E-Paper
Advertisement

Viral Video: రీల్స్ కోసం భారీ వరదల్లో యువకుడి విన్యాసాలు..

Viral Video: రీల్స్ కోసం భారీ వరదల్లో యువకుడి విన్యాసాలు..
Advertisement

Viral Video: ఇటీవల వర్షాలు భారీగా కురుస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ఓ వైపు జనజీవనం స్థంబించిపోతుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వరదలతో జనాలు కొట్టుమిట్టాడుతున్నారు. అయితే భారీ వర్షాల్లో కొంతమంది స్టంట్స్ చేస్తూ ప్రాణాలకు తెగించి మరి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా ఓ యువకుడు ఇదే మాదిరిగా స్టంట్స్ చేసి ఫేమస్ అవ్వాలని అనుకున్నాడు. అయితే ఇది సాధారణంగా చేసిన స్టంట్ అయితే పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనిలేకుండా ఉండేది. కానీ ఆ యువకుడు ఏకంగా భారీ వరదల్లో ప్రాణాలకు తెగించి మరి సాహసం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో యువకుడు రీల్స్ చేసి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని ప్రయత్నించాడు. ఈ తరుణంలో ఏకంగా తన ప్రాణాలను కూడా లెక్కచేయలేదు. బ్రతికితే ఫేమస్ అవుతా, లేక చనిపోతా అనుకున్నాడో ఏమో ఏకంగా భారీ వరద నీటిలో విన్యాసాలు ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలను అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడు రెండు రోడ్లను కలిపే తెగిపోయిన పైపుపై ప్రయాణం చేశాడు. అది కూడా భారీ వరద నీరు వెళ్తున్న సమయంలో అప్పటికే వరద నీటికి రోడ్డు కొట్టుకుపోతున్న క్రమంలో ఈ పని చేశాడు.

Advertisement

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లోని పాలి షహాబాద్ రోడ్డులోని అగ్మాపూర్ గ్రామంలో వెలుగుచూసింది. ప్రస్తుతం ఇక్కడ వరదల బీభత్సం కొనసాగుతోంది. హర్దోయ్‌లో భారీ వరదల కారణంగా, చాలా చోట్ల కోత ఏర్పడింది. దీంతో ఈ పరిస్థితులను అనుకూలంగా చేసుకోవడానికి ఓ యువకుడు ఇలా స్టంట్ చేయడం నెట్టింట చర్చనీయాంశం అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×