Ravichandran Ashwin To Become England Test Coach: టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య టీ20 సిరీస్ మొన్నటి వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. ఇక రేపటి నుంచి ఈ రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ కూడా షురూ కానుంది. ఈ మేరకు రెండు జట్లు కూడా సిద్ధమవుతున్నాయి. టీ20లో టీమ్ ఇండియాలో వైట్ వాష్ చేసిన ఇంగ్లాండ్… అదే ఊపుతో వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అటు టీమ్ ఇండియా కూడా అదే తరహాలో వన్డే సిరీస్ గెలిచేలా ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో భారీ కుదుపు చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ( Brendon McCullum) టెస్ట్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో బ్రెండన్ మెక్‌కల్లమ్ స్థానంలో టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin ) ఇంగ్లాండ్ కోచ్ (New England Test Coach) అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రవిచంద్రన్ అశ్విన్ తో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పెద్దలు చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వెలుతున్నాయి.
ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ కోచ్ రేస్ లో టీమిండియా మాజీ దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగానే అమెరికాలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పెద్దలు కలిసి చర్చలు నిర్వహించినట్లు సమాచారం అందుతోంది. అయితే, ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ గా బాధ్యతలు చేపడితే… భారీ మొత్తంలో చెల్లించుకుంటామని ఆఫర్ కూడా ఇచ్చారట. దాదాపు 5 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ కూడా రాసుకునేందుకు సిద్ధమయ్యారట. దీనికి రవిచంద్రన్ అశ్విన్ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదే నిజమైతే ఇంగ్లాండ్ టీంకు తొలి ఇండియన్ ప్లేయర్‌గా రవిచంద్రన్ అశ్విన్ నిలుస్తాడని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇది ఇలా ఉండగా, రవిచంద్ర చంద్రన్ టెస్టులు, వన్డేలు, టీ20లు అలాగే ఐపీఎల్ టోర్నమెంట్ కు రిటైర్మెంట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే అన్ని ఫార్మర్ట్స్ లో 952 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ప్రపంచంలోనే అరుదైన స్పిన్నర్. అలాంటి వాడిని తమ కోచ్ గా చేసుకుంటే.. అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అంచనాలు వేస్తోంది. టెస్టుల్లో స్పిన్ బౌలింగ్ చాలా కీలకము కాబట్టి… అశ్విన్ కు అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ( Brendon McCullum) హాయాంలో టెస్టులలో పెద్దగా ఫలితాలు రాలేదు. అందుకే ఆయననున తప్పించారు. ఇకపై వన్డేలు, టీ20ల బాధ్యతలు మాత్రమే చూసుకోనున్నాడు మెక్ కల్లమ్.
Also Read: Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్రతీ వెధవా
మాట్లాడటమే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచలనం