E-Paper
Advertisement

అమరావతిలో మళ్లీ ల్యాండ్ పూలింగ్.. మౌలిక సదుపాయాలకు రూ.1,437 కోట్లు మంజూరు

అమరావతిలో మళ్లీ ల్యాండ్ పూలింగ్.. మౌలిక సదుపాయాలకు రూ.1,437 కోట్లు మంజూరు
Advertisement

Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకున్న ఏపీ ప్రభుత్వం, మరో అడుగులు ముందుకేసింది. ఆ ప్రాజెక్టుల నిమిత్తం మరో 1654 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

అమరావతిలో మళ్లీ ల్యాండ్ పూలింగ్

Advertisement

రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా సీఆర్డీఏ మరో అడుగు వేసింది. రాజధాని విస్తరణ, మౌలిక వసతుల కల్పన కోసం తాడికొండ మండల పరిధిలో భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి భూమి సేకరణలో అమరావతికి ఎంతో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్, రాజధానిని అనుసంధానించే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు అవసరాల కోసం సమీకరిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొంది. భూసమీకరణ 2,344.12 ఎకరాలు ఉంది. అందులో పట్టా భూమి 1,654.259 ఎకరాలు ఉంది.

మిగిలి భూమిని ప్రభుత్వ భూమి ఉంది. ఈ క్రమంలో రాజధాని కనెక్టివిటీ వేగవంతం చేయడం, మౌలిక వసతుల కల్పనకు కీలకం కావడంతో భూసమీకరణ ప్రక్రియను చేపట్టింది. మోతడక గ్రామంలో ఆయా భూములు సేకరించనుంది. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో భూసమీకరణ చేపడుతున్నట్లు ప్రస్తావించింది. అమరావతిలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మోతడకలో భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది.

Advertisement

 

అమరావతి గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు రూ.1,437 కోట్లు

మరోవైపు రాజధాని అమరావతిలోని 29 గ్రామాల్లో పౌర సౌకర్యాలు, భారీ మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం చంద్రబాబు రూ.1,437 కోట్లను మంజూరు చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ-CRDA 65వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో రూ. 533 కోట్లు మౌలిక సదుపాయాల కోసం కేటాయించనున్నారు. 2014-19 మధ్య రాజధాని కోసం భూములు ఇచ్చిన 29 గ్రామాల్లో రోడ్లు, వర్షపు నీటి కాలువలు, భూగర్భ మురుగునీటి పారుదల, తాగునీటి పైప్‌లైన్లు, వీధి దీపాలు వంటి పనులు చేపట్టనున్నారు.

అమరావతి మాదిరిగా ఆయా గ్రామాలలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.శాఖమూరులో కేంద్ర పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, హెచ్‌ఆర్ సంబంధిత భవనాల నిర్మాణానికి రూ. 596 కోట్లు విడుదల చేశారు. ఎల్‌పిఎస్ లేఅవుట్‌లలో ప్రభుత్వం తొలుత సిమెంట్-కాంక్రీట్ రోడ్లను ప్రతిపాదించింది. అమరావతిలో రానున్న రోజుల్లో వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-ఐఐటి ఖరగ్‌పూర్ నిర్వహించిన అధ్యయనాల తర్వాత బిటుమెన్ రోడ్లను ఎంచుకుంది ప్రభుత్వం.

ALSO READ: ఎల్ నినో కంటే జగనే పెద్ద విపత్తు.. మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్!

Related News

ఎల్ నినో కంటే జగనే పెద్ద విపత్తు.. మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్!

విశాఖ రేవ్ పార్టీలో నేతల మధ్య రచ్చ.. అమ్మాయిల కోసం కొట్లాట, ఆపై కత్తిపోట్లు, అసలు ఏం జరిగింది?

ఆటోను ఢీ కొట్టి ట్రావెల్ బస్సు, ఏడుగురు మృతి, మరో 8 మంది పరిస్థితి విషమం, చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం

పవన్ vs జగన్.. పులివెందుల దాహార్తి తీర్చిందెవరు? ఎవరి పాత్ర ఎంత?

డైరెక్షన్.. ప్రొడక్షన్ కాదు ఫైనాన్స్ కూడా.. టైమ్-డేట్-లోకేషన్ ఎప్పుడైనా నేను సిద్ధమే, జగన్‌కు లోకేష్ ఛాలెంజ్

చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకేసిన మాజీ సీఎం, కేవలం మూడు అంశాలను టార్గెట్ చేసిన జగన్

కారుమూరి అరెస్టుపై నోరు విప్పిన జగన్.. జిల్లా స్థాయిలో జరిగే కాంట్రాక్టులంటూ సరికొత్త పల్లవి

Big Stories

Advertisement
×