Mirai On OTT: హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు మిరాయ్ (Mirai ) చిత్రంతో వచ్చారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. అతి తక్కువ సమయంలోనే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 చిత్రాలలో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 20 రోజుల్లోనే రూ.140.18 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇకపోతే అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది.
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్(Jio hotstar) ఈ సినిమా ఓటీటీ హక్కులను మొత్తం 40 కోట్లకు దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి వస్తోంది అని జియో హాట్ స్టార్ ఈ మేరకు ఒక పోస్ట్ కూడా పంచుకుంది. అక్టోబర్ 10 వ తేదీన బ్లాక్ బస్టర్ మిరాయ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది అని చెబుతూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఇది అందుబాటులోకి రాబోతున్నట్లు స్పష్టం చేసింది. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ సినిమాను ఓటీటీ లో చూడవచ్చు.
మిరాయ్ సినిమా స్టోరీ ఏంటంటే..
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సామ్రాట్ అశోక్ కళింగ యుద్ధం గెలిచిన తర్వాత జరిగిన విధ్వంసాన్ని తలుచుకొని పశ్చాత్తాప పడతాడు. ఈ వినాశనానికి తనలోని దైవ శక్తి ఒక కారణమని భావించి.. ఆ శక్తిని తొమ్మిది గ్రంథాలలో నిక్షిప్తం చేసి.. వాటి రక్షణ బాధ్యతను 9 మంది యోధుల చేతిలో పెడతాడు. అయితే కొన్ని శతాబ్దాల తర్వాత ఆ గ్రంథాలపై దుష్టశక్తి మహావీర్ లామా (మంచు మనోజ్) కన్ను పడుతుంది అతడు కోరుకున్నట్లుగా మృత్యుంజయుడుగా మారి.. ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలంటే 9వ గ్రంథం అవసరం. కానీ ఆ గ్రంధాన్ని సొంతం చేసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే దానికి రక్షణగా అంబికా (శ్రియ) ఉంటుంది. అతడిని ఎదుర్కొనేందుకు తనకు పుట్టిన బిడ్డ వేద (తేజ సజ్జా)ను పసికందుగా ఉన్నప్పుడే దూరం చేసుకుంటుంది అంబికా. ఇక అనాధగా బ్రతికిన వేద తన బాధ్యతను ఎవరి ద్వారా తెలుసుకుంటాడు? తన తల్లి ఆశయాన్ని నెరవేర్చాడా? మహావీర్ లామా ఆశయాన్ని విచ్ఛిన్నం చేశాడా? లాంటివి తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
also read:Little hearts: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా.. ఆ జాబితాలో చోటు!
మిరాయ్ సినిమా విశేషాలు..
తేజ సజ్జా హీరోగా.. రితికా నాయక్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రంలో జగపతి బాబు, శ్రియా శరన్ కీలక పాత్రలు పోషించారు. మంచు మనోజ్ విలన్ గా నటించారు. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి కూడా రాబోతోంది. ఇక్కడ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Nine scriptures. Infinite power. One Superyodha to protect the Brahmand. 🪐#Mirai , India’s own superhero, is coming to your home, Streaming from October 10.#MiraiOnJioHotstar@tejasajja123 @HeroManoj1 @Karthik_gatta @RitikaNayak_ @vishwaprasadtg #KrithiPrasad… pic.twitter.com/WIi5rq99m0
— JioHotstar Telugu (@JioHotstarTel_) October 4, 2025