E-Paper
Advertisement

థాయ్‌లాండ్‌లో చిక్కుకున్న తెలుగు యువత.. రంగంలోకి దిగిన నారా లోకేష్!

థాయ్‌లాండ్‌లో చిక్కుకున్న తెలుగు యువత.. రంగంలోకి దిగిన నారా లోకేష్!
Advertisement

Thailand Cyber Scam: ఉద్యోగాల పేరుతో థాయ్‌లాండ్‌ వెళ్లి సైబర్ నేరగాళ్ల బారిన పడ్డ తెలుగు యువకుల దయనీయ పరిస్థితిపై ఏపీ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. బాధితుల ఆవేదనను, వారి కుటుంబాల ఆందోళనను తాను పరిపూర్ణంగా అర్థం చేసుకోగలనని, వారిని సురక్షితంగా మాతృదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..?

Advertisement

బ్యాంకాక్‌లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన ఒక ఏజెంట్ మోసానికి ఈ యువకులు బలయ్యారు. అక్కడకు వెళ్లాక, సైబర్ కేటుగాళ్లు వీరిని తమ కస్టడీలోకి తీసుకుని బలవంతంగా అక్రమ కార్యకలాపాలకు పాల్పడేలా తీవ్ర వేధింపులకు గురిచేశారు. వారి నరకయాతన భరించలేక, చివరకు కొంత మొత్తంలో డబ్బులు చెల్లించి మయన్మార్ సరిహద్దు నుండి థాయ్‌లాండ్ సరిహద్దుకు చేరుకున్నారు. ప్రస్తుతం చిక్కుకుపోయిన ఈ ఆరుగురిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కాగా, ముగ్గురు హైదరాబాద్ వాసులు, మరొకరు పశ్చిమ బెంగాల్‌కి చెందిన వ్యక్తులు ఉన్నారు.

రప్పించేందుకు వేగంగా అడుగులు

Advertisement

ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలుసుకున్న లోకేష్.. వెంటనే స్పందిస్తూ తగిన చర్యలు ప్రారంభించారు. కేంద్ర విదేశాంగ శాఖ, సంబంధిత రాయబార కార్యాలయ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తున్నట్లు తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని, తన మంత్రిత్వ కార్యాలయం ఆధ్వర్యంలో అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ ఆరుగురు యువకులు క్షేమంగా ఇంటికి చేరేలా చూస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

Also Read: చార్మినార్ వద్ద మహిళకు వింత అనుభవం.. నంబర్ ప్లేట్ లేని బైక్.. నకిలీ ర్యాపిడో డ్రైవర్ గుట్టు రట్టు!

Tags

Related News

ఏపీలో ఘోరాతి ఘోరం.. నానమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మనువడు!

విధుల్లో ఉండగానే గుండెపోటు.. నున్న సీఐ అలీ మృతి!

షాక్‌లో బొత్స సత్తిబాబు, సొంత అడ్డాలో వైసీపీ నేతల షాక్, మూకుమ్మడి రాజీనామాలు

నేను అనుకుంటే వేల కోట్లు సంపాదించేవాడిని.. వైసీపీకి మంత్రి నారాయణ మాస్ కౌంటర్!

లోకేష్ టార్గెట్‌గా జగన్ కొత్త ఎత్తులు, రంగంలోకి వేణుగోపాల సోమిరెడ్డి, ఆళ్ల స్థాయిలో పోటీ ఇస్తారా?

తుని ఉమెన్స్ కాలేజీలో ఫుడ్ కలకలం, సాంబారులో బల్లి వ్యవహారం, ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్స

నిడదవోలులో మళ్లీ మొదలైన విగ్రహ వివాదం.. రంగంలోకి వంగవీటి రంగా కుమార్తె!

ఏపీలో మొట్టమొదటి తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

Big Stories

Advertisement
×