E-Paper
Advertisement

Sambrani smoke To Hair: జట్టుకు సాంబ్రాణి పొగ ఎందుకు? ఆ ప్రయోజనాలు తెలిస్తే, ఇకపై మీరు ఆ పని చేస్తారు?

Sambrani smoke To Hair: జట్టుకు సాంబ్రాణి పొగ ఎందుకు? ఆ ప్రయోజనాలు తెలిస్తే, ఇకపై మీరు ఆ పని చేస్తారు?
Advertisement

Sambrani smoke To Hair: రానురాను పాత పద్దతులు కనుమరుగు అవుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ఫ్యామిలీలు ఉండేవి. ఒకరి కాకపోయినా మరొకరు పనుల్లో జోక్యం చేసుకునేవారు. జాబ్‌లు చేస్తూ పట్టణాలకు, నగరాలకు యువతీ యువకులు వెళ్లిపోయారు. ఫలితంగా పాత పద్దతులకు తిలోదకాలు ఇచ్చారు.. ఇచ్చేస్తున్నారు. తలంటు తర్వాత చిన్నారులు, మహిళల తలకు సాంబ్రాణి పొగ వేసేవారు. ఎందుకో తెలుసా?

జట్టుకు సాంబ్రాణి పొగ ఎందుకు? పల్లెటూర్లలో తలకు స్నానం చేయగానే జుట్టు ఆరబెట్టుకునేవారు. మన నానమ్మలు-అమ్మమ్మలు తమ పిల్లలకు జుట్టు నల్లగా, ఒత్తుగా  ఆరోగ్యంగా ఉండేలా అద్భుతమైన సహజ పద్ధతులు ఉపయోగించేవారు. తలకు స్నానం చేసిన తర్వాత జుట్టుకు సాంబ్రాణి ధూపం వేసేవారు. అలా చేయడం వల్ల కేవలం తడి జుట్టు ఆరబెట్టడానికి కాదు, శారీరక-మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు.

Advertisement

పూర్వకాలంలో ఇలా చేసేవారు-పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారాల్లో సాంబ్రాణి ధూపం చాలా ముఖ్యమైనది. ఇంట్లో ధూపం వేయటం, పసి పిల్లలకు తలంటు స్నానం చేసిన తర్వాత సాంబ్రాణి పొగ వేసేవారు. ఆ తర్వాత మహిళలు కూడా తలకు స్నానం చేసి  సాంబ్రాణి దూపం వేసేవారు. దీనివల్ల పిల్లల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంటాయి.

హెయిర్ ఊడే సమస్య ఉండేదికాదు-సువాసన భరితంగా మార్చుకునేందుకు సాంబ్రాణి ఉపయోగపడుతుంది. అంతేకాదు క్రిమి కీటకాలు ఆ వాసనకు రావు. జుట్టుకు సాంబ్రాణి ధూపం వేస్తే ఆరోగ్య సమస్యలు దగ్గరికి రావని పెద్దలు పదే పదే చెబుతారు. వర్షాకాలం సీజన్‌లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తల స్నానం చేస్తే జుట్టు త్వరగా ఆరదు. జట్టు ఆరకపోవడం వల్ల అనేక సమస్యలు వెంటాడుతాయి.

Advertisement

ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చుండ్రు వచ్చే ప్రమాదం వస్తాయని భావించి సాంబ్రాణి ధూపం వేసేవారు. అలా చేయడం వల్ల జుట్టులో తేమను పీల్చుకుంటుంది. తలను పొడిగా నిగనిగలాడుతుంది. ఈ ధూపంలో వేప-తులసి వంటివి వేయడం వల్ల బ్యాక్టీరియాలు దగ్గరకు రావు. తలకు పొగ తగలగానే మురికి, చెమట, బ్యాక్టీరియా నశించిపోతాయి.

ఫలితాలు ఈ విధంగా-సాంబ్రాణి పొగ వేడి వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కుదుళ్లకు బలాన్ని ఇవ్వడమేకాదు జుట్టు రాలడానికి క్రమంగా తగ్గిస్తుంది. తల హెయిర్  సరిగ్గా ఆరకపోవడం వల్ల వచ్చే దుర్వాసనను సాంబ్రాణి ధూపం పొగొడుతుంది. కురులకు మంచి సువాసనను ఇస్తుంది కూడా. మెదడును ఉల్లాస పరుస్తుంది.

ALSO READ: ఎలాంటి వారైనా జీవితంలో విజయం సాధించాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి.. చాణక్యుడు చేసిన 5 గొప్ప సూచనలు

సాంబ్రాణికి యాంటీ సెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉండడంతో తల మీద దురదను తగ్గించి కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి కూడా. ప్రతీ రోజూ సాంబ్రాణి ధూపం వేసుకునే పద్ధతి మంచిదే. అతిగా చేస్తే అనర్థాలు తప్పవు. దాన్ని నుంచి వచ్చే పొగ పీల్చడం ఊపిరితిత్తులకు మంచిది కాదంటున్నారు నిపుణులు. మహా అయితే వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమేనని అంటున్నారు.

NOTE: తాము చెబుతున్నవి పెద్దల సలహాలు మాత్రమే. కేవలం అవగాహన కోసం. వైద్యులను సంప్రదించి తగు సలహాలు తీసుకోవడం మంచిది.

Related News

నెమలి ఈకలు ఎంతో శుభసూచకం.. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ ప్రదేశాల్లో పెడితే అదృష్టం పట్టినట్లే

ఎలాంటి వారైనా జీవితంలో విజయం సాధించాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి.. చాణక్యుడు చేసిన 5 గొప్ప సూచనలు

పిల్లలకు దగ్గు, జలుబు లేకున్నా తరచూ జ్వరం వస్తూనే ఉందా? కారణం ఇదే కావచ్చు

కిచెన్‌లో వేడి నూనె చిమ్మి చేతులు కాలుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్

చేతులతోనే ఆలోచిస్తుంది.. రూపం మార్చి శత్రువులనే వణికిస్తుంది.. అసలు దీనికి అంత తెలివి ఎలా వచ్చింది?

క్రేన్లు,టెక్నాలజీ లేని కాలంలో..ఈజిప్ట్ పిరమిడ్లు ఎలా కట్టారు? అసలు నిజాలు ఇవే!

పుస్తకాలు-నోట్‌బుక్‌ల్లో ఖాళీ అంచులు ఎందుకు? ఆ కారణం తెలుస్తే షాక్ కావాల్సిందే

Big Stories

Advertisement
×