E-Paper
Advertisement

డైరెక్షన్.. ప్రొడక్షన్ కాదు ఫైనాన్స్ కూడా.. టైమ్-డేట్-లోకేషన్ ఎప్పుడైనా నేను సిద్ధమే, జగన్‌కు లోకేష్ ఛాలెంజ్

డైరెక్షన్.. ప్రొడక్షన్ కాదు ఫైనాన్స్ కూడా.. టైమ్-డేట్-లోకేషన్ ఎప్పుడైనా నేను సిద్ధమే, జగన్‌కు లోకేష్ ఛాలెంజ్
Advertisement

Rayadurgam: గొడ్డలి పార్టీకి ఒక అలవాటు ఉందని, వాళ్ల మనుషులను వాళ్లే చంపుకుంటారని ఆరోపించారు మంత్రి లోకేష్. ఆ నింద మనపై వేశారని అన్నారు. తండ్రి హత్య కేసులో  ఆనాడు సునీత సహా అందరూ నమ్మారని, ఇవాళ అసలు వాస్తవాలు బయటపడ్డాయన్నారు. గొడ్డలి, కోడికత్తి, గులకరాయి వంటి ఘటనలను గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఇంకెన్ని డ్రామాలు వస్తాయోనని, ఈ విషయంలో అందరం జాగ్రత్తగా ఉండాలన్నారు.

 

రాయదుర్గం పార్టీ సమావేశానికి మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

Advertisement

ఒకరోజు ఒక కన్ను, రెండో రోజు మరో కన్నుకు కట్టుకట్టారని ఎద్దేశా చేశారు మంత్రి. 2019 ఎన్నికల్లో సొంత బాబాయ్‌ని లేపేశారని, బాబాయ్ హత్యకు డైరెక్షన్, ప్రొడక్షన్, చివరకు ఫైనాన్స్ కూడా వాళ్లేనన్నారు. ఫైనాన్స్ అని ఎందుకు అంటున్నానంటే.. నిన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటిపై ఈడీ సోదాలు చేయడంతో ఆధారాలు దొరికాయన్నారు. మొన్నటి వరకు ప్రొడక్షన్, డైరెక్షన్ అనుకున్నాం.. ఇప్పుడు ఫైనాన్స్ కూడా బయట పడింది. జగన్ మీడియా సమావేశం పెడితే అందరికీ పండగేనన్నారు.

 

జగన్‌కు మంత్రి లోకేష్ ఓపెన్ ఛాలెంట్

Advertisement

అదే సీఎం చంద్రబాబు మీడియా సమావేశమంటే చాలామందిలో అంచనాలు ఉంటాయన్నారు. మాజీ సీఎం జగన్‌కు.. డీఎస్సీ-ఏపీపీఎస్సీ ఒక్కటేనని అంటున్నారని తనదైన శైలిలో ఎద్దేశా చేశారు. ఆయన మీడియా సమవేశం పెట్టి డీఎస్సీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేశా చేశారు. డీఎస్సీ విషయంలో టైమ, డేట్, లోకేషన్ ఎప్పుడు, ఎక్కడ ఫిక్స్ చేసినా చర్చను తాను సిద్దమేనని కుండబద్దలు కొట్టేశారు మంత్రి లోకేష్.

రానున్న రోజుల్లో మరిన్ని కుట్రలు, కేడర్‌ని అలర్ట్ చేసిన లోకేష్

ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు, నేతల సమావేశానికి పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కూటమి అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు సంతకం పెట్టిన తొలి ఫైల్ డీఎస్సీ అని వివరించారు. కేవలం 150 రోజుల్లో 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. గొడ్డలి పార్టీ అనేక కేసులు వేసిందని, అన్నింటినీ తట్టుకుని ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. 6 వేల కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చామన్నారు.

ALSO READ: చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకేసిన మాజీ సీఎం, మూడు అంశాలను టార్గెట్ చేసిన జగన్

ఇప్పుడు 10 వేల పోస్టులకు మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు. దేశంలో రూ. 100 పెట్టుబడులు వస్తే.. అందులో 25 రూపాయలు పెట్టుబడులు ఏపీకి వచ్చాయన్నారు. ఓ వైపు అభివృద్ది, మరోవైపు సంక్షేమం జరుగుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పరిశ్రమలు తీసుకొచ్చామని, దాని కారణం సీబీఎస్ అని గుర్తు చేశారు. గొడ్డలి పార్టీ చుట్టూ ఎవరున్నారు? గొడ్డలి వాడే వాళ్లు ఉంటారని, .. ఫ్యాక్షన్ నేతల చుట్టూ వారిని ప్రోత్సహించే వాళ్లు ఉంటారన్నారు. కానీ చంద్రబాబు అనేవారు నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తున్నారని వివరించారు. అందులో ఇవాళ ఏపీకి పెట్టుబడులు తరలి వస్తున్నాయని గుర్తు చేశారు.

Related News

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

వివేకానంద కేసు.. ఈడీ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి, విచారణ మరో అడుగు ముందుకెళ్లేనా?

‘మాపై కోపంతో ఆ పనులన్నీ ఆపేశారు’.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ!

ఏపీలో మేయర్ సీట్లపై పీఠముడి.. టీడీపీ-జనసేన మధ్య ఈ ఉదయం చర్చలు, ఫెయిలైతే ఎవరిదారి వారిదే!

ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్.. 2,721 ఉపాధ్యాయ పోస్టులు, వచ్చే నెల నుంచి

ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్లకు రిజర్వేషన్లు.. కీలక నేతలు జిల్లాలైతే..

జెడ్పీ పీఠం రేసులో బొత్స అనూష.. ప్రత్యర్థులకు గట్టి పోటీనా?

Big Stories

Advertisement
×