BigTV English

Laila Trailer: ట్రైలర్ మొత్తం బూతులే.. ‘లైలా’లో విశ్వక్ సేన్ మార్క్ కనిపిస్తోందిగా.!

Laila Trailer: ట్రైలర్ మొత్తం బూతులే.. ‘లైలా’లో విశ్వక్ సేన్ మార్క్ కనిపిస్తోందిగా.!

Laila Trailer: వెండితెరపై హీరోలు లేడీ గెటప్ వేశారంటే చాలు.. అదే ప్రేక్షకుల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారుతుంది. కానీ అవన్నీ ఒకప్పుడు ముగిసిపోయాయి. ఈ రోజుల్లో హీరోలు ఎవరూ అంతగా రిస్క్ తీసుకోవడం లేదు. అలాంటి సమయంలో యంగ్ హీరో విశ్వక్ సేన్.. తన అప్‌కమింగ్ మూవీ ‘లైలా’ కోసం పూర్తిగా అమ్మాయిగా మారిపోయాడు. విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపిస్తున్నాడు అనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. అందులో విశ్వక్ అమ్మాయిగా మారడానికి కారణమేంటి అని రివీల్ చేశాడు దర్శకుడు. అంతే కాకుండా డబుల్ మీనింగ్ డైలాగులతో ఈ ట్రైలర్ నిండిపోయింది.


ఆడ వేషంలో విశ్వక్

‘‘అసలు ఎవరు ఈ సోనూ’’ అంటూ ఒక ఏరియాలో జరుగుతున్న అల్లర్లతో ‘లైలా’ టీజర్ మొదలవుతుంది. ఎమ్మెల్యే చావు, బ్రతుకుల్లో ఉండడానికి కారణమే సోనూ అంటూ పోలీసులు ప్రకటిస్తారు. అలా సోనూను పట్టుకోవడానికి ఒకవైపు పోలీసులు, మరొక వైపు రాజకీయ నాయకులు, మరొక వైపు ఒక రౌడీ గ్యాంగ్ తిరుగుతూ ఉంటుంది. విశ్వక్ సేన్ మాత్రం తన గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు వీరందరి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో తనకు అమ్మాయిగా మారిపోవడం కరెక్ట్ అనే ఐడియా వస్తుంది. అలా సోనూగా తప్పించుకొని లైలాగా ఎంట్రీ ఇస్తాడు విశ్వక్ సేన్ (Vishwak Sen). ‘‘ఆడ వేషం వేసిన విశ్వక్ సేన్‌లా ఉన్నావు’’ అనే డైలాగ్‌తో తన ఎంట్రీ ట్రైలర్‌లో ఒక హైలెట్ అని చెప్పుకోవచ్చు.


మాస్ డైలాగ్స్‌తో

ఎవరైతే సోనూను పట్టుకోవాలని, చంపాలని వెతుకుతూ ఉంటారో.. వారందరూ లైలాకు అట్రాక్ట్ అవుతారు. ‘‘నీ ఛాతి చూశాక నా ఛాతి చపాతీ అయ్యింది, నాది లోపల ఉన్న మ్యాటర్ తెలిస్తే నీది గుండె ఆగి చస్తాయ్’’.. ‘లైలా’ ట్రైలర్‌లో ఇలాంటి డైలాగ్స్ వింటుంటే సినిమాలో మరెంత డబుల్ మీనింగ్ కంటెంట్ ఉందో అర్థమవుతోంది. లైలాగా నటించి తాను అబ్బాయి అనే విషయాన్ని విశ్వక్ సేనే మర్చిపోతాడు. అక్కడ తన యాటిట్యూడ్ అంతా ప్రేక్షకులను నవ్వించేలా ఉంది. ‘‘వచ్చాడంటే ఒక్కొక్కడికి గజ్జెలు అదురుతాయి, గవ్వలు పగులుతాయి’’ అంటూ విశ్వక్ సేన్ స్టైల్ యాక్షన్ డైలాగ్స్‌తో ట్రైలర్ ముందుకు సాగుతుంది.

Also Read: ఏకంగా అప్పటికి పోస్ట్‌పోన్ అయిన ‘రాజా సాబ్’.. ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న రూమర్స్..

రొమాన్స్ కూడా

‘లైలా’ (Laila) సినిమాలో లేడీ గెటప్‌తో అలరించడంతో పాటు హీరోయిన్ ఆకాంక్ష శర్మతో కూడా ఘాటు రొమాన్స్ ఉంటుందని ట్రైలర్‌లోనే చూపించారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో హీరో, హీరోయిన్‌కు మధ్య లిప్ లాక్ సీన్ కూడా ఉంది. మొత్తానికి అటు మాస్, ఇటు లేడీ గెటప్.. రెండిటిలో విశ్వక్ సేన్ అదరగొట్టేశాడని ట్రైలర్ చూస్తేనే ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేస్తోంది. ఇది ఒక పక్కా కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్ అని కూడా అర్థమవుతోంది. తన ప్రతీ సినిమాకు ఏదో ఒకటి కొత్తగా ప్రయోగించాలి అనుకునే విశ్వక్ సేన్.. ఈసారి లేడీ గెటప్‌తో ఆ ప్రయోగం చేయనున్నాడు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ‘లైలా’ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×