E-Paper
Advertisement

Viral Video: చాయ్ అమ్మే పిల్ల.. ఈమె వీడియోలు భలే వైరల్!

Viral Video: చాయ్ అమ్మే పిల్ల.. ఈమె వీడియోలు భలే వైరల్!
Advertisement

Model Chai Wali: ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు చేయడం కంటే సొంత వ్యాపారం చేయడం మంచిదని భావిస్తున్నారు. లక్షల రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాలను వదిలి, వ్యవయసాయం చేస్తున్న యువకులు ఎంతో మంది ఉన్నారు. మరికొంత మంది డైరీ ఫామ్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఏ వ్యాపారం అనేది ముఖ్యం కాదు, సొంత వ్యాపారం అయితే చాలు అనే అభిప్రాయానికి వస్తున్నారు. అలాంటి ఓ అమ్మాయి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‘మోడల్ చాయ్ వాలీ’ లక్నోలో భలే ఫేమస్!

Advertisement

నాగ్ పూర్ డాలీ చాయ్ వాలా. కొద్ది రోజుల క్రితం ఈ పేరు మార్మోగిపోయింది. ఆయన టీ చేసే విధానానికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్ సైతం ఫిదా అయ్యారు. ఆయన గురించి సోషల్ మీడియాలో రాయడంతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అలాగే ఇప్పుడు.. సిమ్రాన్ గుప్తా అనే అమ్మాయి ‘మోడల్ చాయ్ వాలీ’ పేరుతో యూపీలోని లక్నోలో టీ స్టాల్ రన్ చేస్తున్నది. ఆమె టీ తయారు చేసే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సుమారు 11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మోడల్ చాయ్ వాలీ వీడియోను ది హంగ్రీ పంజాబీ అనే ఫుడ్ ఫుడ్ బ్లాగింగ్ ఛానెల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీడియోతో ఆమె ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించింది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by The Hungry Panjabi🤤😋 (@thehungrypanjabi_)

ఇంతకీ ఎవరీ సిమ్రాన్ గుప్తా?

Advertisement

సిమ్రాన్ గుప్తా యూపీకి చెందిన యువతి. 2018లో మిస్ గోరఖ్‌ పూర్ టైటిల్ ను గెలుచుకున్నది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. పలు యాడ్స్ లోనూ ఆమె నటించింది. కరోనా సమయంలో మోడలింగ్ కు దూరం అయ్యింది. కొంతకాలం ఆమె ఇంటి దగ్గరే ఉంది. పేద కుటుంబానికి చెందిన ఆమె, ఎలాగైన తన ఫ్యామిలీకి అండగా నిలవాలని భావించింది. కొద్ది రోజులు ఆలోచించి లక్నోలో టీ షాప్ ను ఓపెన్ చేసింది. తన దుకాణానికి ‘మోడల్ చాయ్ వాలీ’ అని పేరు పెట్టింది. ప్రస్తుతం ఆమె టీ స్టాల్ లక్నోలో ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది.

కొందరు ప్రశంసలు, మరికొందరు విమర్శలు

సిమ్రాన్ గుప్తా టీ స్టాల్  మీద నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. మోడల్ గా రాణించినా, ఏమాత్రం సిగ్గు పడకుండా కుటుంబం కోసం టీ స్టాల్ నడపడం చాలా గొప్ప విషయం అంటూ కొందరు ప్రశంసిస్తున్నారు. మరికొంత మంది ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ఆమె తయారు చేసిన చాయ్ టేస్టీ 2 శాతం ఉంటే, ఆమె ఓవర్ యాక్టింగ్ 98 శాతం అంటూ ట్రోల్ చేస్తున్నారు. చాయ్ చేసేటప్పుడు జుట్టు కట్టుకుంటే ఇంకా బావుండేదని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. ఏదైతేనేం సిమ్రాన్ గుప్తా ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది.

Read Also: అబ్బాయిల కోసం ఎగబడుతున్న మేఘాలయ అమ్మాయిలు.. నిజంగా అంత కరువుతో ఉన్నారా?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×