BigTV English

Bank Employee Fired Daughter Cancer : చనిపోతున్న కూతురి కోసం ఆఫీసుకు సెలవు పెట్టిన మహిళ.. ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ

Bank Employee Fired Daughter Cancer : చనిపోతున్న కూతురి కోసం ఆఫీసుకు సెలవు పెట్టిన మహిళ.. ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ

Bank Employee Fired Daughter Cancer | సంస్థ కోసం నిజాయితీగా, నిబద్ధతో పనిచేసే ఒక ఉద్యోగిని అన్యాయంగా తొలగించేశారు. చావుబతుకుల్లో ఉన్న తన కూతురి కోసం ఆఫీసుకు కొన్ని రోజులు సెలవు పెట్టిందనే చిన్న కారణంగా ఆమెను ఆ కంపెనీ ఫైర్ చేసింది. ఈ ఘటన మానవహక్కుల కోసం విపరీతంగా వాదించే అగ్రరాజ్యం అమెరికాలో జరగడం మరింత ఆందోళనకర విషయం.


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం డెట్రాయిట్ నగరం లో నివసించే టెర్రి ఎస్టెప్ గత 30 ఏళ్లుగా హంటింగ్టన్ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. అమె చాలా నిజాయితీగా పనిచేస్తుందని గతంలో తన సీనియర్ల నుంచి బ్యాంక్ యజమాన్యం నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఆమెను ఇటీవలే ఆ బ్యాంకు యజమాన్యం నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలగించింది. దీనికి కారణం కూడా చాలా అమానవీయంగా ఉంది.

54 ఏళ్ల టెర్రి స్టెప్ బ్యాంకులో సీనియర్ ఉద్యోగి. ఆమెకు 31 ఏళ్ల కూతురు ఉంది. ఆమె పేరు సమంత. అయితే రెండు సంవత్సరాల క్రితం సమంతకు ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. అయితే సమంత క్యాలిఫోర్నియా రాష్ట్రంలో నివసిస్తోంది. ఈ విషయం టెర్రికి తెలియడంతో తన బిడ్డకు ఎంత కష్టమొచ్చిందోనని విలవిల్లాడిపోయింది. తన కూతురిని ఎలాగైనా కాపాడుకోవాలని తన ఉద్యోగానికి తరుచూ సెలవు పెట్టి క్యాలిఫర్నియా వెళ్లేది. ఈ క్రమంలో ఆమె ఆఫీసు నుంచి దక్కే అన్ని పెయిడ్ లీవ్స్ అయిపోయాయి. దీంతో ఆమె అన్ పెయిడ్ లీవ్స్ తీసుకోవాల్సి వచ్చింది.


Also Read: కుక్కలతో ఆ పని చేసినందుకు దోషికి 475 ఏళ్ల జైలు.. ఎంత క్రూరంగా చేసేవాడంటే

అమెరికా ఉద్యోగస్తులకు ఆఫీసు నుంచి అనారోగ్యం కోసం సెలవు తీసుకునేందుకు ఒక ప్రత్యేక చట్టం ఉంది. దాని పేరు ఫ్యామిలీ మెడికల్ లీవ్ యాక్ట్. ఇది ఫెడరల్ లా. అంటే కేంద్ర ప్రభుత్వ చట్టం. ఈ చట్ట ప్రకారం.. ఉద్యోగులు తమకు లేదా తమ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే అన్ పెయిడ్ లీవ్స్ తీసుకోవచ్చు. అన్ పెయిడ్ లీవ్స్ తీసుకున్నంత మాత్రాన వారిని ఉద్యోగం నుంచి తొలగించే హక్కు కంపెనీలకు ఉండదు. టెర్రి స్టెప్ కూడా చట్టప్రకారమే తన హక్కుని వినియోగించుకుంది. తనకు చట్ట ప్రకారం.. 12 వారాల పాటు ఫ్యామిలీ మెడికల్ లీవ్ తీసుకునే వెసలుబాటు ఉండగా.. ఆమె అందులో నుంచి నాలుగు వారాలు సెలవు తీసుకొని క్యాలిఫోర్నియాకు వెళ్లి తన కూతురు సమంతతో సమయం గడిపింది.

సమంత పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు ఆమె ఎక్కువ కాలం జీవించదని తేల్చి చెప్పేశారు. దీంతో టెర్రి బరువెక్కిన గుండెతో తన కూతురినే చూసుకుంటూ పగలు రాత్రి అలాగే ఉండిపోయింది. ఈ క్రమంలో ఆమెకు ఆఫీసు నుంచి కాల్ వచ్చింది. వెంటనే డ్యూటీకి రావాలని ఆమె బాస్ ఆదేశించారు. టెర్రి వెంటనే డెట్రాయిట్ చేరుకొని తన పరిస్థితిని బాస్ కు వివరించింది. తాను అప్పుడే ఆఫీసుకు రాలేనని.. తనకు ఇంకా సెలవు కావాలని అడిగింది. అయితే ఆమె బాస్ మాత్రం ఆమె వ్యక్తిగత కారణాలు తనకు అనవసరమని చెప్పి.. ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు అధికారికంగా చెప్పేశాడు.

అయినా టెర్రి బాధపడలేదు. ముందు తన కూతురిని కాపాడుకోవాలని భావించి.. తన కూతురికి ఫోన్ చేసి వెంటనే వచ్చేస్తున్నానని చెప్పింది. కానీ సమంత తన తల్లి ఉద్యోగం తన వల్లే కోల్పోయిందని మరింత బాధపడింది. మానసికంగా మరింత ఆందోళన చెందిన సమంత 2024లో చనిపోయింది. దీంతో టెర్రి దుఖానికి అంతులేకుండా పోయింది. కూతురి మరణం నుంచి తేరుకున్నాక.. తన బాస్ పై, కంపెనీపై టెర్రి స్టెప్ కోర్టులో కేసు వేసింది.

చట్టవ్యతిరేకంగా టెర్రిని ఉద్యోగం నుంచి తొలగించారంటూ ఆమె లాయర్ సారా ప్రెస్కాట్ మీడియాకు తెలిపింది. టెర్రి బ్యాంకు గత 30 ఏళ్లుగా పనిచేస్తోందని.. మొత్తం 6000 బిజినెస్ అకౌంట్లను ఆమె ప్రతినిధిగా ఉందని.. ఆమెకు ఇంకా 8 వారాలు అన్ పెయిడ్ లీవ్ ఉన్నా ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయమని వాదించింది.

Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×