BigTV English

NITI Ayog: దీదీ రూటే సెపరేటు.. విపక్ష సీఎంలది ఒక దారి.. ఆమెది మరోదారి

NITI Ayog: దీదీ రూటే సెపరేటు.. విపక్ష సీఎంలది ఒక దారి.. ఆమెది మరోదారి

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విపక్ష పార్టీలను, విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు షాక్ ఇచ్చారు. విపక్ష ఇండియా కూటమిలో ఆమెది ఎప్పుడూ ప్రత్యేకమైన విధానంగానే ఉన్నది. కూటమిలో చేరుతారా? లేదా? అనేది చాన్నాళ్లు సస్పెన్స్‌లో ఉండగా.. ఆ తర్వాత కూటమిలో చేరనని, కానీ, బయటి నుంచి సపోర్ట్ చేస్తానని ప్రకటించారు. మొత్తానికి కూటమిలో భాగంగా టీఎంసీ ఉన్నది. అదే కూటమిలోని లెఫ్ట్ పార్టీలపై ఆమె విమర్శలు సంధిస్తారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోలేమని, వారిని ఓడించే బెంగాల్‌లో అధికారంలోకి వచ్చామని టీఎంసీ చాలా సార్లు చెప్పింది. దీంతో విపక్ష కూటమి ఎన్నాళ్లు నిలబడుతుందా? అనే డౌట్ చాలా మందికి వచ్చింది. మ్యాజిక్ ఫిగర్‌కు ఆమడ దూరంలో నిలిచిన ఇండియా కూటమి వచ్చే ఐదేళ్ల వరకు నిలబడుతుందా? లేదా? అనే అనుమానాలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ భిన్న స్వరం వినిపించారు. విపక్ష సీఎంలకు భిన్నమైన మార్గాన్ని ఆమె ఎంచుకున్నారు.


కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో విపక్ష రాష్ట్రాలకు అన్యాయం చేశారని, బడ్జెట్ కేటాయింపుల్లో మొండిచేయి చూపారని ఇండియా కూటమి నేతలు విమర్శలు సంధించారు. ఇందుకు నిరసనగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని తాము బాయ్‌కాట్ చేస్తున్నట్టు కొందరు ముఖ్యమంత్రులు ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కులు ఈ మీటింగ్‌కు హాజరుకాబోమని తెగేసి చెప్పారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఇదే ప్రకటన చేశారు.

Also Read: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇలా కూడా చేస్తారా?.. కస్టమర్‌కు చుక్కలు చూపించిన ఫుడ్ డెలివరి బాయ్!


తొలుత మమత బెనర్జీ కూడా ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు, అందుకే తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా, ఆమె ఈ వార్తలను కొట్టిపారేశారు. తాను నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతానని కుండబద్దలు కొట్టారు. శనివారం ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి హాజరు కావడానికి ఆమె శుక్రవారమే ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీ టూర్ వెళ్లడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ స్పష్టత ఇచ్చారు. బెంగాల్ పట్ల చూపిస్తున్న రాజకీయ వివక్షపై నీతి ఆయోగ్‌లో నిరసన తెలియజేస్తానని, కేంద్ర బడ్జెట్‌లో బెంగాల్, ఇతర విపక్ష రాష్ట్రాల పట్ల వివక్ష చూపించారని ఆమె ఫైర్ అయ్యారు. దీన్ని తాము ఎప్పటికీ అంగీకరించబోమని చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశంలో తన వాణి బలంగా వినిపిస్తానని, అందుకు అనుమతించని పక్షంలో నిరసన తెలిపి సమావేశం నుంచి బయటికి వచ్చేస్తానని మమతా బెనర్జీ వివరించారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×