Kajal: బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్ధక్ అంటే తెలియని వారు ఉండరు. యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించి, రియాలిటీ, టీవీ ప్రోగ్రామ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా అఖిల్ రన్నర్ అప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆహాలో ప్రసారమయ్యే వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ 2 తో మన ముందుకు రానున్నారు. ఇందులో భాగంగా షూటింగ్ సమయంలో ఆర్జె కాజల్ పై కామెంట్స్ చేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వివరాలలోకి వెళితే..
ఆలా కాజల్ పరువు పోయే ..
ప్రముఖ ఓటీటీ ఆహాలో వేరే లెవెల్ ఆఫీస్ రెండో సీజన్ ప్రారంభం కానుంది. ఈ వెబ్ సిరీస్ లో నిఖిల్, ఆర్జె కాజల్ అఖిల్ సార్ధక్, రీతు చౌదరి, మహేష్ విట్టా, ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గత ఏడాది తెలుగు కామెడీ వెబ్ సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్ మన ముందుకు వచ్చింది. దాని సీక్వెల్ గా రెండో సీజన్ తో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రతి గురువారం ఓ సరికొత్త ఎపిసోడ్ ను ఆహాలో రిలీజ్ చేస్తారు. తాజాగా షూటింగ్ లో భాగంగా, డబ్బింగ్ చెప్పడానికి కాజల్, అఖిల్ ఇద్దరూ ఆఫీస్ కి వెళ్తుండగా.. కాజల్, కారు ఎక్కేటప్పుడు, డ్రైవింగ్ సీట్ వైపు కాకుండా, పక్కనుంచి కారు లోపలికి వెళుతుంది. అదంతా వీడియో తీస్తూ, అఖిల్, కాజల్ తో ఇలా కారు ఎక్కాలని నాకు అసలు తెలీదు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా డ్రైవింగ్ సీట్లోకి వెళ్లాలని నాకు అస్సలు తెలీదు. కారు ఎలా యూస్ చేయాలో నీలా ఎవరికీ తెలీదు అని అఖిల్ అంటూ.. వీడియోను తీసి దాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాజల్ ఎలాగైనా తొందరగా షూటింగ్ కి వెళ్లాలన్న హడావిడిలో కారు ఎక్కింది అన్నట్టు మనకి అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన వారంతా అఖిల్, కాజల్ పరువు తీసేశాడు అని కామెంట్స్ చేస్తున్నారు.
ఆ వెబ్ సిరీస్ ..
వేరే లెవెల్ ఆఫీస్ అంటూ వెబ్ సిరీస్ మొదటి భాగం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా రెండో భాగం ట్రైలర్ కూడా విడుదల చేశారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయిస్ ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎలాంటి తిప్పలు పడతారు. వర్క్ చేస్తూ, మిగిలిన ఎంప్లాయిస్ తో ఎలా పని చేస్తారు అనేది ట్రైలర్ లో చూపించారు. ఇక అఖిల్, నిఖిల్ ఇద్దరు బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకున్న వారే, అఖిల్ కెరియర్ ముత్యాలముగ్గు సీరియల్ తో మొదలైంది. ఆ తర్వాత జెమినీ టీవీలో వచ్చిన బంగారు గాజులు, కళ్యాణి, వంటి సీరియల్స్ లో నటించారు. ఇవే కాక అఖిల్ అవార్డు, టీవీ షోలలో యాంకర్ గా పని చేశారు. ఇటీవల తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అనే చిత్రంలోని నటిస్తున్నారు. ఇది భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో వస్తున్న చిత్రం. ఏది ఏమైనా బిగ్ బాస్ 4తో పాపులర్ అయిన అఖిల్, బిగ్బాస్ 8లో రియల్ మరింత పెరిగింది. ఇక కాజల్ ఆర్జేగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, బిగ్బాస్ సీజన్5 తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక బిగ్ బాస్ తో స్టార్ అయిన యాక్టర్స్ అందరూ ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా మన ముందుకు రానున్నారు.
Sree Vishnu : ఆ సీన్స్ డిలీట్ చేసి.. వాళ్ళకి సారీ చెప్పా
https://www.instagram.com/stories/akhilsarthak_official/3622345194433056263?utm_source=ig_story_item_share&igsh=OWoycTd4eW01aW5i