E-Paper
Advertisement

Viral News: వివాహ వేడుకలో రచ్చ.. వధువు-వరుడు కుటుంబాల మధ్య ఫైటింగ్, వీడియో వైరల్

Viral News: వివాహ వేడుకలో రచ్చ.. వధువు-వరుడు కుటుంబాల మధ్య ఫైటింగ్, వీడియో వైరల్
Advertisement

Viral News: ఆడుతూ పాడుతూ.. సరదా జరగాల్సిన వివాహ వేడుక కాస్త రణరంగంగా మారింది. ఓ వైపు వరుడు.. మరోవైపు వధువు కుటుంబ సభ్యులు దాడులకు దిగారు. ఫలితంగా వివాహం కాస్త రచ్చగా మారింది. ఈ విషయం తెలియగానే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ ఘటనకుబ సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి ఒక్కసారి వెళ్లొద్దాం.

మహారాష్ట్రలోని ఓ వివాహ వేడుకలో రచ్చ

Advertisement

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసాయ్‌లో ఓ వివాహ వేడుక రచ్చగా మారింది. వివాహం జరిగిన కొద్దిసేపటికి వధువు-వరుడు కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడం, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

వసాయ్‌ ప్రాంతంలోని ఫంక్షన్ హాలులో ఆదివారం వివాహ కార్యక్రమం జరిగింది. పెళ్లి ముగిసిన తర్వాత ఇరు కుటుంబాల మధ్య చిన్నపాటి మాటామాటా చోటు చేసుకుంది. అది కాస్త వాగ్వాదానికి దారి తీసింది. మీరెంత అంటే మీరెంత అనే స్థాయికి వెళ్లిపోయారు. ఒకరినొకరు తోసుకోవడం, ఆపై ప్లాస్టిక్ కుర్చీలు విసురుకోవడం జరిగింది.

Advertisement

వధువు-వరుడు కుటుంబాల మధ్య ఫైటింగ్, వీడియో వైరల్

ఈ దాడిలో కొందరు గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కట్నం విషయంలో వివాదం మొదలైనట్లు ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో కీలకంగా మారింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇరువర్గాలకు చెందినవారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటివరకు ఇరుకుటుంబాల సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. వైరల్ వీడియో, సంఘటనా స్థలం నుండి సేకరించిన ఇతర ఆధారాలు విచారణలో కీలకంగా మారాయి. ఒకవేళ కట్నం వ్యవహారమైతే వరుడు కుటుంబానికి కష్టాలు తప్పవని అంటున్నారు.

ALSO READ: సినిమా సీన్‌ను తలపించే ప్రమాదం.. గాలిలోకి ఎగిరి ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌కు చిక్కుకున్న బైక్!

 

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×