Nepal Disaster: నేపాల్‌లో వచ్చిన వరదలు, రాబోయే ముప్పు నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. బలగాలను నదీ తీరాల ప్రాంతాలకు తరలిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ-ఖాఠ్మండు మైత్రి బస్సు సర్వీసును తాత్కాలికంగా నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. ఆ తర్వాత పరిస్థితులను చూసిన తర్వాత పునరుద్దరణ చేయనుంది.
రెండు రోజుల కిందట వచ్చిన వరదలు నేపాల్‌ను అతులాకుతలం చేసింది. ఇళ్లకు ఇళ్లు కొట్టుకుపోయాయి. చాలామంది ఉండటానికి నీడ లేకుండా పోయింది. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడడంతో రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితి అంచనా వేసింది ఢిల్లీ ప్రభుత్వం. వరదల కారణంగా భారత్-నేపాల్ అంతర్జాతీయ బస్సు సర్వీసు నిలిచివేసింది.
భద్రతా కారణాల దృష్ట్యా ఆగస్టు 28, 29 తేదీలలో ఢిల్లీ-ఖాఠ్మండ్ మధ్య స్నేహ బస్సు సర్వీసును తాత్కాలికంగా నిలిపి వేసింది. ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి ఈ చర్య తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. నేపాల్‌లోని జాతీయ రహదారి ముఖ్యంగా ఢిల్లీ-ఖాఠ్మండు మార్గంలో ట్రాఫిక్‌కు పూర్తిగా అంతరాయం ఏర్పడిందని ఢిల్లీ రవాణా సంస్థ ప్రకటించింది.
ఆగస్టు 28న అంటే శుక్రవారం ఢిల్లీ నుండి ఖాఠ్మండు బస్సు సర్వీసును నిలిపి వేసింది. ఆగస్టు 28న ఖాఠ్మండు నుండి ఢిల్లీకి తిరుగు ప్రయాణాన్ని రద్దు చేసింది. అలాగే ఆగస్టు 29న ఢిల్లీ నుండి ఖాఠ్మండుకు నడిచే మైత్రి బస్సు సర్వీసును నిలిపి వేసింది. వరదల వల్ల అక్కడి రహదారులు ప్రమాదకరంగా మారిందని డీటీసీ సీనియర్ అధికారి తెలిపారు.
పరిస్థితి సాధారణ స్థితికి వచ్చి రోడ్డు క్లియర్ అయిన తర్వాత సర్వీసులను పునఃప్రారంభిస్తామని వెల్లడించింది ఢిల్లీ ఆర్టీసీ సంస్థ. నేపాల్ వ్యాప్తంగా జాతీయ రహదారులకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రస్తుతం అక్కడ సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్న తరుణంలో తాత్కాలికంగా బస్సు ప్రయాణాన్ని నిలిపివేసింది.
భారత్- నేపాల్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం 2014లో ఢిల్లీ-ఖాఠ్మండు మధ్య అంతర్జాతీయ బస్సు సర్వీసును ప్రారంభించింది. ఢిల్లీలో ఈ బస్సు ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు బయలు దేరుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల మీదుగా ప్రయాణించిన తర్వాత గోరఖ్‌పూర్ సమీపంలోని సోనాలి చెక్‌పోస్ట్ వద్ద నేపాల్‌లోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం వరదల కారణంగా ఈ మార్గాన్ని నిలిపివేశారు అక్కడి అధికారులు.
నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు- నిర్వహణ అథారిటీ నుండి అందిన తాజా సమాచారం ప్రకారం.. ,ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 359కి పెరిగిందని తెలిపింది. అలాగే 910 మంది గల్లంతయ్యారని పేర్కొంది. అత్యధికంగా చిత్వాన్-132 మరణాలు నమోదు కాగా, నవల్పరాసి తూర్పు-82, ధాడింగ్-33, గోర్ఖా-30, నువాకోట్-28, తనాహున్-22, రసువా- 17, నవల్పరాసి పశ్చిమంలో 15 మరణాలు నమోదయ్యాయి.
ALSO READ: పోస్టల్ శాఖలో జాబ్స్.. జిడిఎస్ ఉద్యోగ ఖాళీలు, సాలరీ వివరాలివిగో