E-Paper
Advertisement

Nellore: కుక్కలను చంపే ఇంజెక్షన్‌‌తో ఆ అధికారి హత్య, ఆ పని చేసిందెవరో తెలుసా?

Nellore: కుక్కలను చంపే ఇంజెక్షన్‌‌తో ఆ అధికారి హత్య, ఆ పని చేసిందెవరో తెలుసా?
Advertisement

Nellore: బావమరిది.. బావ బతుకు కోరుతాడు అనే సామెత తెలుగులో ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబ బంధాల్లో తరచుగా వినిపించే ఒక నానుడి సామెత. కానీ ఈ స్టోరీలో సీన్ రివర్స్. ఏకంగా బావను లేపేశాడు బావమరిది. కేవలం ఆస్తి కోసం. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం. సంచలన రేపిన ఈ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది.

నెల్లూరు జిల్లాలో దారుణమైన ఘటన- నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల ఏవోగా పని చేస్తున్నాడు శ్రీహరి. ఈయనకు ఓ బావమరిది ఉన్నాడు. అతడి పేరు హరికృష్ణ. భార్య తమ్ముడు కావడంతో అన్ని విషయాలు పంచుకునేవారు శ్రీహరి. ఈ క్రమంలో కోట్ల విలువైన ఆస్తిని రాసి ఇచ్చాడు. ఆస్తి మాత్రమే కాదు.. అప్పుగా కొంత డబ్బులు ఇచ్చాడు కూడా.

Advertisement

కుక్క ఇంజెక్షన్‌తో బావని చంపిన బావమరిది-పిల్లలు పెద్దవాళ్లు కావడంతో మంచి ఇళ్లు కట్టుకోవాలని భావిస్తున్నాడు శ్రీహరి. ఈ క్రమంలో తాను  ఇచ్చిన ఆస్తి, డబ్బు ఇవ్వాలని బావమరిది హరికృష్ణను కోరాడు శ్రీహరి. అంతా రాసి ఇచ్చిన మా బావ, మళ్లీ ఎందుకు అడుగుతున్నాడని ఆలోచన చేశాడు. ఇచ్చిన డబ్బు ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేని హరికృష్ణ, బావను హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు.

బావ-బావమరిది మధ్య ఆస్తి చిచ్చు-అందుకోసం ఇద్దర్ని నియమించుకున్నాడు. జూన్‌ 15న దేవుడి దర్శనం కోసం పెంచలకోనకు వెళ్దామని బావ శ్రీహరిని కారులో తీసుకువెళ్లాడు బావమరిది. దర్శనం తర్వాత త్తిరిగి వచ్చే క్రమంలో కారు డ్రైవ్‌ చేస్తున్న హరికృష్ణ, ప్లాన్ ప్రకారం చేజర్ల మండలం సమీపంలో వాహనాన్ని  అకస్మాత్తుగా ఆపాడు. అక్కడ కాపు కాసిన రవీంద్ర-యానాదిలు కారులో ఉన్న శ్రీహరిని పట్టుకున్నారు.

Advertisement

కుక్కలను చంపేందుకు ఉపయోగించే ఇంజెక్షన్లు ఇచ్చారు. దీంతో శ్రీహరి అక్కడే మరణించాడు. దీన్ని గుండెపోటుగా చిత్రీకరించి సొంతూరు మినగల్లుకు బావ మృతదేహాన్ని తీసుకొచ్చాడు హరికృష్ణ. మృతి విషయం తెలిసిన ఉద్యోగులు అక్కడికి వచ్చారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండడంతో వారికి అనుమానం వచ్చింది.

ALSO READ: తిరుమల భక్తులకు గమనిక..  అక్టోబర్ దర్శనం కోటా విడుదల, బ్రహ్మోత్సవాల సీజన్ కూడా

అంత్యక్రియలకు పోలీసులు వచ్చినా కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయలేదు. మృతదేహాన్ని సహజంగా పూడ్చాల్సి ఉన్నా కాల్చేశారు. ఇక్కడితో అంతా అయిపోయిందని భావించాడు హరికృష్ణ. సరిగ్గా సీన్ ఇక్కడే రివర్స్ అయ్యింది. కొద్దిరోజుల కిందట ఆస్తి విషయంలో  హరికృష్ణ-శ్రీహరి మధ్య ఘర్షణ జరగడంతో ఆయన భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, రవీంద్ర-యానాదిలను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న హరికృష్ణ కోసం గాలిస్తున్నారు. ఆస్తి కోసం జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను చంపుతున్న ఈ రోజుల్లో.. బావమరిదిని నమ్మి ఆస్తి ఎందుకు శ్రీహరి ఇచ్చాడని చర్చించుకుంటున్నారు గ్రామస్థులు, అధికారులు.

Related News

లోకల్ బాడీ ఎన్నికలపై విజయసాయిరెడ్డి పలుకులు, రూలింగ్ పార్టీకి అనుకూలం, పవన్‌పై కూడా

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమిలో సీట్లు సర్దుబాటు.. 4:1 ఫార్ములాలో జనసేన-బీజేపీ, మిగతా సీట్లలో టీడీపీ

ఒక్క క్యూఆర్ కోడ్‌తో బిడ్డ ప్రాణాలు సురక్షితం.. ఏపీ పోలీసులు సూపర్ ఐడియా..?

వైఎస్ జగన్‌కి బిగ్ షాక్.. జనసేనలోకి వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతలు జంప్?

కృష్టా జిల్లా మున్సిపాలిటీల్లో షాకింగ్ న్యూస్.. మారిన రాజకీయ ముఖచిత్రం!

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పిన పవన్!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×