E-Paper
Advertisement

పోలవరంపై కేంద్రం సంచలన ప్రకటన.. ఫేజ్-1కు మరో ఏడాది గడువు పెంపు!

పోలవరంపై కేంద్రం సంచలన ప్రకటన.. ఫేజ్-1కు మరో ఏడాది గడువు పెంపు!
Advertisement

Polavaram Project: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, పనుల పురోగతిపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. రాజ్యసభలో ఎంపీ ఆర్‌. కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు.

రూ. 12 వేల కోట్లకు పైగా నిధుల విడుదల

Advertisement

గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల (2021-26) కాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటివరకు రూ. 12,620.53 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా, ప్రాజెక్టు మొదటి దశ (ఫేజ్-I) కింద సవరించిన అంచనా వ్యయం రూ. 30,436.95 కోట్లకు కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

చివరి దశకు చేరిన డ్యామ్ పనులు

Advertisement

ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన స్పిల్‌వే, ఎర్త్-కం-రాక్‌ఫిల్ (ECRF) డ్యామ్ పనులు ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస ప్రక్రియను కూడా వేగవంతం చేశామని, ఇందులో భాగంగా ఇప్పటివరకు 17,892 కుటుంబాలను కొత్త ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు. వీరి పునరావాస పనుల కోసం రూ. 1,373.01 కోట్లు చెల్లించినట్లు మంత్రి సభకు తెలిపారు.

ఫేజ్-1 పూర్తికి మరో ఏడాది గడువు

పోలవరం ఫేజ్-I నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు గతంలో మార్చి 2026ను లక్ష్యంగా పెట్టుకోగా, క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా ఆ గడువును మరో ఏడాది పొడిగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. నిర్ణీత సమయంలోగా మిగిలిన పనులన్నీ పూర్తి చేసి, ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రాధాన్యమని కేంద్ర ప్రభుత్వం వివరించింది.

Also Read: రేవంతేం సొంతంగా ఎదగలేదు.. మా నాన్న పుణ్యమే! ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్!

Tags

Related News

ఏపీలో ఘోరాతి ఘోరం.. నానమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మనువడు!

విధుల్లో ఉండగానే గుండెపోటు.. నున్న సీఐ అలీ మృతి!

షాక్‌లో బొత్స సత్తిబాబు, సొంత అడ్డాలో వైసీపీ నేతల షాక్, మూకుమ్మడి రాజీనామాలు

నేను అనుకుంటే వేల కోట్లు సంపాదించేవాడిని.. వైసీపీకి మంత్రి నారాయణ మాస్ కౌంటర్!

లోకేష్ టార్గెట్‌గా జగన్ కొత్త ఎత్తులు, రంగంలోకి వేణుగోపాల సోమిరెడ్డి, ఆళ్ల స్థాయిలో పోటీ ఇస్తారా?

తుని ఉమెన్స్ కాలేజీలో ఫుడ్ కలకలం, సాంబారులో బల్లి వ్యవహారం, ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్స

నిడదవోలులో మళ్లీ మొదలైన విగ్రహ వివాదం.. రంగంలోకి వంగవీటి రంగా కుమార్తె!

ఏపీలో మొట్టమొదటి తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

Big Stories

Advertisement
×