AP Assembly Session-2026: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు బుధవారం ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. సభలో ప్రారంభం కాగానే వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసింది.
ఏపీలో శాంతిభద్రతలు కాపాడాలని వైఎస్సార్‌సీపీ సభ్యుల నినాదాలు చేశారు. అంతేకాదు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు. సమావేశాల తర్వాత ఉభయసభలు గురువారం నాటికి వాయిదా పడనున్నాయి. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. శనివారం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. గవర్నర్ ప్రసంగించారు.
గవర్నర్ ప్రపంగంలో కీలకమైన పాయింట్లు
గడిచిన 19 నెలలుగా మా ప్రభుత్వం పునరుద్దరణ నుంచి ప్రగతి వైపు పయనిస్తోందని ప్రస్తావించారు గవర్నర్. ఈ కాలంలో అమలు చేసిన సూపర్-6, ఇతర సంక్షేమ పథకాలపై ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా అభివృద్ది కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించడంపై దృష్టి సారించినట్టు చెప్పుకొచ్చారు. సంపద సృష్టించే ప్రగతి చక్రాన్ని నిర్మించేందుకు 10 సూత్రాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
ఏపీలో శాశ్వత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కేంద్రం సహకారంతో నిర్మాణం జరుగుతోందన్నారు. ముఖ్యంగా విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రోరైలు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సర్వాంధ్ర 2047 లక్ష్యంగా ఏపీ అడుగులు వేస్తోందన్నారు. వికసిత్ భారత్ ద్వారా గ్రామస్థాయిలో ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు.
కేంద్రం సహకారంతో రాజధాని నిర్మాణం
మహిళా శిశు సంక్షేమం, భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకున్నట్లు ప్రస్తావించారు. టెక్నాలజీ ఉపయోగించుకుని భద్రతా రంగాన్ని మరింత పటిష్టం చేసినట్టు చెప్పుకొచ్చారు. మెగా డీఎస్సీని నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామన్నారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించిన గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. స్త్రీ శక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతీ రైతుకు ఏడాదికి 25 వేలు ఇస్తున్నట్లు తెలిపారు.
పేదలకు ఏడాదికి మూడు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అరకు కాఫీకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చినట్టు వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంగా పెరుగుపడుతోందని, అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 2027 కు ముందే పోలవరం పూర్తి చేస్తామని తెలియజేశారు. నల్లమల సాగర్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ఇరిగేషన్ వ్యవస్థ గేమ్ ఛేంజర్ గా నిలిందన్నారు. అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్ గా మారిందన్నారు. రాష్ట్ర ఇండస్ట్రీయల్ పాలసీ ఆకర్షణీయంగా ఉందని, విద్యుత్ రంగంలోనూ వినూత్న సంస్కరణలు తీసుకొచ్చినట్టు గవర్నర్ చెప్పుకొచ్చారు. దేశ, అంతర్జాతీయ వేదికల్లో పెట్టుబడులకు బలమైన కేంద్రంగా ఏపీ నిలిచిందన్నారు.