E-Paper
Advertisement

స్పేస్‌లోకి 3,301 తేనెటీగలు.. 1984లో నాసా చేసిన ఈ ప్రయోగం చూస్తే.. ఇప్పటికీ గూస్‌బంప్స్ పక్కా!

స్పేస్‌లోకి 3,301 తేనెటీగలు.. 1984లో నాసా చేసిన ఈ ప్రయోగం చూస్తే.. ఇప్పటికీ గూస్‌బంప్స్ పక్కా!
Advertisement

Space Bees: అంతరిక్షంలోకి వెళ్లడమంటే ఆషామాషీ కాదు. ఇందుకోసం వ్యోమగాములు కఠోర ట్రైనింగ్ తీసుకుంటారు. ఎన్నో పరీక్షలను తట్టుకొని.. జీరో గ్రావిటీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధం అవుతుంటారు. అలాంటిది భూమి మీద నుంచి సాధారణ తేనెటీగలు అంతరిక్షంలోకి అడుగుపెట్టాయని మీకు తెలుసా? ఏకంగా 3,301 తేనెటీగలతో నాసా ఓ స్పెషల్ మిషన్ చేపట్టిన సంగతి ఎంత మందికి తెలుసు? 1984లో జరిగిన ఈ విచిత్రమైన ప్రయోగానికి సంబంధించిన విశేషాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అంతరిక్షంలోకి తేనెటీగలు ఎందుకంటే?

1984లో నాసా (NASA) స్పేస్ షటిల్ డిస్కవరీ ప్రయోగంలో భాగంగా వేలాది తేనెటీగలు అంతరిక్షంలోకి పంపింది. గురుత్వాకర్షణ శక్తి లేని శూన్య వాతావరణం (మైక్రోగ్రావిటీ)లో తేనెటీగలు జీవించగలవా? అక్కడ కూడా భూమిపై కట్టినట్లే తేనెపట్టును నిర్మించగలవా? అని తెలుసుకోవడానికి ఈ వినూత్న ప్రయోగాన్ని నిర్వహించారు. మొత్తం 7 రోజుల పాటు సాగిన ఈ మిషన్‌లో 3,301 తేనెటీగలు పాల్గొన్నాయి. ఈ ప్రయోగం కోసం ఒక రాణి ఈగతో పాటు ఆహారం, చెక్క ఫ్రేమ్‌లను ప్రత్యేకంగా రూపొందించిన పెట్టెల్లో ఉంచారు. శూన్యంలో సాధారణ ద్రవాలు నీటి బిందువులుగా తేలియాడే ప్రమాదం ఉన్నందున ఆహారంగా చక్కెర, నీరు, ‘అగర్’ మిశ్రమాన్ని నాసా శాస్త్రవేత్తలు ఉపయోగించారు.

ప్రారంభంలో తడబాటు.. ఆపై అలవాటు!

Advertisement

అంతరిక్షంలోకి వెళ్లిన కొత్తలో తేనెటీగలు ఎగరడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. తొలి రోజుల్లో గాలిలో నియంత్రణ కోల్పోయి, తమ పెట్టె గోడలకు వేగంగా ఢీకొట్టాయి. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. శూన్య గురుత్వాకర్షణ వాతావరణానికి అవి త్వరగానే అలవాటు పడ్డాయి. ఏడో రోజు నాటికి తేనెటీగలు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఒక చోటు నుంచి మరో చోటుకు సునాయాసంగా ఎగరడం ప్రారంభించాయని వ్యోమగాములు తమ నివేదికలో పేర్కొన్నారు.

Also Read: సామాన్యుడికి షాకిస్తున్నగుడ్లు.. వాటి ధరల పెంపుకు-ఇథనాల్‌కు సంబంధం ఏంటి?

అంతరిక్షంలో 200సెం.మీ తేనెపట్టు

Advertisement

ఈ మిషన్‌లో తేనెటీగలు ప్రాణాలతో బయటపడడమే కాకుండా తమ నిర్మాణ పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేశాయి. ఏడు రోజులలో అవి దాదాపు 200 సెంటీ మీటర్ల మేర తేనెపట్టును నిర్మించాయి. భూమిపై కట్టే పట్టుతో పోలిస్తే అంతరిక్షంలో కట్టిన తేనెపట్టు గదుల వ్యాసం కాస్త చిన్నదిగాను, గోడలు కాస్త మందంగానూ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయినప్పటికీ గదుల లోతు సాధారణంగానే ఉండటంతో అందులో చక్కెర పాకాన్ని కూడా దాచుకోగలిగాయి. ఈ మిషన్‌లో మెజారిటీ తేనెటీగలు క్షేమంగా తిరిగిరాగా రాణి ఈగ దాదాపు 35 గుడ్లను అంతరిక్షంలో పెట్టింది. అయితే భూమిపైకి వచ్చాక ఆ గుడ్లు పొదగబడకపోవడానికి గల సరైన కారణం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.

Also Read: బిడ్డెను ఎగ‌దోసి.. ఆపై ఆమెపైనే నెట్టేసి…. బెదిరింపు రాజ‌కీయాల్లో బెడిసికొట్టిన ముర‌ళి వ్యూహం..

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×