BigTV English
Advertisement

Islamabad: పాకిస్తాన్ రాజధాని ఇంత చెత్తగా ఉంటుందా? చూస్తే వాంతి చేసుకుంటారేమో!

Islamabad: పాకిస్తాన్ రాజధాని ఇంత చెత్తగా ఉంటుందా? చూస్తే వాంతి చేసుకుంటారేమో!

దాయాది దేశ పాకిస్తాన్ లో పరిస్థితుల గురించి తరచుగా వార్తలు వింటూనే ఉంటాం. కనీసం అక్కడ తినడానికి తిండిలేక, ఇబ్బందులు పడే జనాలు ఎంతో మంది ఉంటారని, రోటీ చేసుకునేందుకు చపాతీ పిండి కూడా దొరకని పరిస్థితి ఉందని  మీడియా, సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఇంతకాలం మనం కేవలం వినడం మాత్రమే, ఇప్పుడు విన్నది వాస్తవమేనని తేల్చే వీడియోలు బయటకు వచ్చాయి. ఏకంగా ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ ఎంత ఘోరంగా ఉంటుందో ఈ వీడియోలు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ వీడియోల్లో అసలు ఏం ఉందంటే..


గుట్టలుగా పేరు కుపోయిన చెత్త.. మురికి కూపాలుగా వీధులు..

తాజాగా ఓ ఇంటర్నేషనల్ యూట్యూబర్ పాకిస్తాన్ లో పర్యటించాడు. పాక్ రాజధాని ఇస్లామాబాద్ ను విజిట్ చేశాడు. ఈ సందర్భంగా నగరంలోని పరిస్థితులను వీడియో తీశాడు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు   వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇంత దుర్భరంగా ఉంటుందా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నగరం అంతా మురికి కూపంగా మారిపోయింది. రోడ్లన్నీ చెత్తా చెదారంతో నిండిపోయి ఉన్నాయి. రోడ్ల పక్కనే అభాగ్యులు రోగాలు రొస్టులతో బతుకీడుస్తున్నారు. ఇంకా కాస్త లోపలికి వెళ్తే గుట్టలు గుట్టులుగా పేరుకుపోయిన చెత్త చెదారంతో దుర్గందం వెదజల్లుతున్నది. పశువులు, కుక్కలు, ఎక్కడ పడితే అక్కడే దర్శనం ఇస్తున్నాయి. రోడ్ల పక్కనే మూత్రం పోసే జనాలు, వాంతులు చేసుకుంటున్న మనుషులు.. వామ్మో అత్యంత భయంకరంగా ఉంది. మురికి మోరీలన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలతో కూరుకుపోయాయి. నగరం అంతా ఇదే పరిస్థితి ఉంది. పాకిస్తాన్ రాజధానే ఇలా ఉంటే, మిగతా నగరాల పరిస్థితి ఏంటని ఆందరూ షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

పాకిస్తాన్ దుస్థితిని ఎండగట్టే వీడియోలు బయటకు రావడంతో ప్రపంచం షాక్ అవుతోంది. వామ్మో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వ్యక్తులా భారత్ మీద కయ్యానికి కాలు దువ్వేది అని ఆలోచిస్తున్నారు. కాశ్మీర్ కావాలనే తీరని కోరికను ముందు వేసుకు, ఉగ్రవాదాన్ని ఎదగదోసే బదులుగా అదే డబ్బులతో అక్కడి ప్రజల బతుకులను బాగు చెయ్యొచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారు. అక్కడి దారుణ పరిస్థితుల నుంచి.. ఆ దేశ జనాలతో పాటు యావత్ ప్రపంచం దృష్టి మళ్లించాలనే ఉద్దేశంతోనే భారత్ మీద ఉగ్రదాడులకు పాల్పడుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  సహనంతో ఉన్న వారిని రెచ్చగొట్టి ఆగం కావడం కంటే, సొంత దేశం మీద కాస్త దృష్టి పెడితే బాగుంటుందని మరికొంత మంది సూచిస్తున్నారు. అక్కడి ప్రజలకు ఏమాత్రం తెలివి ఉన్నా, వెంటనే పాలకులపై తిరగబడాలని, తమ బతుకులను మార్చాలని కొట్టాడాలని మరికొంత మంది సూచిస్తున్నారు. భారత్ మీద వ్యతిరేకతను మానుకొని తమ మీద దృష్టి పెట్టాలని కోరాలంటున్నారు.

Read Also: పాక్ సైనికులు పిరికిపందలు.. ఆర్మీ చీఫ్‌ని తిట్టిపోసిన పాక్ పోలీసులు

Related News

Viral News: 3 నెలలు ఆఫీస్ కు వెళ్లకున్నా పట్టించుకోలేదట, వామ్మో ఇలా కూడా ఉంటారా?

Farmers Debt Clears: తల్లికి నిజమైన నివాళి.. 290 మంది రైతుల అప్పులు తీర్చేసిన వ్యాపారి

Tirumala Tallest Woman: ఏయ్ బాబోయ్‌ ఎంత పొడుగో.. తిరుమలలో ఎత్తైన మహిళ సందడి

Viral Video: రోడ్డు మీద కూల్ డ్రింక్ బాటిల్ పగలగొట్టిన బైకర్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!

High Court Verdict: కోడలికి షాకిచ్చిన హైకోర్ట్.. ఆమె జీతంలో రూ.20 వేలు మావయ్యకు చెల్లించాలని తీర్పు, ఎందుకంటే?

Viral Video: పేషెంట్ ను నడిరోడ్డు మీద స్ట్రెచర్ మీద తోసుకెళ్లిన బంధువులు, మరీ ఇంత ఘోరమా?

Viral News: నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. న్యూస్ పేపర్‌లో ఊహించని ప్రకటన, ఎవరు ఆ ఆత్మారాం?

Pregnancy Job Scam: నన్ను తల్లిని చేస్తే రూ.25 లక్షలిస్తా.. యువతి బంపర్ ఆఫర్, కక్కుర్తి పడి వెళ్లినోడు ఏమయ్యాడంటే?

Big Stories

×