BigTV English

Viral Video: పెట్రోల్ అయిపోయిన కస్టమర్ బండి దిగట్లేదని తోసుకుంటూ వెళ్లిన రాపిడో డ్రైవర్

Viral Video: పెట్రోల్ అయిపోయిన కస్టమర్ బండి దిగట్లేదని తోసుకుంటూ వెళ్లిన రాపిడో డ్రైవర్

Viral Video: ప్రస్తుతం ఏ నగరంలో చూసినా క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి. ఏ సమయం అయినా సరే ఒక్క సారి బుక్ చేస్తే నిమిషాల్లో కళ్ల ముందుకు వచ్చేస్తున్నాయి. ఇందులో ర్యాపిడో, ఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులకు విపరీతమూన డిమాండ్ పెరిగిపోయింది. అయితే ఈ సర్వీసులు క్షణాల్లోనే అందుబాటులో ఉన్నా కూడా కొన్ని సార్లు వాహనాలు అనే సరికి ఏదో ఒక సమస్యలు తలెత్తుతుంటాయి. దారిలో వెళ్తుంటే పెట్రోల్ లేక బండి ఆగిపోవడం, బ్రేకులు ఫెయిల్ కావడం, టైర్ పంచర్ కావడం వంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో కస్టమర్లు లేదా ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురవుతుంటారు.


ఇటీవల ఓ చోట క్యాబ్ టైర్ పంచర్ కావడంతో మధ్యలో నిలిపివేశాడని ఓ మహిళ అతడితో గొడవకు దిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అటువంటి తరహాలోనే ఓ వీడియో నెట్టింట మరోసారి దర్శనమిచ్చింది. ఓ కస్టమర్ తన గమ్యానికి చేరుకునేందుకు ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. ఈ తరుణంలో కస్టమర్ వద్దకు వెళ్లగానే పెట్రోల్ అయిపోయిందని తెలిసింది. దీంతో కస్టమర్ కు ఈ విషయం చెప్పగా బైక్ ఎక్కి అలాగే కూర్చున్నాడు.

పెట్రోల్ అయిపోయిన విషయం చెప్పినా కూడా ప్రయాణికుడు బైక్ దిగకపోవడంతో ఏం చేయలేక ర్యాపిడో డ్రైవర్ బండిపైన వ్యక్తిని అలాగే కూర్చోబెట్టుకుని తోసుకుంటూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


Related News

Gigi Hadid: కేవలం ఆ టేపు చుట్టుకుని నడిచినందుకు రూ.80 కోట్లు చెల్లించారట.. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటీ?

Viral Video: మినీ బస్సులో సముద్రంలో షికారు.. ఒక్క భారీ కెరటంతో సీన్ మారిపోయింది!

Viral News: కొట్టేయడం నా హాబీ.. చోరీ కేసులో మహిళ సర్పంచ్ అరెస్ట్, ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు ఔట్!

Viral Video: పరాయి మగాడితో అడ్డంగా దొరికిన భార్య.. తట్టుకోలేక భర్త..

Shocking: శిశువును ఫ్రీజర్ లో పెట్టి నిద్రపోయిన తల్లి.. వామ్మో ఇదేం ఘోరం?

Meenu Raj: ఒకప్పుడు తిండి లేక పస్తులు.. ఇప్పుడు చేతినిండా డబ్బు, పెద్ద ఇల్లు.. ఈమె ఎవరో తెలుసా?

×