BigTV English
Advertisement

CM Jagan Convoy Breach: జగన్ కాన్వాయ్‌లోకి ఆ యువకుడు.. భద్రతా వైఫల్యమా..? మరో కోడికత్తి డ్రామానా..?

CM Jagan Convoy Breach: జగన్ కాన్వాయ్‌లోకి ఆ యువకుడు..  భద్రతా వైఫల్యమా..? మరో కోడికత్తి డ్రామానా..?
Security Breach At CM Jagan Convoy at Prakasam Siddam Sabha
Security Breach At CM Jagan Convoy at Prakasam Siddam Sabha

Security Breach At CM Jagan Convoy at Prakasam Siddam Sabha: ఎన్నికల వేళ నేతల ఎత్తుగడలు వెరైటీగా ఉంటాయి. ప్రజల నుంచి సానుభూతి పొంది ఎన్నికల్లో గెలుపొందేందుకు రకరకాల వ్యూహాలను అవలంభిస్తారు. ఈ విద్యలో వైసీపీ అధినేత జగన్ ఆరితేరిన వారని నేతలే బహిరంగంగా చెబుతుంటారు. సీఎం జగన్ పర్యటనకు వెళ్తేచాలు.. రోడ్డుకు మధ్యలో అటు ఇటు చెట్లను సైతం తొలగిస్తారు. ఎక్కడ చూసినా చివరకు పరదాలే కనిపిస్తాయి.


తెలుగు రాష్ట్రాల హిస్టరీలో ఈ విధంగా వ్యవహరించే ముఖ్యమంత్రులను ఎప్పుడూ చూడలేదని కాకలు తీరిన రాజకీయ యోధులు తరచు చెబుతున్నమాట. ముఖ్యంగా సీఎం జగన్ దగ్గరకు వెళ్లాలంటే నాలుగంచెల భద్రత ఉంటుంది. అలాంటిది సీఎం జగన్ కాన్వాయ్ వద్దకు ఓ యువకుడు ప్రవేశించి ఓ వాహనం అద్దాలను తల, చేతులతో గట్టిగా మోది బద్దలు కొట్టడం కలకలం రేపుతోంది. ఇది భద్రతా వైఫల్యమా? లేక కావాలనే కోడి కత్తి మాదిరి ప్లాన్ చేశారా? ఇలా రకరకాల ప్రశ్నలు పార్టీ అభిమానులను వెంటాడు తున్నాయి.

అసలేం జరిగింది? ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పొదిలిలో ఆదివారం జగన్ సభ సందర్భంగా ఈ ఘటన జరిగింది. సీఎం జగన్ కాన్వాయ్‌ శ్రేణి వాహనంపైకి కంభాలపాడుకు చెందిన విష్ణు అనే యువకుడు దూసుకొచ్చాడు. తాను వైసీపీకి, సీఎం జగన్‌కు వీరాభిమానినని చెబుతున్నాడు. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాలనే ఉద్దేశంతోనే వచ్చానని అంటున్నాడు.


Also Read: Kutami sabha at Tanuku: రెండోసారి, వేదికపైకి ముగ్గురు నేతలు, ఆపై

పటిష్టమైన భద్రతను దాటుకుని ఆ యువకుడు ఎలా వచ్చాడన్నది అసలు ప్రశ్న. ఈ ఘటనను సీరియస్‌ గా తీసుకున్నారు ఉన్నతాధికారులు. జిల్లా అధికారుల నుంచి వివరణ తీసుకున్నట్లు సమాచారం. ఆ యువకుడికి మానసిక పరిస్థితి సరిగా లేదని, మద్యం మత్తులో ఉండడం వల్లే అలా చేసినట్టు తెలుస్తోంది. వెంటనే యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించి పరీక్షలు చేయించారు. అలాగే యువకుడి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హిస్టరీలోకి వెళ్తే.. ఐదేళ్ల కిందట విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై వైసీపీ అభిమాని కోడికత్తితో దాడి చేశాడు. అప్పట్లో అదొక సంచలనం. అప్పటి చంద్రబాబు సర్కార్‌పై నమ్మకం లేక ఏకంగా హైదరాబాద్ వచ్చి ట్రీట్‌మెంట్ చేయించుకున్నారు జగన్. ఆ తర్వాత కోడి కత్తి వ్యవహారం గురించి చెప్పనక్కర్లేదు. ఈ కేసు వ్యవహారం ఎలా సాగిందన్నది. సరిగ్గా 2021 ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది.

Also Read: క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, బ్రహ్మ సృష్టించిన..

నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో సీఎం మమతాబెనర్జీ గాయపడ్డారు.. వీల్ ఛైర్‌పై కూర్చొని నామినేషన్ దాఖలు చేశారు. గతేడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల సందర్భంగా మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఈ విధంగానే గాయపడ్డారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన గెలిచారు.. ఆ పార్టీ ఓడిపోయింది. అది తర్వాత విషయం. వరుస విషయాలను గమనించిన రాజకీయ నేతలు.. ఇవన్నీ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్‌కిషోర్ ఆలోచన లేనని చెబుతున్నారు. ఆ ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేయబోయి అడ్డంగా ఫెయిలయ్యారని అంటున్నవాళ్లూ లేకపోలేదు.

ఇక వర్తమానంలోకి వచ్చేద్దాం.. సీఎం జగన్ సిద్ధం పేరిట బస్సుయాత్ర చేపడుతున్నారు. ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు. కానీ సాయంత్రం ఏడు గంటలైతే సభలకు హాజరుకావడం లేదు. ముఖ్య మంత్రికి చీకటి అంటే భయమని, అందుకోసమే ఏడు లోపలే ముగిస్తున్నట్లు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ఎన్నికల పూర్తి కాకముందే వైసీపీ అధినేతకు ఓటమి భయం వెంటాడుతుందన్నది ఆ పార్టీ నేతల మాట.

Related News

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Top 20 News @ 6 PM: అందెశ్రీ ఇక లేరు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Lokesh Tweet: ఇది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడి.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

TTD Staff Suspended: తిరుమలలో మరో అపచారం.. నాన్ వెజ్ తింటూ దొరికిన టీటీడీ సిబ్బంది.. ఇద్దరిపై వేటు

Roja: ఇక చెన్నైలోనే రోజా? ఎన్న తలైవా.. ఆ పార్టీలో పదవి ఇరుక్కా?

KA Paul: వార్తల్లోకి కే‌ఏ పాల్.. సుప్రీంకోర్టు గరంగరం, ఏం జరిగింది?

Big Stories

×