E-Paper
Advertisement

పాకిస్థాన్ గాడిదలను.. ఎగబడి కొంటున్న చైనా.. ఎందుకో తెలిస్తే షాకే!

పాకిస్థాన్ గాడిదలను.. ఎగబడి కొంటున్న చైనా.. ఎందుకో తెలిస్తే షాకే!
Advertisement

Pakistan Donkeys: పాకిస్థాన్ లోని కరాచీ వీధులు అనగానే ముందుగా గాడిదలే గుర్తుకు వస్తాయి. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున గాడిద బండ్ల రేసులు జరుగుతుంటాయి. స్థానిక ప్రజలు వీటిని తిలకిస్తూ, కేరింతలు కొడుతుంటారు. దీనికి తోడు పాకిస్థాన్ లో అధిక సంఖ్యలో ఉండే గాడిదలు పేద ప్రజలకు వ్యాపార సాదనంగా మారిపోయాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం చైనా దృష్టి పాకిస్థాన్ లోని గాడిదలపై పడినట్లు తెలుస్తోంది. అక్కడి కార్పోరేట్ కంపెనీలు కరాచీ గాడిదలను కొనుగోలు చేసేందుకు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నాయట. ఇందుకు గల కారణాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

పాక్ గాడిదలపై చైనా ఆసక్తి ఎందుకంటే?

చైనాలో ‘ఎజియావో’ (Ejiao) అనే సాంప్రదాయ ఔషధ తయారీకి గాడిద చర్మం నుంచి తీసే జిలాటిన్ ఎంతో ముఖ్యం. ఆరోగ్యకరమైన, అందాన్నిచ్చే ఉత్పత్తుల్లో దీనికి అక్కడ విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను తట్టుకోవడానికి ఏటా దాదాపు 40 నుంచి 60 లక్షల గాడిద చర్మాలు చైనాకు అవసరమవుతున్నాయి. అయితే చైనాలో గాడిదల జనాభా తగ్గిపోవడంతో చైనా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సరఫరా కోసం వెతకడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే సుమారు 62 లక్షల గాడిదలతో ప్రపంచంలోనే అతిపెద్ద సంఖ్యను కలిగిన పాకిస్తాన్ పైకి చైనా దృష్టి మళ్లింది. గాడిదల కొనుగోలు చేసేందుకు అనువైన మార్కెట్ గా పాకిస్థాన్ చైనాకు మారింది. చైనాకు అనువైన మార్కెట్‌గా మారింది.

ఆకాశాన్నంటిన గాడిద ధరలు

Advertisement

చైనాతో అంతర్జాతీయ వ్యాపార ఒప్పందం కారణంగా పాకిస్తాన్‌లో గాడిదల ధరలు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. గతంలో రూ. 30,000 దొరికే గాడిద ధర ఇప్పుడు రూ.2 లక్షలకు చేరుకుంది. ఇది తమపై తీవ్ర ప్రభావం చూపుతోందని అక్కడి పేదలు వాపోతున్నారు. నిజానికి పాక్ లో మోటార్ వాహనాలను కొనుగోలు చేయలేని పేదలకు, చిన్న వ్యాపారులకు ఇప్పటికీ గాడిదే ఏకైక జీవనాధారంగా ఉంటూ వస్తోంది. కానీ ఇప్పుడు గాడిద చనిపోతే దాన్ని భర్తీ చేయడం స్థానిక రవాణాదారులకు, రోజువారీ కూలీలకు భరించలేని భారంగా మారిపోయింది.

Also Read: Jio రూ.299 vs Airtel రూ.349.. రెండిటిలో ఏ ప్లాన్ బెస్ట్.. దేనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ?

గాడిదల దొంగతనాలు, అక్రమ వధ

Advertisement

అయితే గాడిదల మాంసం, చర్మం ఎగుమతుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకోవచ్చని పాకిస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది. గ్వాదర్ ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్‌లో చైనా కంపెనీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. మరోవైపు గాడిద ధరలు అమాంతం పెరిగిపోవడంతో పాక్ లో వాటి దొంగతనాలు, మాంసం కోసం అక్రమ వధలు పెరిగిపోతున్నాయి. దీంతో గాడిదల నిర్వహణపై పాక్ అధికార యంత్రాంగం ఆంక్షలకు సైతం వెనుకాడటం లేదు. మెుత్తంగా చైనాలో బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీలకు గాడిదలను పెద్ద ఎత్తున తరలించి.. తమ పొట్ట కొట్టవద్దని సామాన్యులు వాపోతున్నారు. ప్రస్తుతం చైనా – పాక్ మధ్య అంతర్జాతీయ వర్తకానికి గాడిద ఎంత ముఖ్యమైన వస్తువుగా మారిపోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Also Read: బిచ్చగాడి అవతారంలో.. యూట్యూబర్ ప్రయోగం.. ఆదాయం చూసి అంతా షాక్!

Tags

Related News

ఇండియన్ బుల్లెట్ రైలుపై పట్టాలెక్కేది ఎప్పుడంటే.. జపాన్ అధికారి షాకింగ్ కామెంట్స్!

హైదరాబాద్‌లోనే జపాన్ ఫీలింగ్, మచ్చా తాగుతూ.. అనిమే చూస్తూ.. ఎంజాయ్ చేసేయండి!

స్వర్ణగిరి ఆలయ నిర్వాహకులకు యాదగిరిగుట్ట దేవస్థానం లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే?

అమరావతి ORR డిజైన్‌లో కీలక మార్పులు.. కొత్త రూట్ మ్యాప్ ఇదే!

చంకలో వెంట్రుకలకు రంగులు.. ఆ దేశంలో ఇదే ట్రెండ్!

మధుర మీనాక్షి ఆలయాన్ని కట్టించింది తెలుగు రాజులేనా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 మలుపులు.. ఈ రోడ్డు మీద డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదు!

అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ మనసు దోచే 5 ప్రదేశాలు ఇవే

Big Stories

Advertisement
×