E-Paper
Advertisement

ఆవులదే రాజ్యం.. మనుషులు సైలెంట్.. ఈ వింత దేశం గురించి తెలుసా?

ఆవులదే రాజ్యం.. మనుషులు సైలెంట్.. ఈ వింత దేశం గురించి తెలుసా?
Advertisement

Uruguay Cows: ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేశాలు సాంకేతికతకు పేరుగాంచితే, మరికొన్ని ఆచార సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందాయి. అయితే దక్షిణ అమెరికాలోని ఉరుగ్వే అనే చిన్న దేశం మాత్రం ఆవులతో ప్రాముఖ్యం సంపాదించింది. అక్కడ మనుషుల జనాభా కంటే ఆవుల జనాభాయే చాలా ఎక్కువ. కేవలం 34 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో ఏకంగా 1.2 కోట్లకు పైగా ఆవులు పచ్చని గడ్డిభూముల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. అంటే సగటున ఒక్కో మనిషికి 4 ఆవులు ఉన్నాయన్నమాట.

ఆవుల సంఖ్యకు కారణమేంటి?

ఉరుగ్వేలోని విశాలమైన గడ్డిభూములు, అహ్లాదకరమైన వాతావరణం పశువుల పెంపకానికి ఎంతో అనుకూలంగా ఉంది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కొన్ని వందల ఏళ్లుగా పశుపోషణపైనే ఆధారపడింది. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన గొడ్డు మాంసాన్ని ఎగుమతి దేశంగా గుర్తింపు సంపాదించింది. ఈ దేశం నుంచి దాదాపు 100 కంటే ఎక్కువ దేశాలకు బీఫ్ ఎగుమతి అవుతోంది.

ప్రతి ఆవుకూ ఎలక్ట్రానిక్ ట్యాగ్

Advertisement

ఉరుగ్వేలో ఉన్న మరో అద్భుతమైన విషయం ఏంటంటే.. అక్కడి ప్రతి ఆవుకూ ఎలక్ట్రానిక్ ట్యాగ్ ఉంటుంది. ప్రపంచంలోనే మెుదటిసారి ప్రతి పశువును డిజిటల్ పద్ధతిలో ట్రాక్ చేసే వ్యవస్థను ఉరుగ్వేనే ప్రవేశపెట్టింది. పశువు పుట్టినప్పటి నుంచి అది ఎలాంటి ఆహారం తింటోంది, దాని ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలన్నీ ట్యాగ్ ద్వారా నమోదవుతాయి. దీనివల్ల వినియోగదారులకు అందించే మాంసం నాణ్యతను ఈజీగా గుర్తించేందుకు వీలు కలుగుతుంది.

Also Read: స్మార్ట్ గా రేషన్ కార్డులు పంచి… ఘాటు విమర్శలతో దంచి! ఇండిపెండెంట్ నాడూ వ‌ద‌ల్లేదుగా!

మరికొన్ని ఆసక్తికర విషయాలు

Advertisement

ఉరుగ్వే దేశంలో మరికొన్ని ప్రత్యేకతలు సైతం ఉన్నాయి. ఈ దేశం తనకు కావలసిన విద్యుత్తులో దాదాపు 95 శాతాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల (సౌర, పవన శక్తి) ద్వారానే ఉత్పత్తి చేస్తుంది. ఉరుగ్వే రాజధాని మోంటెవీడియో.. లాటిన్ అమెరికాలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 2013లో గంజాయిని చట్టబద్ధం చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఉరుగ్వే నిలిచింది. మరోవైపు దక్షిణ అమెరికా ఖండంలోనే అత్యధిక అక్షరాస్యత (98% కంటే ఎక్కువ) ఉన్న దేశాల్లో ఉరుగ్వే ఒకటి కావడం విశేషం.

Also Read: ఆగస్టు 15న కాదు.. ఆ రెండు ఆలయాల్లో 4 రోజుల ముందే స్వాతంత్ర వేడుకలు.. కారణం తెలిస్తే షాకే?

Tags

Related News

సూర్యాపేటకు రైలు కూత.. దశాబ్దాల కలకు కీలక అడుగులు!

పండుగ సీజన్‌లో ప్రయాణికులకు గుడ్ న్యూస్, హైటెక్ సిటీలో రైలు ఎక్కొచ్చు!

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జర్నీలో ఈ తప్పులు చేస్తే.. జరిమానాతో పాటు డైరెక్ట్ జైలే!

కొండవాలుపై ‘కృష్ణుడి వెన్నముద్ద’ రాయి.. 1200 ఏళ్లుగా దొర్లని వైనం.. సైన్స్‌కే అంతుపట్టని రహస్యం!

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రోడ్డుపై బైక్ రైడ్.. గిన్నీస్ రికార్డుల్లోకి తుని యువకుడు!

మహిళలకు అలర్ట్.. రైల్వే స్టేషన్‌లోని ఈ అద్భుతమైన సౌకర్యాలు మీకు తెలుసా?

రైలు ఫుడ్‌పై రైల్వే కీలక నిర్ణయం.. వంట నుంచి ప్యాకింగ్ వరకు AI నిఘా!

పండుగ వేళ రైలు టికెట్లకు భారీ డిమాండ్.. బుకింగ్ మొదలైన వెంటనే సీట్లు మాయం!

Big Stories

Advertisement
×