E-Paper
Advertisement

ముంబైలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఆరోగ్యం ఎలా ఉందంటే?

ముంబైలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఆరోగ్యం ఎలా ఉందంటే?
Advertisement

Pawan Kalyan: ఇటీవల భుజం సర్జరీ చేయించుకుని ముంబైలోని ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న సీఎం, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో భేటీ

Advertisement

కుడి భుజానికి నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌కు ముంబైలోని ప్రముఖ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో వైద్యులు విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన అక్కడే కోలుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ముంబై వెళ్లారు. ఆసుపత్రిలో పవన్‌ను కలిసి, ఆయనకు అందుతున్న వైద్య సేవలను, ఆరోగ్యం కుదుటపడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ చిరునవ్వుతో చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read: మీ బైక్‌లో E20 పెట్రోల్ కొట్టిస్తున్నారా? ఈ నిజాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!

Advertisement

సోషల్ మీడియాలో ఫొటో వైరల్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసుపత్రి గదిలో మాట్లాడుకుంటున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కూటమి ప్రభుత్వంలో కీలక నేతలైన వీరిద్దరి బంధాన్ని చూసి ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అభిమానుల ప్రార్థనలు

పవన్ కళ్యాణ్ సర్జరీ పూర్తి చేసుకుని కోలుకుంటున్నారనే వార్త తెలియడంతో జనసేన శ్రేణులు, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘గెట్ వెల్ సూన్ అన్నయ్య’, ‘త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలోకి రావాలి’ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. వైద్యుల సమాచారం ప్రకారం మరికొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయి తిరిగి ఏపీకి చేరుకోనున్నారు.

Related News

ఏపీలో స్థానిక ఎన్నికల ఫైట్.. పత్తా లేని వైసీపీ, జోష్ లేక డీలా పడుతున్న కేడర్

లోకల్ బాడీ ఎన్నికలపై విజయసాయిరెడ్డి పలుకులు, రూలింగ్ పార్టీకి అనుకూలం, పవన్‌పై కూడా

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమిలో సీట్లు సర్దుబాటు.. 4:1 ఫార్ములాలో జనసేన-బీజేపీ, మిగతా సీట్లలో టీడీపీ

ఒక్క క్యూఆర్ కోడ్‌తో బిడ్డ ప్రాణాలు సురక్షితం.. ఏపీ పోలీసులు సూపర్ ఐడియా..?

వైఎస్ జగన్‌కి బిగ్ షాక్.. జనసేనలోకి వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతలు జంప్?

కృష్టా జిల్లా మున్సిపాలిటీల్లో షాకింగ్ న్యూస్.. మారిన రాజకీయ ముఖచిత్రం!

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పిన పవన్!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

Big Stories

Advertisement
×