BigTV English

Money Seized in Nellore : నెల్లూరులో భారీగా నగదు పట్టివేత.. రూ.12 కోట్లు సీజ్..

Money Seized in Nellore : నెల్లూరులో భారీగా నగదు పట్టివేత.. రూ.12 కోట్లు సీజ్..

12 cr seized in nellore district


Money Seized in Nellore(AP latest news):

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. నగదు రవాణా జోరుగా సాగుతోంది. నెల్లూరు జిల్లాలో అక్రమ నగదు రవాణా పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రయాణికులు ముసుగులో పెద్ద ఎత్తున నగదు రవాణా చేస్తున్నారు. గురువారం పలు చోట్ల అక్రమంగా తరలిస్తున్న 12 కోట్ల 46 లక్షల 40 వేలు రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. తరలిస్తున్న డబ్బుకు ఎలాంటి బిల్లులు లేకపోవడంతో డబ్బు సీజ్ చేశారు. ఆటోలు, ప్రైవేట్ బస్సు, ట్రైన్లలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.


చెన్నైలో అక్రమమార్గాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తూ పోలీసులకు పట్టుబడ్డారు. డబ్బు సీజ్ చేయడంతో పాటు.. డబ్బు తరలిస్తున్న వారిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కోట్ల 83 లక్షల నగదు దొరికింది. వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద 1కోటి 50 లక్షల 40 వేల రూపాయలు పట్టుబడింది. గూడూరులో 5 కోట్ల 13 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నగదును పోలీసులు ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

Related News

Power Bills: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు

Kadapa District: తాళి కట్టగానే వరుడికి మూడు కొరడా దెబ్బలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

Tirupati Ragging: తిరుపతి ర్యాగింగ్ ఘటనపై మంత్రి లోకేశ్ సీరియస్.. దర్యాప్తునకు ఆదేశం

Uppada Fishermen Issue: ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై డిప్యూటీ సీఎం రంగంలోకి.. ఏం చేశారంటే?

Home Minister Anitha: అనకాపల్లిలో ఉద్రిక్తత.. అనిత కాన్వాయ్ పైకి.. దూసుకెళ్లిన మత్స్యకారులు

AP CM Chandrababu: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన.. సీఎం చంద్రబాబు

Indrakeeladri Rush: కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. తిరుమల తరహాలో ఏర్పాట్లు.. నది స్నానాలపై నిషేధం

Mithun Reddy: బిగ్ రిలీఫ్.. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్

Big Stories

×