E-Paper
Advertisement

వైసీపీ ఫ్లెక్సీలో కేటీఆర్ ప్రత్యక్షం.. ఏలూరు ర్యాలీలో అసలేం జరుగుతోంది?

వైసీపీ ఫ్లెక్సీలో కేటీఆర్ ప్రత్యక్షం.. ఏలూరు ర్యాలీలో అసలేం జరుగుతోంది?
Advertisement

YSRCP-BRS: ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో ఇటీవల ఒక ఆసక్తికరమైన రాజకీయ సంఘటన వెలుగు చూసింది. డీఎస్సీ నిర్వహణలోని అవకతవకలకు వ్యతిరేకంగా వైసీపీ నేత తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ఇక్కడ ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమంలో వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఫ్లెక్సీలలో హఠాత్తుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫొటో ప్రత్యక్షమవ్వడం స్థానికంగానే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ పెద్ద ఎత్తున కలకలం రేపింది.

ఫ్లెక్సీల వెనుక ప్రధాన ప్రచారం

Advertisement

ర్యాలీలో ప్రదర్శించిన ఈ బ్యానర్లలో ‘2029లో అధికారంలోకి వచ్చేది మేమే’ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచారం చేశారు. ఒక పక్కన జగన్ బొమ్మ, మరొక పక్కన కేటీఆర్ బొమ్మలు పక్కపక్కనే ముద్రించి ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది. డీఎస్సీ అభ్యర్థుల సమస్యలపై చేపట్టిన పోరాటం కంటే కూడా, ఈ ఫ్లెక్సీలలో కనిపించిన పొలిటికల్ కాంబినేషన్ గురించే అక్కడ ఎక్కువ చర్చ నడిచింది.

మళ్లీ మొదలైన పొత్తుల చర్చ

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు మొదటినుంచీ ఉన్నవే. ఇప్పుడు ఈ కొత్త ఫ్లెక్సీ వ్యవహారం ఆ అనుమానాలకు మళ్లీ రెక్కలు తొడిగింది. 2029 ఎన్నికల నాటికి వీరిద్దరూ కలిసి ఏమైనా కొత్త రాజకీయం చేయబోతున్నారా? లేక ఇది కేవలం స్థానిక నాయకులు ఉత్సాహంతో చేసిన పొరపాటా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

మొత్తానికి, డీఎస్సీ సమస్యపై నిర్వహించిన ఈ నిరసన ర్యాలీ కాస్తా.. వైసీపీ-బీఆర్ఎస్ మధ్య రాజకీయ సంబంధాలపై కొత్త చర్చలకు తెరతీసేలా చేసిందని చెప్పవచ్చు.

Tags

Related News

జగన్ ఎక్కడికి వెళ్లినా అదే రచ్చ.. కర్నూలు జైలులో ఏం జరిగింది? నిజాలు బయటపెట్టిన జైలు అధికారి

అంతర్జాతీయ నగరం.. అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం! ఆపై సీఎం చంద్రబాబు..

ఆధారాలు పట్టుకుని రండి.. డీఎస్సీపై చర్చకు మేము సిద్ధం.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్!

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. రాజమండ్రి కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు!

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్.. స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఆ ‘వంపు’ ఎందుకు?

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు.. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమే-సీఎం చంద్రబాబు

శ్రీకాకుళంలో టైటానియం ప్లాంట్‌.. సీఎం చంద్రబాబుతో కరణ్ అదానీ భేటీ, రూ.16 వేల కోట్లు పెట్టుబడులు

భోగాపురం ఎయిర్‌పోర్టులో రాకపోకలు.. ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×