Vijayawada News: దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు సీఎం చంద్రబాబు. ప్రజలకు చెప్పినట్టు చేసే ప్రభుత్వం ఎన్డీయేనని చెప్పారు. విజయవాడలో దసరా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయని, ప్రజలు ‘ఓజీ’ సినిమా చూసి దసరా పండుగ చేసుకున్నారని తెలిపారు.
ఏపీలో కొత్త పథకం ప్రారంభం
ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చిన మరో హామీ ఈ రోజు నుంచి ఏపీ వ్యాప్తంగా అమలవుతోంది. శనివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటోడ్రైవర్ సేవలో’ స్కీమ్‌ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఎవరూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు.
లబ్దిదారుల అకౌంట్లలో ఆన్ లైన్ ద్వారా డబ్బులు జమ అవుతాయన్నారు. 15 నెలల పాలనలో ఎన్నో పథకాలను తీసుకొచ్చామన్నారు. కేవలం 33 వేల కోట్ల రూపాయలను పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీయేనని గుర్తు చేశారు. ఈ పథకం కింద 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు లబ్ది చేకూరనుంది.
ఆటోడ్రైవర్లకు మరో శుభవార్త
వారి ఖాతాల్లోకి రూ.436 కోట్లను జమ చేసింది. ఒక్కో డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. అంతకుముందు ఉండవల్లి నుంచి సింగ్‌నగర్ వరకు ఆటోలో చేరుకున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రి లోకేష్.
సూపర్ సిక్స్ సూపర్ హిట్టయ్యిందన్నారు. గతంలో రోడ్లు అధ్వానంగా తయారైనా గత పాలకులు పట్టించుకోలేదన్నారు. దాంతో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ప్రయాణాలకు ఇప్పుడు ఇబ్బంది లేదన్నారు. ఉచిత ప్రయాణంతో మహిళలు సంతోషంగా ఉన్నారని, ఈ ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు.
ALSO READ: అమెరికాలో అంబటి రాంబాబు కూతురు పెళ్లి
ఆటోడ్రైవర్లలో చాలామంది పేదవాళ్లు ఉన్నారని, ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తే వారికి కొంత ఊరటగా ఉంటుందన్నారు. 2024 ఎన్నికలు నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదని, 94 శాతం స్ట్రైక్ రేటుతో గెలిపించారని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం మంచి పనులు చేస్తుందని, రాబోయే రోజుల్లో సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు వస్తాయన్నారు.
అందరి ఆరోగ్యం కోసం యూనివర్సల్ హెల్త్ ఇన్యూరెన్స్ పథకం వస్తుందని, రూ. 25 లక్షలతో చూపించుకోవచ్చన్నారు. ఎక్కడా మీకు వేధింపులు ఉండవన్నారు. గతంలో తీసుకొచ్చిన జరిమానాల జీవోను రద్దు చేస్తామని, మీరేం చేసినా సీసీకెమెరాల్లో తెలిసి పోతుందన్నారు. దానివల్ల మీకు నష్టం జరుగుతుందన్నారు.
మీకోసం సంక్షేమ బోర్డు పెడతామన్నారు. క్రమశిక్షణగా ఉంటే అన్నివిధాలుగా మంచి జరుగుతుందన్నారు. టూరిజం అభివృద్ధి చెందుతుందని, లా అండ్ ఆర్డర్ బాగుంటుందని తెలిపారు. ఆటో వాహనాలను ఈవీలుగా మార్చడానికి ముందుకు పోతున్నట్లు వివరించారు. ఈ పథకం ద్వారా దాదాపు 3 లక్షల మంది ఆటోడ్రైవర్లకు లబ్ది చేకూరనుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
దేశ చరిత్రలో ఎక్కడా జరగని సంక్షేమం ఏపీలో ఉంది: చంద్రబాబు
పెన్షన్ల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వమిది
ఇప్పుడు రోడ్లు బాగున్నాయి.. ప్రయాణాలకు ఇబ్బంది లేదు
– సీఎం చంద్రబాబు pic.twitter.com/ULNftk7zkw
— BIG TV Breaking News (@bigtvtelugu) October 4, 2025