడ్ తీసుకుని వెళ్లగానే పట్టపగలే ఇంటి ముందు దొంగతనం చేశాడు.

Advertisement

స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ఇంటికి ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లిన స్విగ్గీ బాయ్ దొంగతనానికి పాల్పడ్డాడు. ఇంట్లోని మహిళకు ఫుడ్ ఇచ్చి అనంతరం చేతి వాటం ప్రదర్శించాడు. అపార్ట్మెంట్ లో ఓ ఇంటి డోరు కొట్టిన స్విగ్గీ బాయ్ అక్కడే ఇంటి బయట ఉన్న నైక్ షూలను చూశాడు. అనంతరం ఇంట్లోని మహిళ డోర్ తీసి ఫుడ్ తీసుకుని డోర్ వేసింది. దీంతో అటు, ఇటూ దిక్కులు చూస్తే ఎవరైనా వస్తున్నారా అని గమనించడం ప్రారంభించాడు. అనంతరం తన తలకు కట్టుకున్న టవాల్ తీసి ముఖాన్ని తుడుచుకున్నాడు. కొన్ని మెట్లు దిగి ఎవరైనా వస్తున్నారా అని మరోసారి చూశాడు. ఇక ఇంట్లో వారు ఏమైనా బయటకు వస్తున్నారా అని చెక్ చేశాడు. ఇక వెంటనే బయట ఉన్న నైక్ షూలను తన టవాల్ లో చుట్టుకుని గబగబా మెట్లు దిగాడు. ఈ తంతంగం అంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన హర్యానాలో వెలుగుచూసింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోతో సహా వ్యక్తిపై స్విగ్గీ కంపెనీకి కస్టమర్ కంప్లైంట్ చేశాడు. కానీ ఇప్పటి వరకు స్విగ్గీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

Advertisement

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×