Elon Musk : ఎలాన్ మస్క్. టెస్లా, స్పేస్ ఎక్స్ ఓనర్. ప్రపంచ కుబేరుడు. తెలివైన బిజినెస్‌మేన్. ట్రంప్‌కు సలహాదారు. అంగారక గ్రహంపై మనుషులను పంపాలనేది ఆయన డ్రీమ్. తానొక్కడినే తెలివైన వాడిని అయితే సరిపోతుందా? తనలాంటి మనుషులు ఇంకా చాలామందే పుట్టాలనేది ఆయన వాదన. ఆ బాధ్యత కూడా అతనే తీసుకున్నట్టున్నారు. మస్క్.. తన వారసులను కనడం స్టార్ట్ చేశారు. ఇప్పటికే 14 మంది పిల్లలకు తండ్రి అయ్యారు. ఇది అఫీషియల్ నెంబర్ మాత్రమే. అనధికారికంగా ఆ పిల్లల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందనేది అతని సన్నిహితులు మాట. తెలివైనవారు ఎక్కువ మంది పిల్లలను కనాలని ఉచిత సలహా కూడా ఇస్తుంటారు మస్క్.
ఎక్స్ వేదికగా డీల్స్
లేటెస్ట్‌గా ఓ అమెరికన్ మీడియా మస్క్, అతని భార్యలు, సంతానం గురించి ఆసక్తికర కథనం ప్రచురించింది. పిల్లల దళం.. నిర్మించడానికి ఎలాన్ మస్క్ చురుకుగా పని చేస్తున్నాడని చెబుతోంది. తనతో పిల్లలను కనేలా తల్లులను ఎంపిక చేసుకునేందుకు.. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌నే ఉపయోగిస్తున్నారని తెలిపింది. పెద్ద మొత్తంలో డబ్బులు, ఆఫర్లు ఎరగా వేసి.. తెలివైన మహిళలను మస్క్ సెలెక్ట్ చేసుకుంటున్నాడట. అవసరమైతే సరోగసీ మెథడ్‌లోనూ పిల్లలను కంటున్నారట. కఠినమైన గోప్యతా నియమాలతో ఒప్పందాలు చేసుకుంటూ.. ఆ విషయం బయటకు రాకుండా మస్క్ జాగ్రత్తగా మేటర్ డీల్ చేస్తున్నాడని తెలిపింది.
జపాన్ యువతికి మస్క్ వీర్యం
గతేడాది మస్క్ 13వ బిడ్డకు జన్మనిచ్చింది ఓ 26 ఏళ్ల సంప్రదాయవాద ప్రభావశీలి అయిన ‘ఆష్లే సెయింట్ క్లెయిర్’ అనే యువతి. తాను ఎక్కువ మంది పిల్లలను కనాలని అనుకుంటున్నట్టు మస్క్ అనేవాడని ఆమె తెలిపింది. అలాంటిదే మరో విషయం కూడా బయటకు వచ్చింది. జపాన్‌లోని ఓ ఉన్నతస్థాయి మహిళకు మస్క్ వీర్యం ఇచ్చాడని ఆ పత్రిక ప్రకటించింది. క్రిప్టో ఇన్‌ఫ్లూయెన్సర్ టిఫనీ ఫాంగ్‌ను పిల్లల కోసం మస్క్ అప్రోచ్ అయ్యాడని.. ఆ మెసేజ్‌లను ఆమె లీక్ చేయడంతో డీలింగ్స్ కట్ చేసుకున్నారని వెల్లడించింది.
వరుస పెళ్లిళ్లు.. పిల్లలు..
మస్క్ తన మొదటి భార్య జస్టిన్‌తో ఐవీఎఫ్ పద్దతిలో ఐదుగురు పిల్లలను కన్నారు. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. బ్రిటన్ నటి రిలే ను ఎలాన్ మస్క్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వారికి సంతనం కలగలేదు. నెక్ట్స్ కెనెడియన్ సింగర్ గ్రిమ్స్‌తో సహజీవనం చేసి.. ముగ్గురు పిల్లలను కన్నాడు. ఆ తర్వాత చాలా పాపులారిటీ ఉన్న ‘న్యూరాలింక్’ అనే బ్రెయిన్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీ ఎగ్జిక్యూటివ్ అయిన శివోన్ జిలిస్‌తో ప్రస్తుతం ఎలాన్ మస్క్ సహజీవనం చేస్తున్నాడు. ఈ జంట ఇటీవలే నాలుగో బిడ్డకు జన్మనిచ్చింది. అలా ఓ క్రికెట్ టీమ్ సైజ్‌లో పిల్లలను కన్నాడు. ఇంకా కంటూనే ఉంటానంటున్నాడు.
డబ్బులతో నోరు నొక్కేస్తారా?
పిల్లల కోసం తెలివైన మహిళలను సంప్రదించడం, వారితో డీల్స్ మాట్లాడటం లాంటి వ్యవహారాలన్నీ మస్క్ సన్నిహితుడైన జేర్డ్ బిర్చాల్ చూసుకుంటారని తెలుస్తోంది. బర్త్ సర్టిఫికెట్‌లో మస్క్ పేరు లేకుండా చూస్తే.. తనకు 15 మిలియన్ డాలర్లు ఇస్తానని ప్రతిపాదించినట్టు గతేడాది బిడ్డకు జన్మనిచ్చిన సెయింట్ క్లెయిర్ చెబుతున్నారు. అదనంగా ప్రతీనెలా లక్ష డాలర్లు భరణంగా చెల్లిస్తానని మస్క్ ఆఫర్ ఇచ్చారట. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో.. తనకు నెలకు ఇవ్వాల్సిన అమౌంట్ 20వేల డాలర్లకు తగ్గించారని చెబుతోంది. మరోవైపు, మస్క్‌తో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన గ్రిమ్స్ సైతం ఇలాంటి ఆరోపణే చేసింది. పిల్లల కస్టడీ కోసం తాను న్యాయపరంగా పోరాడి దివాళా తీసానని అంటోంది. ఆ పిల్లలు తీవ్ర అనారోగ్యం పాలైతే ఆర్థిక సాయం చేయాలంటూ గతంలో ఎక్స్ వేదికగా ఓపెన్‌గానే మస్క్‌ను రిక్వెస్ట్ చేసింది గ్రిమ్స్.
Also Read : రూ. 3 కోట్లకు వర్షిణి బేరం? అఘోరీపై సంచలన ఆరోపణలు
మస్క్ పెద్ద ఆటగాడే..
ఎలాన్ మస్క్ గురించి ఇలాంటివి అనేక విషయాలు కథలు కథలుగా వినిపిస్తున్నాయి. మస్క్ తెలివైనోడు, అత్యంత సంపన్నుడే కాదు.. మంచి ఆటగాడు కూడా అని అంటున్నారు నెటిజన్లు. డబ్బులున్నాయని.. తెలివైన మనుషులు కావాలని.. ఇలా పిల్లలను కంటూనే ఉంటాడా ఏంటి? అంటూ ఎక్స్‌లో కామెంట్లు కూడా చేస్తున్నారు.