E-Paper
Advertisement

Shocking Video: ఛ.. ఇంట్లో ఒక్క రూపాయి లేదు.. కెమెరా ముందు కష్టం చెప్పుకున్న దొంగ..!

Shocking Video: ఛ.. ఇంట్లో ఒక్క రూపాయి లేదు.. కెమెరా ముందు కష్టం చెప్పుకున్న దొంగ..!
Advertisement

Shocking Video: సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు వైరల్ అవుతున్నా కూడా దొంగతనానికి సంబంధించిన వీడియోలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. దొంగలు చేసే దొంగతనాలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలిసి ఉండదు. కానీ కొన్ని సార్లు దొంగలు చేసే పనులు మాత్రం విచిత్రంగా ఉంటాయి. దొంగల ప్రయత్నాలు, వారు చేసే పనుల గురించి తెలిసి చాలా మంది జాగ్రత్తలు పడుతుంటారు. ఇంట్లో నగదు, బంగారం జాగ్రత్తగా పెట్టి ఊర్లకు వెళుతుంటారు. అయితే ఇలా చేసినా కూడా దొంగలు వాటి వాసన పసిగట్టి అయినా ఇళ్లంతా ఊడ్చేసి వెళ్తుంటారు. కానీ దొంగతనానికి వెళ్లిన ఓ దొంగకి తాజాగా చేదు అనుభవం ఎదురైంది.

ఎప్పటి మాదిరి తన దొంగతనంలో భాగంగా ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లాలని అనుకున్నాడు. ఇంట్లో ఎవరులేని సమయం చూసి దొంగతనం చేసి సొమ్ము సంపాదిద్దాం అనుకున్నాడు. కానీ ఆ దొంగకు మాత్రం చివరికి నిరాశే మిగిలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో షాకింగ్ దొంగతనం ఒకటి వెలుగుచూసింది. మహేశ్వరం మండల కేంద్రంలో ఓ ఇంట్లో దొంగ చోరీ కోసం వచ్చాడు. ఎవరు లేని సమయం చూసి ఇంట్లో దొంగతనం చేయాలని ప్రయత్నించాడు.

Advertisement

ఈ తరుణంలో నెమ్మదిగా ఇంట్లోకి ఎవరు చూడకుండా ప్రవేశించి ఇళ్లంతా దోచేయాలని అనుకున్నాడు. కానీ ఎంతో ఆశతో వెళ్లిన ఆ దొంగకు నిరాశే మిగిలింది. ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన దొంగకి ఏమి దొరకకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ తరుణంలో ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల వైపు చూస్తూ ‘ ఒక్క రూపాయి కూడా లేదు ‘ అంటూ సైగ చేస్తూ వెనుతిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు కూడా దొంగ ఆవేదన పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×