E-Paper
Advertisement

మెగా డీఎస్సీ వ్యవహారం.. హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ, సీబీఐ విచారణకు నిరాకరణ

మెగా డీఎస్సీ వ్యవహారం.. హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ, సీబీఐ విచారణకు నిరాకరణ
Advertisement

Amaravati: మెగా డీఎస్సీ వ్యవహారంలో వైసీపీకి హైకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై సీబీఐ విచారణకు నిరాకరించింది. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం అనుమతిస్తే, దాని ఉద్దేశం దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది న్యాయస్థానం.

మెగా డీఎస్సీ వ్యవహారం

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2025పై సీబీఐ విచారణకు నిరాకరించింది హైకోర్టు. డీఎస్సీ నియామకాలపై సీబీఐతో విచారణకు ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం న్యాయస్థానం విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు.

హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ

Advertisement

నియామక ప్రక్రియపై సీబీఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టుకు వివరించారు. నియామక ప్రక్రియలో అవకతవకలు, నిష్పక్షపాతాన్ని, సమగ్రతను ప్రభావితం చేసే విధంగా ఉందని వాదించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు ప్రశ్నలు లేవనెత్తింది. స్పోర్ట్స్‌ కోటాతో నష్టపోయిన అభ్యర్థులు నేరుగా న్యాయస్థానానికి ఎందుకు రాలేదని ప్రశ్నించింది.

కోర్టును ఆశ్రయించేందుకు భయపడుతున్నారని పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదించారు. మీ వాదనలతో ఏకీభవించలేమని స్పష్టం చేసింది. మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్- నియామకాలను సవాల్ చేస్తూ 335 పిటిషన్లు దాఖలైనట్లు హైకోర్టు ప్రస్తావించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం చాలా విలువైనదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి అనుమతిస్తే దాని ఉద్దేశం దెబ్బతింటుందని తేల్చి చెప్పింది.

విచారణకు హైకోర్టు నిరాకరణ

Advertisement

దీనిపై వాదనలు కొనసాగిస్తారా? లేదా ఉపసంహరించుకుంటారా అని ప్రశ్నించింది. దీనిపై పిటిషనర్ నుంచి సూచనలు తీసుకుని రావాలని చంద్రశేఖర్ రెడ్డి తరుఫు న్యాయవాదికి సూచించింది హైకోర్టు. మరోవైపు డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐతో  విచారణ జరిపించాలని వైసీపీ ప్రధాన డిమాండ్. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేట్టింది. అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కోరిన విషయం తెల్సిందే.

ALSO READ: కోడిగుడ్డు‌పై ఈగలు పీకడం.. వైసీపీ విమర్శలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ 

 

Related News

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

Big Stories

Advertisement
×