BigTV English

Pak Police vs Pak Army: పాక్ సైనికులు పిరికిపందలు.. ఆర్మీ చీఫ్‌ని తిట్టిపోసిన పాక్ పోలీసులు

Pak Police vs Pak Army: పాక్ సైనికులు పిరికిపందలు.. ఆర్మీ చీఫ్‌ని తిట్టిపోసిన పాక్ పోలీసులు

Pak Police vs Pak Army| భారత్ పాక్ ఉద్రిక్తల వేళ పాకిస్తాన్ సైన్యం పట్ల సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మొన్నటి దాకా పాకిస్తాన్ దేశానికి కశ్మీర్ ఆత్మ లాంటిదని ప్రగల్భాలు పలికిన పాక్ ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్ విదేశాలకు పారిపోయాడని ప్రచారం జరుగుతన్న నేపథ్యంలో పాకిస్తాన్ సైనికులంటేనే ఆ దేశంలో చులకన భావంతో చూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న వీడియోలోని దృశ్యాల ప్రకారం.. పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్ ఖ్వాల రాష్ట్రం లక్కీ మార్వాత్ ప్రాంతంలోని ఒక పోలీస్ స్టేషన్ లో పాకిస్తాన్ సైనికులు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కానీ వారిని లోపలి వచ్చేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీస్ స్టేషన్ బయట సైనికులు ముట్టడి చేశారు. ఫలితంగా పోలీసులు కూడా పోలీస్ స్టేషన్ లోపలి నుంచి సీల్ చేసినట్లుగా కనిపిస్తోంది. పోలీసులు పోలీస్ స్టేషన్ పై కప్పు వరకు ఎక్కి బయట నిలబడి ఉన్న పాక్ సైనికులపై తుపాకులతో గురి పెట్టారు.

పాకిస్తాన్ ఆర్మీకి చెందినవారెవరూ కూడా లోపలికి వచ్చేందుకు అనుమతి లేదని స్టేషన్ పై కప్పు నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ గట్టిగా కేకలు వేశాడు. అయినా కశ్మీర్ లో యుద్ధం జరిగే పరిస్థితులుంటే సైనికులు అక్కడికి వెళ్లి యుద్ధం చేయాలని.. అంతేకానీ స్థానిక, దేశీయంగా భద్రతా సమస్యలను పరిష్కారం సొంతంగానే చేసుకుంటామని అరిచాడు. “మీ ఆర్మీ చీఫ్ వచ్చినా అతను మా వెంట్రుకతో సమానం.. లోపలికి అనుమతించేది లేదు. మీరు ఇక్కడేం చూస్తున్నారు. కశ్మీర్ లో కదా మీరు ఉండాల్సింది. పాక్ సైనికులు పిరికిపందులు..  గుర్తంచుకోండి ఇది లక్కీ మార్వా పోలీస్ స్టేషన్ ఇక్కడ మీ పప్పులేం ఉండలేవు.” అని అన్నాడు. అసలు ఏ విషయంలో పోలీసులు


Also Read:  పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదం.. క్రికెట్ అభిమానిపై మూకదాడి చేసి హత్య

 

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ విదేశాలకు పారిపోయాడా లేదా రావల్పిండిలో తన కుటుంబంతో పాటు దాగి ఉన్నాడా అనే అంశంపై ఇప్పుడు అక్కడ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇండియాలో యుద్దం జరిగేలా పరిస్థితులు ఉంటే స్వయంగ పాక్ ఆర్మీ చీఫ్ కనిపించకపోవడంపై అన్నీ చోట్ల పాక్ సైనికులంటే చులకనభావంగా కామెంట్లు చేస్తున్నారు. పైగా యుద్ధం జరుగబోతోందని తెలిసే ఇప్పటికే పాక్ సైన్యం నుంచి వేల సంఖ్యలో సైనికులు, పై అధికారులు రాజీనామాలు చేస్తున్నారు.

ఏప్రిల్ 22, 2025న కశ్మీర్ పర్యటాక ప్రాంతం పహల్గాంలో జరిగిన మారణహోమంలో భారత పర్యాటకులు 26 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగానే పాకిస్తాన్ పై చర్యలు తీసుకునేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×