BigTV English
Advertisement

Elephant vs Jcb : జేసీబీ‌ని ఒక్క దెబ్బకు ఎత్తిపడేసిన ఏనుగు – వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది

Elephant vs Jcb : జేసీబీ‌ని ఒక్క దెబ్బకు ఎత్తిపడేసిన ఏనుగు – వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది

Elephant vs Jcb : ఆహారం కోసం అడవి నుంచి పొలాల్లోకి వచ్చిన ఓ ఏనుగును మట్టిని తవ్వేందుకు వినియోగించే జేసీబీ యంత్రంతో ఢీ కొట్టించిన ఘటన వైరల్ గా మారింది. స్థానిక పొలాల్లోకి వచ్చిన ఏనుగును చుట్టుముట్టిన వందల మంది అల్లరి మూక.. అటవీ ఏనుగును ఘోరంగా విసిగించింది. గజరాజు తోక పట్టుకుని రాక్షసానందం పొందిన మూర్ఖులు.. ఏనుగును తిరిగి వెనక్కి తోలేందుకు జేసీబీ తో అనేక మార్లు గుద్దించారు. ఈ ఘటన తాలుకు వీడియోలు ఇంటర్నేట్ లో వైరల్ గా మారగా.. జంతు సంరక్షణ ప్రేమికులు, ఇతరులు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ ఘటన ఫిబ్రవరి 1న పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలోని డామ్‌డిమ్ ప్రాంతంలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఆహారం కోసం అపల్‌చంద్ అడవి నుంచి వచ్చిన ఏనుగును స్థానికులు వెంబడించి వేధించారు. ఒకానొక దశలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఏనుగు.. జనాలపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. పొలాల్లో నిర్మించిన వాచ్ టవర్ ను బలంగా ఢీ కొట్టింది. అయితే.. ఈ నిర్మాణం కాంక్రీట్ తో చేసింది కావడంతో ఏనుగుకు దెబ్బ తగిలింది. దాంతో.. నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఏనుగును వెంబడించారు. దాని తోకను పట్టుకుని చిరాకు పెట్టించారు.

అసలే ఆకలి, ఆపై స్థానికుల అల్లరితో భయాందోళన, కోపంతో ఊగిపోతున్న ఏనుగును అడవుల్లోకి తోలేందుకు జేసీబీ తో అనేక సార్లు గుద్దించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇందులో భారీ ఏనుగు జేసీబీ యంత్రాన్ని ఢీకొట్టడం, డ్రైవర్ దానిని ఎక్స్‌కవేటర్ బకెట్ ఉపయోగించి ఎదుర్కోవడం కనిపిస్తోంది. ఏనుగు పారిపోవడానికి తిరుగుతుండగా పక్కనే ఉన్నవారు దాని వైపు పరుగెత్తుకుంటూ వచ్చి దానిని వెంబడిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దారుణ ఘటనలో ఏనుగు నుదిటి మీద, తొండం భాగంలో తీవ్ర గాయాలయ్యాయని స్థానిక మీడియా వెల్లడించగా, స్థానికులెవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది.


ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రవర్తించిన తీరు సరిగా లేదని, మూగ జీవితో పరాచికాలు ఆడుతున్నారంటూ కోప్పడుతున్నారు. పైగా.. జేసీబీ వంటి యంత్రంతో ఏనుగును గుద్దించడాన్ని తప్పుపడుతున్నారు. దాంతో.. అటవీ శాఖ అధికారులతో పాటు స్థానిక పోలీసు అధికారులు స్పందించారు. అడవి ఏనుగును రెచ్చగొట్టారనే ఆరోపణలతో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఏనుగు ను తరిమేందుకు వాడిన జేసీబీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృత ఆగ్రహానికి కారణమైంది.

ఈ వీడియో పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. ఓ యూజర్ కామెంట్ చేస్తూ..”ఏనుగు ఎంత క్రూరత్వాన్ని ఎదుర్కొంటోంది. మానుషులుగా చెప్పుకునే మనం ఆ మూగజీవి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాయో చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. అటవీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, లేకపోతే కొన్ని సంవత్సరాలలో ఈ జంతువులు పుస్తకాలలో మాత్రమే కనిపిస్తాయి.” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏనుగుల గురించి అధ్యయన చేసే కొందరు వ్యక్తులు.. సాధారణంగా ఏనుగులు తొందరగా కోపానికి గురికావని, వాటిని మరి ఎక్కువగా చిరాకు పెట్టిస్తేనే స్పందిస్తాయని అంటున్నారు. అది అభద్రతకు, ప్రమాదానికి గురవుతున్నా అనే భావన కలిగినప్పుడు.. దురుసుగా మారిపోతాయని అంటున్నారు.

Also Read : చనిపోతున్న కూతురి కోసం ఆఫీసుకు సెలవు పెట్టిన మహిళ.. ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ

ఉత్తర బెంగాల్ లో ప్రస్తుతం 680 ఏనుగులు ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీటిలో చాలా వరకు అడవి ఏనుగులు తరచుగా ఆహారం కోసం జల్పైగురి, నక్సల్బరి, సిలిగురి, బాగ్డోగ్రా వంటి ప్రాంతాలలోకి వస్తుంటాయి. సాధారణంగా, స్థానికులు సురక్షితమైన దూరం పాటిస్తారు. ఈ గంభీరమైన జంతువులతో శాంతియుతంగా మెలుగుతారు. కానీ.. ఈ ఘటనలో ప్రజలు చాలా దురుసుగా, క్రూరంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.

Related News

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Mike Tyson: గొరిల్లాతో ఆ పని చేయడానికి ఏకంగా రూ.9 లక్షలు చెల్లించిన మైక్ టైసన్, చివరికి..

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Big Stories

×