E-Paper
Advertisement

AP GOVT: మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. ఇకపై ప్రజల వంతు, ఏప్రిల్ ఒకటి నుంచి అమలు

AP GOVT: మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. ఇకపై ప్రజల వంతు, ఏప్రిల్ ఒకటి నుంచి అమలు
Advertisement

AP GOVT: అవకాశం వచ్చినప్పుడల్లా జనాభా పెంచాలని పదే పదే సీఎం చంద్రబాబు చెబుతున్నారు. చెప్పడమే కాదు.. చేసి చూపించామని నిరూపించారు. తాజాగా జనాభా పెంపు ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది.. ఇక తేల్చుకోవాల్సింది ప్రజలే.

జనాభా పెంపు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

Advertisement

దేశంలో జనాభా తగ్గిపోతుందని పెంచాలని పలు వేదికలపై సీఎం చంద్రబాబు చెబుతున్నారు. దానికి సంబంధించి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. కొద్దిరోజులుగా దీనిపై ప్రభుత్వం సైలెంట్ కావడంతో ప్రజలు ఆసక్తి చూలేదు. తాజాగా గురువారం అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.

ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కంటే డెలివరీ సమయంలో ఒక్కో బేబీకి రూ. 25 వేల చొప్పున ప్రోత్సాహకం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు ఆయా పిల్లలను 18 ఏళ్ల వరకు ఉచితంగా విద్య అందిస్తామని తేల్చి చెప్పారు. కేవలం సామాన్యులకే కాదు ఉద్యోగాలు చేసినవారిని వర్తిస్తుందని తేల్చి చెప్పారు. ఇద్దరు మించితే ప్రభుత్వోద్యోగులకు సెలవులు ఇస్తామని వివరించారు.

Advertisement

అసెంబ్లీలో ప్రకటన.. ఏప్రిల్ ఒకటి నుంచి అమలు

దీనికి సంబంధించి శాసనసభలో ముసాయిదా ప్రకటన విడుదల చేశారు. ఒకప్పుడు ఒకరు ముద్దు.. ముగ్గురు వద్దన్నామని, ఇప్పుడు ఒకరు వద్దు.. ముగ్గురు ముద్దు అని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడున్న 1.5 శాతం సంతానోత్పత్తి రేటు 2.1కి చేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరహా పద్దతిని దేశంలోని తొలిసారి ప్రవేశపెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.

దీనికి సంబంధించిన ముసాయిదాను ఆన్‌లైన్‌లో పెడుతున్నామని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులపాటు చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు చేయాలని ఆలోచన చేస్తోంది కూటమి ప్రభుత్వం. అంతేకాదు జనాభా నిర్వహణపై నెలలో నాలుగో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది ప్రభుత్వం.

ALSO READ: ఎమ్మెల్యే కొలికపూడి సంచలన వ్యాఖ్యలు.. చంపేందుకు కొందరు ప్లాన్

1997లో కుటుంబ నియంత్రణకు మాదిరిగా జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సంతానానికి రూ. 25 వేలు ప్రొత్సాహకం ప్రభుత్వం ఇవ్వనుంది. ఇక పిల్లలు పుట్టిన నుంచి వారి పోషణ కోసం ప్రతీ నెల వెయ్యి రూపాయల చొప్పున ఐదేళ్ల వరకు ఇవ్వనుంది. అలాగే 18 ఏళ్లు వచ్చేవరకు ఉచిత విద్య కూడా అందించనుంది.

ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంద పిల్లలుంటే ఏడాదిపాటు పేరెంటల్ లీవ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వనుంది. తండ్రి రెండు నెలలు పేటర్నల్ లీవ్ కూడా. ఇక మహిళలకు సీ క్యాబ్స్, వర్కింగ్ వుమెన్ హాస్టళ్లు ఏర్పాటు చేయనుంది. ఇక పదవీ విరమణకు ముందు ఉద్యోగులకు రెండు వారాల పాటు వెల్నెస్ లీవ్ ఉండనుంది. ఇక ఆరోగ్య నిధి కింద రూ. 50 వేలు అందించనుంది. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రెండువారాలకు ఒకసారి ప్రత్యేక క్లినిక్స నిర్వహిస్తామని తెలిపారు.  ఏప్రిల్ ఒకటి నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×