E-Paper
Advertisement

దేశంలో విచిత్రమైన ఊర్లు.. బండ బూతులే వీటి పేర్లు.. అలా ఎలా పెట్టార్రా అయ్యా!

దేశంలో విచిత్రమైన ఊర్లు.. బండ బూతులే వీటి పేర్లు.. అలా ఎలా పెట్టార్రా అయ్యా!
Advertisement

Weird City Names: భారతదేశం విభిన్న మతాలు, సంస్కృతులతో పాటు కొన్ని రకాల వింతలకు సైతం నిలయంగా ఉంది. దేశంలోని కొన్ని ఊళ్ల పేర్లు నవ్విస్తే.. మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తాయి. భారత్ లో వినడానికి చాలా వింతగా ఉన్న టాప్ – 10 ఊర్లు, ఆ పేర్లకు అర్థం ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

భబువా (బీహార్)

బీహార్‌లోని కైమూర్ జిల్లాలో ఉన్న ఈ పట్టణానికి ‘భబువా’ (Bhabua) అనే పేరుంది. బీహారీ భాషలో చిన్నపిల్లలను ప్రేమగా పిలుచుకోవడానికి ఈ పదాన్ని వాడతారు. వినడానికి కొంచెం వింతగా అనిపించినప్పటికీ పాలనాపరంగా ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

లోల్‌పూర్ (ఉత్తర ప్రదేశ్)

Advertisement

అయోధ్య జిల్లాలోని ఈ గ్రామం పేరు వింటే ఎవరైనా నవ్వాల్సిందే. ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ‘LOL’ అంటే గట్టిగా నవ్వడం అనే అర్థంలో వాడుతుంటారు. ఈ ఊరి పేరు (Lolpur) కూడా దాంతో సరిగ్గా సరిపోలడంతో పర్యాటకులకు ఇది ఎంతో సరదాగా అనిపిస్తుంది.

ఫోర్బ్స్‌గంజ్ (బీహార్)

ఫోర్బ్స్ అనే పత్రికకు ప్రపంచవ్యాప్తంగా ఏంతో గుర్తింపు ఉంది. ఇది ప్రతీ ఏటా ప్రపంచంలోని సంపన్నుల జాబితాను రిలీజ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఆ సంస్థ పేరు మీదగానే బీహార్ లో ‘ఫోర్బ్స్ గంజ్’ (Forbesganj) ప్రాంతం ఉంది. అయితే ఇది బ్రిటీష్ కాలం నాటి అధికారి ఫ్రాన్సిస్ ఫోర్బ్స్ పేరు మీదుగా ఈ ఊరికి ఆ పేరు వచ్చింది.

పింపుల్ సౌదాగర్ (మహారాష్ట్ర)

Advertisement

పుణే నగరంలోని ఈ ప్రాంతానికి (Pimple Saudagar) ఉన్న పేరు.. ‘పింపుల్’ అనే ఇంగ్లీష్‌లోని మొటిమను గుర్తుచేస్తుంది. అయితే మరాఠీ భాషలో దీనికి వేరే అర్థం ఉంది. కొత్తగా ఈ పేరు వినేవారికి మాత్రం ఇది కాస్త వింతగా తోస్తుంది.

కుట్టా (కర్ణాటక)

కర్ణాటక కూర్గ్ సరిహద్దుల్లోని ఈ అందమైన పర్యాటక ప్రాంతం పేరు ‘కుట్టా’ (Kutta). హిందీలో ఈ పదానికి కుక్క అనే అర్థం రావడం వల్ల ఇతర రాష్ట్రాల ప్రజలు ఈ పేరు వినగానే ఆశ్చర్యపోతుంటారు. అయితే ఇది పచ్చటి వనాలతో ఏంతో ప్రశాంతమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది.

పనౌతి (ఉత్తర ప్రదేశ్)

హిందీలో ‘పనౌతి’ (Panauti) అంటే దురదృష్టం అని అర్థం. ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉన్న ఈ గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చిందో తెలియదు కానీ పేరుకి తగ్గట్టుగా అక్కడ ఎలాంటి చెడు శకునాలు ఉండవు.

అచానక్‌మార్ (ఛత్తీస్‌గఢ్)

హిందీలో ‘అచానక్‌మార్’ (Achanakmar) అంటే హఠాత్తుగా దాడి చేయడం అని అర్థం. పేరు వింటే కాస్త భయం వేసినప్పటికీ.. ఇది ఎంతో ప్రశాంతంగా ఉండే దట్టమైన అటవీ ప్రాంతం. ఇక్కడ ప్రముఖ టైగర్ రిజర్వ్ కూడా ఉంది.

కాలా బక్రా (పంజాబ్)

జలంధర్ జిల్లాలోని ఈ గ్రామం (Kala Bakra) పేరుకు హిందీలో ‘నల్ల మేక’ అని అర్థం వస్తుంది. గ్రామీణ సంస్కృతి, జీవన విధానంలో భాగంగా ఈ ఊరికి ఈ పేరు వచ్చి ఉండొచ్చని అంతా భావిస్తుంటారు.

గాధా (గుజరాత్)

గుజరాత్‌లోని ఈ ప్రాంతం పేరు ‘గాధా’ (Gadha). దీనికి ‘గాడిద’ అని అర్థం. సాధారణంగా తిట్టుగా వాడే ఈ పదం.. ఏకంగా ఓ ఊరికి ఉండటం నిజంగా వింతే.

Also Read: వర్షాకాలంలో డేట్ వెళ్లడానికి ఇబ్బందిగా ఉందా? ఇంట్లోనే రొమాంటిక్ డేటింగ్ ఇలా ప్లాన్ చేయండి

దారూ (జార్ఖండ్)

జార్ఖండ్‌లోని ఒక చిన్న ప్రాంతానికి ‘దారూ’ అని పేరు ఉంది. హిందీలో దారూ అంటే ‘మద్యం’ అని అర్థం. ఊరి పేరు వినగానే చాలా మంది తాగుబోతుల ఊరు ఏమో అని భ్రమపడతారు. కానీ ఈ ఊరి వాళ్లంతా చాలా మంచి వారని చెబుతుంటారు.

Also Read: కారు డిక్కీలో మహిళ మృతదేహం.. షాకైన స్థానికులు, రంగంలోకి పోలీసులు, హనుమకొండ జిల్లాలో ఘటన

Tags

Related News

ఇండియన్ బుల్లెట్ రైలుపై పట్టాలెక్కేది ఎప్పుడంటే.. జపాన్ అధికారి షాకింగ్ కామెంట్స్!

హైదరాబాద్‌లోనే జపాన్ ఫీలింగ్, మచ్చా తాగుతూ.. అనిమే చూస్తూ.. ఎంజాయ్ చేసేయండి!

స్వర్ణగిరి ఆలయ నిర్వాహకులకు యాదగిరిగుట్ట దేవస్థానం లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే?

అమరావతి ORR డిజైన్‌లో కీలక మార్పులు.. కొత్త రూట్ మ్యాప్ ఇదే!

చంకలో వెంట్రుకలకు రంగులు.. ఆ దేశంలో ఇదే ట్రెండ్!

మధుర మీనాక్షి ఆలయాన్ని కట్టించింది తెలుగు రాజులేనా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 మలుపులు.. ఈ రోడ్డు మీద డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదు!

అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ మనసు దోచే 5 ప్రదేశాలు ఇవే

Big Stories

Advertisement
×