E-Paper
Advertisement

ఆట సందీప్ కి కూడా తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు.. కార్పొరేట్ స్టైల్లో మెసేజ్!

ఆట సందీప్ కి కూడా తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు.. కార్పొరేట్ స్టైల్లో మెసేజ్!
Advertisement

Aata Sandeep:ఏ ఇండస్ట్రీలో అయినా సరే ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తేనే గౌరవం..అయితే ఆ గుర్తింపు లభించడంలో కాస్త లేట్ అయినప్పటికీ.. ఆ టాలెంట్ వెలుగులోకి వచ్చినప్పుడు ప్రజలు లేదా ఇండస్ట్రీ వారికి ప్రత్యేకంగా పట్టం కడతారు అనడంలో సందేహం లేదు. అలా కొన్ని సంవత్సరాలు పాటు టాలెంట్ ఉన్నా తగిన గుర్తింపు లేక ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తున్న ఆట సందీప్ కి ఈమధ్య కాలం కలిసి వచ్చింది. కొంతకాలం క్రితం డాన్స్ స్టూడియో ప్రారంభించి భార్యతో కలిసి స్టూడెంట్స్ కి డాన్స్ క్లాసులు నేర్పిస్తూ.. జీవనం కొనసాగిస్తున్న ఆయన.. ఇటీవల ఛాంపియన్ మూవీలో “గిరగిరా గింగిరానివే”, చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాలో హుక్ స్టెప్ పాటలతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయారు.

అమెరికా నుంచి వచ్చా.. ఎంత డబ్బైనా ఇస్తా..

అలాంటి ఈయన తాజాగా వరుస ఇంటర్వ్యూలలో తన భార్యతో కలిసి పాల్గొంటూ ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు. అందులో భాగంగానే క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సాధారణంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బారిన ఎక్కువగా మహిళలే పడుతూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పుడప్పుడు మగవారు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఈ జాబితాలోకి ఆట సందీప్ కూడా వచ్చి చేరారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆట సందీప్ మాట్లాడుతూ..” వారం రోజులు ఎంజాయ్ చేస్తే.. కోరుకున్నంత డబ్బు ఇవ్వడమే కాకుండా నచ్చినవి ఆఫర్గా ఇస్తాను” అంటూ కార్పొరేట్ స్టైల్లో మెసేజ్ చేశారు అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి ఆట సందీప్ ఏం చెప్పారు అనే విషయం ఇప్పుడు చూద్దాం.

Advertisement

also read:మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

ఆట సందీప్ కి తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు..

ఇండస్ట్రీలో నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొంతమంది అమ్మాయిలు డబ్బులు ఇస్తాము. మాతో ఎంజాయ్ చేయడానికి వస్తావా అని మెసేజ్లు పెట్టే వాళ్ళు.. అయితే రీసెంట్గా ఒక వారం క్రితం కూడా ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పటికే నా సెల్ లో ఆ మెసేజ్ ఉంది. అమెరికా నుంచి వచ్చాను. ఇక్కడ ఉంటున్నాను. వన్ వీక్ ఎంజాయ్ చేయాలి. డబ్బులు ఇస్తాను అన్నట్టుగా ఒక మెసేజ్ వచ్చింది. ఎవరో తెలియదు.. ఏంటో తెలియదు.. నీకు ఆసక్తి ఉందా అని కూడా అడిగారు. అది చాలా క్లీన్ మెసేజ్ ..పర్ఫెక్ట్ గా చెప్పాలి అంటే కార్పొరేట్ స్టైల్లో ఒక మెసేజ్ పంపించారు. నాకు ఇంట్రెస్ట్ లేదని అప్పుడే చెప్పేశాను. మళ్లీ రెండు రోజుల తర్వాత మళ్లీ ఇంకో మెసేజ్ పెట్టారు. నీకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటే ఇస్తాను. నీకేం కావాలో అది ఇస్తాను వచ్చేయ్ అంటూ మెసేజ్ పెట్టారు.” అంటూ ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్లు చేశారు. ఆట సందీప్.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు ఐదు సార్లు అడిగారు. పైగా వేరే జెండర్ వాళ్లు కూడా మెసేజ్ పెట్టారు”. అంటూ క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్లు చేశారు ఆట సందీప్.

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ విడిపోతారా..? రామరాజు నెక్స్ట్ ఏంటి..? శ్రీవల్లి అవుట్..

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Big Stories

Advertisement
×