E-Paper
Advertisement

చిక్కుల్లో బిగ్‌బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్.. విశాఖ పోలీసులు కేసు నమోదు, యువతి వ్యవహారమే..

చిక్కుల్లో బిగ్‌బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్.. విశాఖ పోలీసులు కేసు నమోదు,  యువతి వ్యవహారమే..
Advertisement

Visakhapatnam: సింగర్, బిగ్‌బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ చిక్కుల్లో పడ్డాడు. ఆయనకు విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. ఓ యువతి ఫిర్యాదు మేరకు రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు 11 మంది కేసు నమోదు చేశారు ఎంపీవీ పోలీసులు. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

 

చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్

Advertisement

సింగర్, బిగ్‌‌బాస్‌ ఫేమ్ రాహుల్‌ సిప్లిగంజ్‌ బంధువు తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసగించినట్లు ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత యువతి. ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలతో తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని అందులో ప్రస్తావించింది. అందులో రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు 11 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

యువతి ఫిర్యాదు.. విశాఖ పోలీసులు కేసు నమోదు

Advertisement

ఫిర్యాదులో రాహుల్‌పై పలు తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. యువతి సమర్పించిన వివరాలు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తొలుత విశాఖ సీపీకి మార్చి 10న రాహుల్‌రెడ్డిపై ఫిర్యాదు చేసింది యువతి. రెండు నెలల కిందట ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో రాహుల్‌రెడ్డి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా మరికొంత మందిపై మరొక ఫిర్యాదు చేసింది.

 

విచారణ మొదలుపెట్టిన పోలీసులు

దీంతో ఈ కేసును ఎంవీపీ పోలీసులు ఎండాడలోని మహిళా పోలీస్ స్టేషన్‌కు ట్రాన్సఫర్ చేశారు. ఈ వ్యవహారంలో రాహుల్‌రెడ్డిని సదరు యువతి కోటి రూపాయలు డిమాండ్ చేయడంతో డబ్బులు ఇవ్వలేక ఈ విధంగా కేసు పెట్టారని ఆరోపణలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది. పోలీసులు విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

ALSO READ: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Related News

ఏపీలో ఘోరాతి ఘోరం.. నానమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మనువడు!

విధుల్లో ఉండగానే గుండెపోటు.. నున్న సీఐ అలీ మృతి!

షాక్‌లో బొత్స సత్తిబాబు, సొంత అడ్డాలో వైసీపీ నేతల షాక్, మూకుమ్మడి రాజీనామాలు

నేను అనుకుంటే వేల కోట్లు సంపాదించేవాడిని.. వైసీపీకి మంత్రి నారాయణ మాస్ కౌంటర్!

లోకేష్ టార్గెట్‌గా జగన్ కొత్త ఎత్తులు, రంగంలోకి వేణుగోపాల సోమిరెడ్డి, ఆళ్ల స్థాయిలో పోటీ ఇస్తారా?

తుని ఉమెన్స్ కాలేజీలో ఫుడ్ కలకలం, సాంబారులో బల్లి వ్యవహారం, ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్స

నిడదవోలులో మళ్లీ మొదలైన విగ్రహ వివాదం.. రంగంలోకి వంగవీటి రంగా కుమార్తె!

ఏపీలో మొట్టమొదటి తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

Big Stories

Advertisement
×