E-Paper
Advertisement

పవిత్రమైన గోవింద నామాలపై పేరడీలా?.. పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం!

పవిత్రమైన గోవింద నామాలపై పేరడీలా?.. పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం!
Advertisement

Pawan Kalyan: తిరుమల వేంకటేశ్వర స్వామి నామాలను రాజకీయ విమర్శలకు వాడుకోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తి గీతాలను పొలిటికల్ అవసరాలకు పేరడీగా పాడుతూ అపహాస్యం చేయడాన్ని తప్పుబట్టారు. నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్సీ పాల్గొన్న నిరసనల కార్యక్రమంలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడంపై విచారణకు ఆదేశించారు.

చట్టపరమైన చర్యలకు ఆదేశం

గోవింద నామాలను పేరడీగా వాడటంపై డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను జనసేన పార్టీ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా దీనిని పవన్ అభివర్ణించారు. దైవ నామాలు, మంత్రాలు, స్తోత్రాలు, భక్తి గీతాలను అపహాస్యం కోసం ఉపయోగించవద్దని రాజకీయ నేతలకు సూచించారు. ఈ ఘటనపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ధార్మిక విశ్వాసాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని.. మతపరమైన విద్వేషాలకు తావివ్వకూడదని ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు.

Advertisement

Also Read: ఫార్చ్యూన్ ఇండియా కవర్ పేజీపై లోకేశ్ ఫొటో.. రూ.కోటి ఖర్చు చేశారా? ఫ్యాక్ట్ చెక్‌లో తేలిందిదే!

అసలేం జరిగిందంటే?

Advertisement

నెల్లూరులోని వీఆర్ఎసీ సెంటర్ లో వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్న నిరసనల కార్యక్రమంలో ఈ అభ్యంతరకర ఘటన చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు గోవింద నామాలను వైసీపీ కార్యకర్తలు ఉపయోగించారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీనిపై హిందూ సంఘాలు, నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతర మతస్తులు పాల్గొన్న రాజకీయ వేదికపై వేంకటేశ్వర స్వామి నామాలను రాజకీయ నినాదంగా మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Also Read: ఇంటి అద్దె కంటే.. EMI ఎక్కువైనా సొంత ఇల్లు కొనొచ్చా? సూటిగా సుత్తి లేకుండా!

Tags

Related News

ఏపీలో ఘోరాతి ఘోరం.. నానమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మనువడు!

విధుల్లో ఉండగానే గుండెపోటు.. నున్న సీఐ అలీ మృతి!

షాక్‌లో బొత్స సత్తిబాబు, సొంత అడ్డాలో వైసీపీ నేతల షాక్, మూకుమ్మడి రాజీనామాలు

నేను అనుకుంటే వేల కోట్లు సంపాదించేవాడిని.. వైసీపీకి మంత్రి నారాయణ మాస్ కౌంటర్!

లోకేష్ టార్గెట్‌గా జగన్ కొత్త ఎత్తులు, రంగంలోకి వేణుగోపాల సోమిరెడ్డి, ఆళ్ల స్థాయిలో పోటీ ఇస్తారా?

తుని ఉమెన్స్ కాలేజీలో ఫుడ్ కలకలం, సాంబారులో బల్లి వ్యవహారం, ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్స

నిడదవోలులో మళ్లీ మొదలైన విగ్రహ వివాదం.. రంగంలోకి వంగవీటి రంగా కుమార్తె!

ఏపీలో మొట్టమొదటి తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

Big Stories

Advertisement
×