E-Paper
Advertisement

రాజధానిలో ప్రారంభోత్సవాలు.. ఆగస్టు 13న అలా అమరావతిలో!

రాజధానిలో ప్రారంభోత్సవాలు.. ఆగస్టు 13న అలా అమరావతిలో!
Advertisement

Amaravati: ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. వర్షాలు వచ్చినా పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతున్నాయి. ఈనెల 13న అమరావతిలో ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అందులో ప్రజాప్రతినిధుల నివాసాలు,  సీడ్ యాక్సెస్ రోడ్డు ఉన్నట్లు తెలుస్తోంది.

రాజధాని అమరావతిలో ప్రారంభోత్సవాల షురూ!

రాజధాని అమరావతిలో భవనాలు, రోడ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. పూర్తయిన వాటిని అప్పగించాలని ఆలోచన చేసింది ప్రభుత్వం. అత్యాధునిక వసతులతో, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మించిన ఎమ్మెల్యే-ఎమ్మెల్సీల నివాసాలను సాధారణ పరిపాలనా శాఖకు అప్పగించనున్నారు అప్పగించనున్నారు. దీనికి ఆగష్టు 13న ముహూర్తం పెట్టుకున్నట్లు మంత్రులు తెలిపారు.

Advertisement

ఐకానిక్‌ టవర్స్‌, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను మంత్రులు దగ్గర ఉండి పరిశీలించారు. మిగతా వాటి పనులు జరుగుతున్న తీరును తోటి మంత్రులకు వివరించారు మున్సిపల్ మంత్రి నారాయణ. అమరావతికి జీవనాడి సీడ్ యాక్సెస్ రోడ్డు. దీని నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

ఆగస్టు 13న ప్రజాప్రతినిధుల భవనాలు ప్రారంభం, ఆపై అప్పగింత

ఈ నెల 13న సీఎం చేతుల మీదుగా దాన్ని ప్రారంభించేందుకు CRDA అధికారులు సర్వం సిద్ధం చేశారు. జాతీయ రహదారులతో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులను అనుసంధానించే  సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రానుంది. దీంతో విజయవాడ-గుంటూరు ప్రాంతాల నుంచి అమరావతికి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ప్రారంభం!

Advertisement

విజయవాడ నుంచి అమరావతికి వచ్చే మార్గంలో ఉండవల్లి వద్ద స్టీలు బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోంది. ఇది పూర్తయితే ప్రకాశం బ్యారేజీ మీదుగా అమరావతికి చేరుకోవచ్చు. అప్రోచ్‌ రోడ్లకు ఇరువైపులా మొక్కలతో పార్క్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. రోడ్డుకు పొడవునా వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌ల నిర్మిస్తున్నారు.

ALSO READ: అబద్దానికి మీ కన్నా ఎవరూ బాగా చెప్పలేదు.. సీఎం చంద్రబాబుపై షర్మిల సెటైర్లు

కరకట్ట  నుంచి ప్రయాణించే వారంతా మరో 10 రోజుల్లో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపై మీదుగా  నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.  ఉండవల్లిలోని బకింగ్‌హామ్‌ కాలువపై స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యింది. దీన్ని సీడ్ యాక్సిస్ రోడ్డుకు లింక్ చేసే అప్రోచ్ రోడ్ల పనులు చివరి దశలో ఉన్నాయి. వీటిని సీఎం ప్రారంభించే అవకాశాలున్నాయి.

 

 

 

Related News

వైసీపీ నేత విజయప్రసాద్ గుట్టు బయటకు.. చిట్టా విప్పిన ఈడీ, ఆనాటి నుంచి అజ్ఞాతంలో

చిక్కుల్లో బిగ్‌బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్.. విశాఖ పోలీసులు కేసు నమోదు, యువతి వ్యవహారమే..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్‌లో

వైసీపీ ఫ్లెక్సీలో కేటీఆర్ ప్రత్యక్షం.. ఏలూరు ర్యాలీలో అసలేం జరుగుతోంది?

థాయ్‌లాండ్‌లో చిక్కుకున్న తెలుగు యువత.. రంగంలోకి దిగిన నారా లోకేష్!

డాక్టర్ ప్రియాంక అంత్యక్రియలు.. ఈ కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదు!

పోలవరంపై కేంద్రం సంచలన ప్రకటన.. ఫేజ్-1కు మరో ఏడాది గడువు పెంపు!

పవిత్రమైన గోవింద నామాలపై పేరడీలా?.. పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం!

Big Stories

Advertisement
×