E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: మళ్లీ పుల్ల పెట్టిన వల్లి.. తిరుపతి ఎమోషనల్.. అయ్యో చందు పాపం..

Illu Illalu Pillalu Today Episodes: మళ్లీ పుల్ల పెట్టిన వల్లి.. తిరుపతి ఎమోషనల్.. అయ్యో చందు పాపం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 28th : ధీరజ్ ప్రేమ ఇద్దరూ గొడవ పడుతుంటే ఏంటి వీళ్లిద్దరు గొడవ పడుతున్నారని మధ్యలో వచ్చిన తిరుపతి ఎందుకు మీరిద్దరు గొడవ పడుతున్నారని అడుగుతాడు.. మేమిద్దరం గొడవ పడట్లేదు ఇది అది అంటూ ఇద్దరూ తిరుపతిని ఒక ఆట ఆడుకుంటారు.. ఇక తిరుపతి ఎంతగా సర్ది చెప్పాలని చూసినా సరే ధీరజ్ ప్రేమని ఇద్దరు గొడవపడడంతో పాటుగా తిరుపతిని కూడా నెట్టి వేస్తారు. వీరిద్దరి గొడవ ఇప్పట్లో ఆగేలా లేదు అని తిరుపతి ఆలోచిస్తూ ఉంటాడు. మొత్తానికి వీళ్లిద్దరికి గొడవ మాత్రం ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.

చందు మనసులో చిచ్చుపెట్టిన వల్లి..

చందు ఆ డబ్బులు ఎలా కట్టాలి అని అనుమానంగా ఉంటారు. డబ్బులు పోయాయని తెలిస్తే.. మా నాన్న బాధపడడంతో పాటుగా.. నామీద ఆయన తప్పుడు ఉద్దేశంతో ఉంటాడు అని చందు భయపడిపోతూ ఉంటాడు.. అయితే చందు డబ్బులు ఎలా కట్టాలని ఆలోచిస్తూ ఉండగా శ్రీవల్లి ఎలాగైనా సరే మా బావమనసులో చిచ్చు పెట్టాలి అని అనుకుంటుంది.. బావ 6 లక్షలు పోయిందని బాధపడుతున్నావా? ఖచ్చితంగా తిరుపతి బాబాయి దగ్గరే ఉంటాయి ఒకసారి అడగొచ్చు కదా అని శ్రీవల్లి మరోసారి ఇంట్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్లి పడుకో అని చెప్పేసి చందు కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు. అలాగే శ్రీవల్లి నేను పుల్ల పెట్టేసాను కదా ఇంకా అది రాసుకుంటుంది ఇది ఎక్కడ వరకు వెళ్తుందో నాకే తెలీదు అంటూ తనలో తానే సంతోష పడిపోతూ ఉంటుంది.

తిరుపతికి బిగ్ షాక్..

Advertisement

తిరుపతి బర్త్డే సందర్భంగా తన మేనల్లుళ్లు ఎలాగైనా సరే తనకి సర్ప్రైజ్ఇవ్వాలని అనుకుంటారు.. ముగ్గురు కలిసి తిరుపతిని చాపలో చుట్టుకుని వెళ్లి, ఒకచోట పడుకోబెట్టి అక్కడ ముగ్గురు కలిసి బకెట్లతో నీళ్లు పోస్తారు అది చూసిన తిరుపతి వెంటనే లేచిన తిరుపతి ఏంట్రా మీరు నా మీద ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు.. కాసేపు అయి ఉంటే ఈ భయంతో నా గుండె కడుపులోకి వెళ్లిపోయేదేమో అంటూ తిరుపతి కంగారు పడిపోతూ అందరిపై అరుస్తాడు. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదామని మామ ఇలా చేసాము అని అందరు అంటారు. నువ్వు మా అందరికీ ఇష్టమైన మామవు కాబట్టి నీ బర్త్ డే ని ఎప్పటికీ గుర్తుండిపోయిన ఇలా చేయాలని అనుకున్నాము అనగానే మీరు చేసిన బాగానే ఉంది అంటూ తిరుపతి అంటాడు. తిరుపతిని ముగ్గురు అల్లుళ్ళు కలిసి దగ్గర ఉండి రెడీ చేస్తారు.

వేదవతి మాటకు ఎమోషనల్..

ఇక వేదవతి తన తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా పూజ చేసి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తుంది.. నువ్వు నా తమ్ముడు కన్నా నా కొడుకు అంటేనే నేను చాలా సంతోషంగా ఉంటాను రాని వేదవతి అనగానే తిరుపతి కూడా ఎమోషనల్ అయిపోతాడు. నేను నీకు తమ్ముడు అన్న సంగతి కూడా నాకు గుర్తుకు లేదు అక్క చిన్నప్పుడు నుంచి నువ్వు నాకు అమ్మ లాగా చూసుకున్నావు. వీళ్లు అల్లుళ్లు కాదు నా తమ్ముళ్లు లాగా చూసుకున్నాను. వాళ్లు నన్నే అంతకు బాగా చూసుకున్నారు అని అంటారు. ఇక తిరుపతి తన ఎమోషనల్ డైలాగులతో అందరినీ ఏడిపించేస్తాడు. సుకన్య విషయం చెప్పబోతూ ఉంటే అందరూ ఏమనుకుంటారో అని మళ్ళీ దాచేస్తాడు ఇక.. పాయసం తిన్న తర్వాత చందు ఫోన్ రావడంతో కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన వల్లి కాసేపట్లో మొత్తం రివిల్ అవుతుంది అంటూ నవ్వుకుంటుంది.

భద్ర ప్లాన్ వర్కౌట్..

Advertisement

భద్ర తన తమ్ముడు పుట్టినరోజు కాబట్టి వల్లి చెప్పినట్లుగా 6 లక్షల విలువ చేసే ఒక చైన్ ని రెడీ చేసి పెట్టుకుంటుంది. తిరుపతికి అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో ఏమైందక్క అంత అర్జెంటుగా రమ్మన్నావు అమ్మకేమైనా అయిందా.? ఎందుకు ఇంత అర్జెంటుగా నన్ను రమ్మన్నావో చెప్పు అక్క అని అనగానే పుట్టినరోజు శుభాకాంక్షలు రా తిరుపతి అని భద్ర అంటుంది. నాకోసం నువ్వు ఇదంతా చేస్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను అక్క అని తిరుపతి కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానీ భద్ర మాత్రం మనది రక్తసంబంధం అని అంటుంది. ఇక మీదట నుంచి నువ్వు మా తమ్ముడిగానే మా ఇంట్లోనే ఉండబోతున్నారా అని భద్ర లోలో లోపల మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటుంది.

మళ్లీ కొట్టుకున్న ప్రేమ, ధీరజ్..

ప్రేమ ధీరజ్ లను ఎలాగైనా కలపాలని నర్మదా అనుకుంటుంది.. అది ధీరజ్ బయట కారు కడుక్కుంటూ కనిపించగా ప్రేమను కూడా బయటికి రప్పించాలని రాయితో ప్రేమ గది మీద విసురుతుంది. కానీ నర్మదా ప్రేమ బయటకు రాగానే ధీరజ్ వేసాడు అని అబద్ధం చెప్తుంది. అయితే ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు అని నర్మద చేసిన ప్రయత్నం వృధా అయిపోతుంది. వాళ్ళిద్దరూ అలా కొట్టుకోవడం చూసి నేను వాళ్ళిద్దరు కలిసిపోతారు అనుకుంటే ఇలా కొట్టుకుంటున్నారు ఏంటి? రక్తాలు కారేలా ఉన్నాయి నేను వెంటనే వెళ్లి ఆపాలి అని వాళ్ళిద్దరు మధ్యలోకి వచ్చి ఆపే ప్రయత్నం చేస్తుంది. నర్మదా అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు అవనిపై అనుమానం.. పల్లవి ప్లాన్ సక్సెస్.. మహంకాళిగా అవని..

Related News

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి స్ట్రాంగ్ వార్నింగ్..ఇంట్లో రచ్చచేసిన ప్రభావతి.. మీనాకు ఘోర అవమానం..

Karthika Deepam 2 Serial Today Episode August 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తన కొడుకన్న నిజం చెప్పిన మాలిని

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు అవనిపై అనుమానం.. పల్లవి ప్లాన్ సక్సెస్.. మహంకాళిగా అవని..

Brahmamudi Serial Today Episode August 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: వ్రతానికి రాజును ఒప్పించిన ఇందు       

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..!

Friday Movies in Tv : శుక్రవారం సినీ ప్రియులకు పండగే.. టీవీల్లోకి హిట్ చిత్రాలు..

నా బాడీ గురించి మీకెందుకు? సోనియా ఫైర్

Big Stories

Advertisement
×