BigTV English

Lok Sabha Elections 2024: తొలి విడత ఎన్నికల్లో.. 252 మంది అభ్యర్థులు నేరస్తులే.. కోటీశ్వరుల సంఖ్య ఎంతంటే..?

Lok Sabha Elections 2024: తొలి విడత ఎన్నికల్లో.. 252 మంది అభ్యర్థులు నేరస్తులే.. కోటీశ్వరుల సంఖ్య ఎంతంటే..?
Lok Sabha Elections:
Lok Sabha Elections:

Lok Sabha Elections 2024: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన సరే ఎన్నికల హడావుడినే కనిపిస్తుంది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా సరే.. ఎన్నికలు, పోటీ చేసే అభ్యర్థుల గురించే చర్చ జరగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్ ఓ నివేదికను విడుదుల చేసింది. ఈ విశ్లేషణ ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో సగం మంది నేర చరితులు ఉన్నవారేనని వారు దాఖలు చేసిన అఫిడివిట్ ఆధారంగా వెల్లడించింది.


ఈ లోక్ సభ ఎన్నికల తొలి దశలో దాదాపు సగం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై నేర పూరితమైన కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్ విశ్లేషించింది. మొత్తం 102 స్థానాలకు గాను 42 సీట్లలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది నేర చరితులైన అభ్యర్థులే ప్రధాన పార్టీల తరఫున ఎన్నికల బరిలో నిలిచారని తెలిపింది.

మొత్తం దేశవ్యాప్తంగా దాఖలైన 1618 మంది ఎన్నికల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది. అందులో 252 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. వారిలో 161 మందిపై తీవ్రమైన నేరాభియోగాలున్నాయని వెల్లడించింది. 35 మంది పోటీ దారులపై విద్వేష ప్రసంగాల కేసులున్నాయని స్పష్టం చేసింది.


Also Read: ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న కేంద్ర మాజీ మంత్రి..!

ప్రస్తుతం జరగబోయే తొలి విడత ఎన్నికల్లో 41 శాతం సీట్లలో రెడ్ అలర్ట్ ప్రకటించాలని ఏడీఆర్ సూచించింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసే వారిలో 28 శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులేనని ప్రటకటించింది. ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ, టీఎంసీ అభ్యర్థుల్లో 40 శాతం మంది ఏదో ఒక నేరానికి పాల్పడిన వారేనని తన విశ్లేషణలో వెల్లడించింది.

Tags

Related News

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

Big Stories

×