E-Paper
Advertisement

ఆటోను ఢీ కొట్టి ట్రావెల్ బస్సు, ఏడుగురు మృతి, మరో 8 మంది పరిస్థితి విషమం, చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం

ఆటోను ఢీ కొట్టి ట్రావెల్ బస్సు, ఏడుగురు మృతి, మరో 8 మంది పరిస్థితి విషమం, చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం
Advertisement

Chilakaluripet: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అర్ధరాత్రి పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు స్పాట్ లో మృతి చెందారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటన విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటన ఎలా జరిగింది? మృతులు ఎక్కడివారు? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..

 

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

బుధవారం అర్ధరాత్రి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట అడ్డ రోడ్డు సెంటర్ వద్ద ఆటోను ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటన సమయంలో ఆటోలో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

 

ఆటోని ఢీ కొట్టి ట్రావెల్ బస్సుల, స్పాట్లో 16 మంది

Advertisement

గాయపడినవారిని స్థానికులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రావెల్ బస్సు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తోంది. మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారు.

వారిలో బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ, గంగమ్మ, మరియమ్మగా గుర్తించారు. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి వచ్చారు. అంబులెన్స్ ద్వారా బాధితులను ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా కొండమంజులూరు నుంచి వేలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఓ పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి వేలూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్పాట్‌లో నలుగురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరో ముగ్గురు మృతి చెందారు. గాయపడినవారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ట్రావెల్ బస్సు అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనలో ఆటోడ్రైవర్‌ది తప్పా? ట్రావెల్ బస్సు తప్పా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చిన్న ఆటో 15 మంది ఉండడం ఘటన తీవ్రతకు కారణంగా చెబుతున్నారు.

ALSO READ: పవన్ vs జగన్.. పులివెందుల దాహార్తి తీర్చిందెవరు? ఎవరి పాత్ర ఎంత?

 

Related News

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

వివేకానంద కేసు.. ఈడీ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి, విచారణ మరో అడుగు ముందుకెళ్లేనా?

‘మాపై కోపంతో ఆ పనులన్నీ ఆపేశారు’.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ!

ఏపీలో మేయర్ సీట్లపై పీఠముడి.. టీడీపీ-జనసేన మధ్య ఈ ఉదయం చర్చలు, ఫెయిలైతే ఎవరిదారి వారిదే!

ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్.. 2,721 ఉపాధ్యాయ పోస్టులు, వచ్చే నెల నుంచి

ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్లకు రిజర్వేషన్లు.. కీలక నేతలు జిల్లాలైతే..

జెడ్పీ పీఠం రేసులో బొత్స అనూష.. ప్రత్యర్థులకు గట్టి పోటీనా?

Big Stories

Advertisement
×