E-Paper
Advertisement

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్‌లో

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్‌లో
Advertisement

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. దీని కారణంగా మంగళవారం నుంచి శుక్రవారం మధ్య భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం ఏపీ-తెలంగాణ రాష్ట్రాలపై పడనుంది. వర్షాలు పడే సమయంలో ఉరుములు-మెరుపులు, బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.

 

బంగాళాఖాతంలో అల్పపీడనం

Advertisement

వాయువ్య బంగాళాఖాతంలో ఎగువన తుఫాను వలయం ఏర్పడింది. అది క్రమంగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. దీని ప్రభావంతో మంగళవారం నుంచి శుక్రవారం మధ్య ఒడిషా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

 

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Advertisement

అమరావతి-హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన తాజా సూచనల ప్రకారం.. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 17 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని తెలిపాయి. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

 

ఏపీ అంతటా భారీ వర్షాలు పడే అవకాశం

ఈ అల్పపీడనానికి తోడు మరో అల్పపీడనం బుధవారం ఏర్పడే అవకాశముందని సూచనప్రాయంగా తెలిపింది. ఏపీ-తెలంగాణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మంగళవారం నుంచి శనివారం వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ALSO READ: వైసీపీ ఫ్లెక్సీలో కేటీఆర్ ప్రత్యక్షం.. ఏలూరు ర్యాలీలో అసలేం జరుగుతోంది?

పిడుగులు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేసింది డిజాస్టర్ మేనేజ్మెంట్. కొన్ని చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో ఆగస్టు 10 నుంచి 17 వరకు వాతావరణ ఒకేలా ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Related News

ఏపీలో ఘోరాతి ఘోరం.. నానమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మనువడు!

విధుల్లో ఉండగానే గుండెపోటు.. నున్న సీఐ అలీ మృతి!

షాక్‌లో బొత్స సత్తిబాబు, సొంత అడ్డాలో వైసీపీ నేతల షాక్, మూకుమ్మడి రాజీనామాలు

నేను అనుకుంటే వేల కోట్లు సంపాదించేవాడిని.. వైసీపీకి మంత్రి నారాయణ మాస్ కౌంటర్!

లోకేష్ టార్గెట్‌గా జగన్ కొత్త ఎత్తులు, రంగంలోకి వేణుగోపాల సోమిరెడ్డి, ఆళ్ల స్థాయిలో పోటీ ఇస్తారా?

తుని ఉమెన్స్ కాలేజీలో ఫుడ్ కలకలం, సాంబారులో బల్లి వ్యవహారం, ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్స

నిడదవోలులో మళ్లీ మొదలైన విగ్రహ వివాదం.. రంగంలోకి వంగవీటి రంగా కుమార్తె!

ఏపీలో మొట్టమొదటి తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

Big Stories

Advertisement
×