E-Paper
Advertisement

పాకిస్తాన్ ప్లేయర్లు తాగిన డ్రింక్స్ లో మత్తు పదార్థాలు ?

పాకిస్తాన్ ప్లేయర్లు తాగిన డ్రింక్స్ లో మత్తు పదార్థాలు ?
Advertisement

WI VS PAK: పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (West Indies vs Pakistan) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ (Pakistan tour of West Indies, 2026) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. జూలై 25వ తేదీన ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ లో 90 పరుగుల తేడాతో వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ అత్యంత దారుణంగా ఓడిపోయింది. ప్రస్తుతం రెండవ టెస్టు కొనసాగుతోంది. ఇందులో కూడా పాకిస్తాన్ ఓడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.

పాకిస్తాన్ క్రికెటర్లకు మత్తు కలిపిన డ్రింక్స్?

పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (West Indies vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో షాకింగ్ పోస్ట్ వైరల్ గా మారింది. మొదటి టెస్ట్ సందర్భంగా తమ క్రికెటర్లకు మత్తు మందు కలిపిన డ్రింక్స్ ఇచ్చారని పాకిస్తాన్ దేశానికి సంబంధించిన నెటిజెన్స్, క్రికెట్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మొదటి టెస్ట్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవడానికి ఇదే కారణం అని అంటున్నారు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా డ్రింక్స్ బ్రేక్ కంటే ముందు 13 ఓవర్లు ఆడిన పాకిస్తాన్, ఒక్క వికెట్ కోల్పోలేదని… అదే డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఐదు వికెట్లు కోల్పోయినట్లు ఆరోపణలు చేస్తున్నారు.

Advertisement

Asia Cup 2025 trophy – Mohsin Naqvi: ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

డ్రింక్స్ లోనే ఏదో మత్తు మందు కలిపారని.. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్లేయర్లు ఏకాగ్రత కోల్పోయి, వికెట్లు సమర్పించుకున్నట్లు చెబుతున్నారు. అందుకే మొదటి టెస్ట్ లో వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిందని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విచారణ చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. తమ జట్టుపై టెస్ట్ సిరీస్ గెలవాలన్న కుట్రతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఈ చర్యలకు పాల్పడిందని అంటున్నారు. అయితే దీనికి ఇండియన్ క్రికెట్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఓడిపోతే ఒకలాగా… గెలిస్తే మరోలాగా పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు వ్యవహరిస్తారని.. ఇప్పుడు డ్రింక్స్ లో మత్తుమందు కలిపారని కొత్త డ్రామాలు ఆడుతున్నట్లు ఫైర్ అయ్యారు.

రసవత్తరంగా కొనసాగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్, 344 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ప్రస్తుతం పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ ఆడుతోంది. ఇప్పటి వరకు ఆరు వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్ 370 పరుగులు సాధించింది. బాబర్ 88 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకోగా అబ్దుల్లా షఫీక్ 150 ప‌రుగులు దాటేశాడు. 500 ప‌రుగులు పూర్త‌యిన త‌ర్వాత డిక్లేర్ చేసే ఛాన్స్ ఉంది.

Tamim Iqbal Urged Bangladesh Government: టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

Related News

టీమిండియా క్రికెటర్ల మెడ‌పై మోడీ స‌ర్కార్‌ క‌త్తి పెడుతోంది !

టీమిండియాలో సౌర‌వ్ గంగూలీని తిట్ట‌ని వాడు లేడు…సెహ్వాగ్ సంచ‌ల‌నం !

పాకిస్తాన్‌ జట్టులోనూ అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర బ్యాటర్ ఉంటే బాగుండు

టీమిండియా ప్లేయర్లకు అవమానం…ఓయో రూముల్లోనే బస?

బీసీసీఐకి డ‌బ్బుల పొగ‌రెక్కువ‌…ఎవ‌రినైనా కొనేసి, టీమిండియా గెలిచేలా చేస్తుంది!

గౌతమ్ గంభీర్ దుర్మార్గుడు, వీధి రౌడీలా బిహేవ్ చేస్తాడు

ఇండియాలో హిందూ రాజ్యం న‌డుస్తోంది…షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !

విడాకులు ఇవ్వ‌డం, కొత్త అమ్మాయిల‌తో తిర‌గ‌డం త‌ప్ప పాండ్యాకు ఏదీ చేత‌కాదు

Big Stories

Advertisement
×