E-Paper
Advertisement

వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్!

వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్!
Advertisement

Nagarjuna Yadav: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, నాగార్జున యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఈ అరెస్ట్ జరగడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అరెస్ట్‌కు దారితీసిన కారణం ఇదే..

Advertisement

ఇటీవల ఒక టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న నాగార్జున యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్‌తో పోలుస్తూ ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యమంత్రిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు, ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన యువతి!

Advertisement

అర్ధరాత్రి హైడ్రామా.. కుటుంబ సభ్యుల ఆందోళన

గుంటూరులోని నాగార్జున యాదవ్ ఇంటికి వచ్చిన పోలీసులు తాము ‘తెలంగాణ పోలీసులం’ అని కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే, ఎలాంటి నోటీసులు చూపించకుండా నేరుగా తీసుకెళ్లడంతో ఇంట్లోని వారు కంగారు పడ్డారు. దీనిపై స్థానిక నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తామని చెప్పి పోలీసులు ఆయనను వాహనంలో తీసుకెళ్లారు.

ముందస్తు సమాచారం లేకుండా.. స్థానిక పోలీసుల సమక్షం కాకుండా ఇలా అర్ధరాత్రి పూట వచ్చి అరెస్ట్ చేయడం ఏంటని నాగార్జున యాదవ్ కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అరెస్ట్ ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Related News

లోకల్ బాడీ ఎన్నికలపై విజయసాయిరెడ్డి పలుకులు, రూలింగ్ పార్టీకి అనుకూలం, పవన్‌పై కూడా

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమిలో సీట్లు సర్దుబాటు.. 4:1 ఫార్ములాలో జనసేన-బీజేపీ, మిగతా సీట్లలో టీడీపీ

ఒక్క క్యూఆర్ కోడ్‌తో బిడ్డ ప్రాణాలు సురక్షితం.. ఏపీ పోలీసులు సూపర్ ఐడియా..?

వైఎస్ జగన్‌కి బిగ్ షాక్.. జనసేనలోకి వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతలు జంప్?

కృష్టా జిల్లా మున్సిపాలిటీల్లో షాకింగ్ న్యూస్.. మారిన రాజకీయ ముఖచిత్రం!

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పిన పవన్!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×