BigTV English

RTC Bus Conductor Arrested: బస్సులో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్ అరెస్ట్

RTC Bus Conductor Arrested: బస్సులో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్ అరెస్ట్

RTC Bus Conductor Arrested(Telangana news updates): బస్సులో ప్రయాణిస్తున్న ఓ యవతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆర్టీసీ బస్ కండక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి వచ్చిన ఇతర వార్తా కథనాల ప్రకారం.. ఫరూక్ నగర్ డిపోకు చెందిన బస్సులో ఓ యువతి పుప్పాలగూడ నుంచి హియాయత్ నగర్‌కు ప్రయాణిస్తున్నది. ఈ క్రమంలో మణికొండ వద్ద బస్సు కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని సదరు యువతి సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించింది. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక కండక్టర్ తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదంటూ అందులో పేర్కొన్నది. సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టింది.


Also Read: ఈ శుభవార్త.. కేవలం ఆ ఉద్యోగులకు మాత్రమే: మంత్రి ఉత్తమ్

ఆ యువతి పోస్ట్‌పై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం కండక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి రాయదుర్గం పోలీసులు మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కండక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. అనంతరం కండక్టర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారంటూ అందులో పేర్కొన్నారు.


Tags

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×