Ambati Rambabu: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూతురు డాక్టర్ శ్రీజ వివాహం అమెరికాలో అంగరంగ వైభవంగా జరిగింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని మహాలక్ష్మీ దేవాలయం ఈ వివాహానికి వేదికైంది. తెలుగు సంప్రదాయం, ఆచారాల నడుమ పెళ్లి సాగింది.
అమెరికాలో అంబటి వారి పెళ్లి పిలుపు
ఈ కార్యక్రమానికి అంబటి కుటుంబసభ్యులు, సన్నిహితులు, బంధువులు ప్రత్యక్షంగా నూతన దంపతులను ఆశీర్వదించారు. ఏపీ నుంచి కొందరు వెళ్లినట్టు తెలుస్తోంది. మరికొందరు వర్చువల్‌గా హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
అంబటి రాంబాబు కూతురు డాక్టర్ శ్రీజ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో ఎండోక్రైనాలజీ విభాగంలో ఫెలోషిప్ చేస్తున్నారు. వరుడు, ఆమె భర్త హర్ష అమెరికాలోని డోయిచ్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. వీరి వివాహం కన్నులపండుగగా జరిగింది.
అంగరంగ వైభవంగా పెళ్లి
వివాహం తర్వాత, నూతన వధూవరులు అమెరికాలో తమ వృత్తి కొనసాగించాలని భావిస్తున్నారు. ఇదిలాఉండగా అంబటి బంధువులు, పార్టీ నాయకులు, సహచరులు కోసం ఏపీలో రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్లు కుటుంబ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్, ఏం జరిగింది?
అంబటి రాంబాబు గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. వైసీపీ కీలక నేతల్లో ఆయన కూడా ఒకరు. ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా చెబుతుంటారు. కాకపోతే బంధువులంతా ఏపీలో ఉండగా, అమెరికాలో కూతురి వివాహం చేయడాన్ని చాలామంది నేతలు, మద్దతుదారులు ఊహించుకోలేకపోతున్నారు.