BigTV English

Best Selling Bikes In India : వీటి అమ్మకాలకు బ్రేకులేయడం కష్టమే.. సెల్స్‌లో దూసుకుపోతున్న బైకులు ఇవే!

Best Selling Bikes In India : వీటి అమ్మకాలకు బ్రేకులేయడం కష్టమే.. సెల్స్‌లో దూసుకుపోతున్న బైకులు ఇవే!

Best Selling Bikes In India : దేశంలో టూ వీలర్ విక్రయాలు గతేడాది జోరుగా జరిగాయి. బైకులు వినియోగించే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. బైక్ అనేది జీవితంలో అవసరంగా మారింది. మన జీవితంలో ఒక భాగమైపోయింది. కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్కెట్‌లోకి టూ వీలర్స్‌ను తీసుకొస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్, లేటెస్ట్ టెక్నాలజీతో బైకులను అందిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశంలో విక్రయించబడిన ద్విచక్ర వాహనాల డేటాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ అసోసియేషన్ సేకరించింది. దీని ప్రకారం.. ఏ కంపెనీ ఎన్ని వాహనాలను విక్రయించిందో తెలుసుకుందాం.

Also Read : ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆఫర్ల వర్షం.. వీటిని వదలొద్దు!


Hero MotoCorp

ప్రపంచంలోనే అతిపెద్ద 2-వీలర్ కంపెనీ అయిన హీరో మోటోకార్ప్ ప్రతి నెల 4 నుంచి 5 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది. గతేడాది కంపెనీ దాదాపు 53,95,924 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంటే గడిచిన సంవత్సరంలో హీరో దేశంలో దాదాపు 54 లక్షల ద్విచక్ర వాహనాలను సేల్స్ చేసింది. అయితే ఏప్రిల్ 2022 – మార్చి 2023 సంవత్సరంలో హీరో 51,35,129 ద్విచక్ర వాహనాలు మాత్రమే అమ్ముడుపోయాయి. హీరో మోటోకార్ప్ విక్రయాలు 5.08 శాతం పెరిగాయి.

Honda Motors

ఇక హోండా మోటర్స్ విషయానికి వస్తే 2023-24 సంవత్సరంలో కంపెనీ 40,92,126 ద్విచక్ర వాహనాలు విక్రయించి రెండో స్థానంలో నిలిచింది. అయితే FY 2022-23లో హోండా ద్విచక్ర వాహనాల విక్రయాలు 40 లక్షల మార్క్‌ను చేరుకోలేదు. హోండా గతేడాది దేశంలో 1,18,940 ద్విచక్ర వాహనాలను మాత్రమే సేల్స్ చేసింది.

TVS Motors

టీవీఎస్ గత ఆర్థిక సంవత్సరం మొత్తం 29,65,744 ద్విచక్ర వాహనాలను సేల్ చేసింది. ఈ లెక్కల ఆధారంగా సంస్థ మూడో స్థానంలో నిలిచింది. వీటిలో టీవీఎస్ 3-వీలర్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ టీవీఎస్ 29,65,744 వాహనాలను మాత్రమే విక్రయించింది. సంస్థ 2022-23లో 24,89,121 ద్విచక్ర వాహనాలను సేల్ చేసింది. ఈ నేపథ్యంలో టీవీఎస్ ద్విచక్రవాహనాల అమ్మకాలు దాదాపు 4,76,623 మేర పెరిగాయి.

Also Read : అమ్మకాల్లో దుమ్మురేపుతున్న ఈవీ కార్స్.. ఫస్ట్ ప్లేస్‌లో ఇదే!

Bajaj Auto India

ఇక చివరగా బజాజ్ ఆటో ఇండియా విషయానికి వస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 21 లక్షల 8,049 ద్విచక్ర వాహనాలను సేల్ చేసి నాల్గో స్థానంలో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బజాజ్ 17 లక్షల 4,445 ద్విచక్ర వాహనాలు మాత్రమే విక్రయించింది.

Tags

Related News

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Big Stories

×